APCID arrests Devineni Uma for obstruting duties టీడీపీ నేత‌ దేవినేని ఉమా మ‌హేశ్వ‌ర‌రావు అరెస్ట్

Apcid police arrests tdp leader devineni uma for obstruting duties

Devineni Uma, Devineni Uma Arrest, APCiD Police, TDP MLC Ashok Babu, AP CID officials, Guntur CID office, Somireddy chandrashekar reddy, Assistant Commercial Officer, Andhra Pradesh, Politics

The Andhra Pradesh CID Police Officials arrested former state minister and TDP Leader Devineni Uma for creating obstacles in performing their duties. He came to Guntur CID office and wanted to meet the TDP MLC Ashok Babu, who was arrested in a forgery case.

అశోక్ బాబు పరామర్శించేందుకు వెళ్లిన దేవినేని ఉమ అరెస్టు

Posted: 02/11/2022 04:22 PM IST
Apcid police arrests tdp leader devineni uma for obstruting duties

టీడీపీ ఎమ్మెల్సీ అశోక్ బాబును గ‌త‌ అర్ధరాత్రి సీఐడీ అరెస్టు చేసి.. ఇవాళ న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచిన విషయం తెలిపింది. ప్ర‌భుత్వ‌ శాఖలో పనిచేసిన సమయంలో బీకాం చదవకపోయినా చదివినట్లు తప్పుడు ధ్రువీకరణ పత్రం సమర్పించినట్లు ఆరోపణలు రావ‌డంతో సంబంధిత అధికారుల పిర్యాదు మేరకు అశోక్ బాబుపై సిఐడీ పోలీసులు చ‌ర్య‌లు తీసుకున్నారు. అయితే, ప్ర‌జ‌ల‌ హక్కుల కోసం పోరాడుతున్న ప్రభుత్వ ఉద్యోగులకు అండగా ఉన్నందుకే అశోక్ బాబును అక్రమంగా అరెస్టు చేశారని టీడీపీ మండిప‌డింది. వేతన సవరణ విషయంలో ఉద్యోగులకు జరిగిన అన్యాయాన్ని వెంటనే సవరించాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన విషయం తెలిసిందే.

అశోక్ బాబును ప‌రామ‌ర్శించ‌డానికి గుంటూరు సీఐడీ కార్యాల‌యానికి వ‌చ్చిన టీడీపీ నేత దేవినేని ఉమా మ‌హేశ్వర‌రావు పోలీసులు అరెస్టు చేయ‌డం అల‌జ‌డి రేపుతోంది. అశోక్ బాబును క‌లిసేందుకు పోలీసులు అనుమ‌తి ఇవ్వ‌క‌పోవ‌డంతో వారితో దేవినేని ఉమ గొడ‌వ పెట్టుకున్నారు. ఈ నేప‌థ్యంలోనే ఆయ‌న‌ను అరెస్టు చేశారు. మ‌రోవైపు, ఏపీ సీఐడీ పోలీసుల తీరుపై టీడీపీ నేత సోమిరెడ్డి చంద్ర‌మోహ‌న్ రెడ్డి మండిప‌డ్డారు. ''ఎమ్మెల్సీ అశోక్ బాబు అరెస్ట్ ను తీవ్రంగా ఖండిస్తున్నానని అన్నారు. అధికారంలోకి వచ్చి 30 నెలలు దాటినా ఈ రోజుకీ ప్రజాపాలనపై దృష్టిపెట్టకుండా కక్షసాధింపులకే పాలకులు పరిమితమయ్యారని ధ్వజమెత్తారు.

ప్రభుత్వ వైఫల్యాలపై ప్రశ్నిస్తే అక్రమ కేసులు బనాయించి అరెస్ట్ చేయడమే పనిగా పెట్టుకున్నారని.. పాలకులు ప్రజా వ్యతిరేక పాలన సాగిస్తున్నా.. విపక్ష నేతలు చేతులు కట్టుకుని కూర్చోవాలా.? అని ప్రశ్నించారు. ప్రభుత్వ ఉద్యోగుల విషయంలో ప్రభుత్వ కుట్రలపై ధ్వజమెత్తినందుకే అశోక్ బాబు అరెస్ట్. ఇలాంటి అక్రమ అరెస్టులు ఎల్లకాలం కొనసాగించలేరు. జ‌గ‌న్ నియంతృత్వ పాలనకు త్వరలోనే ప్రజలు చరమగీతం పాడేందుకు సిద్ధంగా ఉన్నారు'' అని సోమిరెడ్డి ట్వీట్ చేశారు. కాగా, అశోక్ బాబును త‌ప్పుడు కేసులో ఇరికించార‌ని టీడీపీ నేత‌లు మండిప‌డుతున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles