diploma semester question paper leak in Abdullapurmet డిప్లమా సెమిస్టర్ ప్రశ్నాపత్రం లీక్.. స్వాతి ఇంజనీరింగ్ కాలేజీ పాత్ర..

Diploma semester question paper leak in abdullapurmet of telangana

diploma semester question paper leak, diploma question paper leak, diploma question paper leaked on social media, diploma question paper leaked, diploma question paper leak swathi institute of Engineering and technology, diploma question paper leak abdullapurment, diploma question paper leak rangareddy, diploma question paper leak hayathnagar, diploma question paper leak telangana, Technical Education department

Diploma Semester question paper leaked in Swathi Institute of Engineering and Technology at Abdullapurmet of Hayathnagar in Telangana. The question paper is circulated on social media. With the complaint of Technical Education department the police officials booked a case against the institute,

డిప్లమా సెమిస్టర్ పరీక్షలు: ప్రశ్నాపత్రం లీక్.. స్వాతి ఇంజనీరింగ్ కాలేజీ పాత్ర..

Posted: 02/11/2022 03:34 PM IST
Diploma semester question paper leak in abdullapurmet of telangana

తెలంగాణలో ప్రశ్నాపత్రం లీక్ వ్యవహరం వెలుగుచూసింది. పాలిటెక్నిక్‌ డిప్లొమా పరీక్ష ప్రశ్నపత్రాలు లీక్‌ కావడం సంచలనం సృష్టించింది. హైదరాబాద్‌ శివారులోని స్వాతి ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ కళాశాలలో ప్రశ్నాపత్రాలు సామాజిక మాధ్యమాల ద్వారా లీక్‌ అయినట్టు బయటపడింది. ఈమేరకు రాష్ట్ర సాంకేతిక విద్యమండలి అధికారుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. కళాశాల చీఫ్‌ సూపరింటెండెంట్‌, అడ్మినిస్ట్రేషన్‌ అధికారి, ఆచార్యుడి ద్వారానే ప్రశ్నా పత్రాలు లీక్‌ అయినట్టు బయటపడింది. వీరి ముగ్గురిని అదుపులోకి తీసుకుని పోలీసులు ప్రశ్నిస్తున్నారు.

హైదరాబాద్ నగర శివారు అబ్దుల్లాపూర్‌మెట్ లోని స్వాతి ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ కళాశాల ద్వారా ప్రశ్నాపత్రాలు లీకేజీ అయినట్టు రాష్ట్ర సాంకేతిక విద్యా మండలి అధికారులు గుర్తించారు. ఈ నెల 8 నుంచి పరీక్షలు కొనసాగుతున్నాయి. అయితే వాట్సాప్‌ ద్వారా ప్రశ్నా పత్రాలు స్వాతి ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ కళాశాల విద్యార్ధులకు పరీక్ష ప్రారంభం కంటే ముందుగా లీక్‌ అయినట్టు బయటపడింది. కళాశాల విద్యార్ధుల ద్వారా ఇతర కళాశాలల విద్యార్ధులకు ప్రశ్నా పత్రాలు వాట్సాప్‌ ద్వారా వెళ్లినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. కళాశాల చీఫ్‌ సూపరింటెండెంట్‌ వెంకటేశ్వర్లు, అడ్మినిస్ట్రేషన్‌ అధికారి కృష్ణ మూర్తి, ఆచార్యుడు కృష్ణ మోహన్‌ ద్వారా ప్రశ్నాపత్రం లీక్‌ అయినట్టు తేలింది.

పరీక్షలు ప్రారంభమైనప్పటి నుంచే కళాశాలలో పనిచేసే చీఫ్‌ సూపరింటెండెంట్‌ వెంకటేశ్వర్లు, అడ్మినిస్ట్రేషన్‌ అధికారి కృష్ణమూర్తి, ఆచార్యుడు కృష్ణ మోహన్‌ కలిసి లీకేజీ తతంగం కొనసాగిస్తున్నట్టు పోలీసులు భావిస్తున్నారు. అయితే కళాశాల విద్యార్థులకే కాకండా ఇంకా ఎవరెవరికి ప్రశ్నాపత్రాలు చేరాయి అనే విషయంపై పోలీసులు లోతుగా ఆరా తీస్తున్నారు. ప్రస్తుతం స్వాతి ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ కళాశాల, పరీక్ష కేంద్రాన్ని మూసివేశారు. అయితే ఈ వ్యవహారంతో మొత్తం పరీక్షలు రద్దయ్యే అవకాశం ఉందని విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. లీకేజీపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఇందుకు కారకులైన వారిని ప్రశ్నిస్తున్నారు. వీరిని అరెస్టు చేసే అవకాశం ఉంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles