Helicopter crash: Sole survivor Varun Singhdies in hospital హెలికాప్టర్ ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ.. గ్రూప్ కెప్టెన్ వరుణ్ సింగ్ మృతి

Group captain varun singh dies was sole survivor of chopper crash

Group Captain Varun Singh, Chopper crash, Chopper crash news, Tamil Nadu chopper crash, Tamil Nadu military chopper crash, Indian Air Force

Group Captain Varun Singh, who was rescued after the helicopter crash that killed Chief of Defence Staff General Bipin Rawat and 12 others on December 8, died today. Group Captain Singh was being treated for severe burns at a Bengaluru military hospital after he was moved from Wellington in Tamil Nadu's Coonoor.

హెలికాప్టర్ ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ.. గ్రూప్ కెప్టెన్ వరుణ్ సింగ్ మృతి

Posted: 12/15/2021 01:25 PM IST
Group captain varun singh dies was sole survivor of chopper crash

భారత త్రివిధ దళాల అధిపతి జనరల్ బిపిన్ రావత్ ఈ నెల 8న హెలికాప్టర్ క్రాష్ లో మరిణించిన విషయం తెలిసిందే. కాగా ఈ హెలికాప్టర్ ప్రమాదఘటనలో ప్రాణాలతో బయటపడి ఆసుపత్రిలో బెంగుళూరులోని ఆర్మీ అసుపత్రిలో చికిత్ప పోందుతున్న ఒకే ఒక్కరు గ్రూప్ కెప్టెన్ వరుణ్ సింగ్.. ప్రమాదం జరిగిన ఎనిమిది రోజుల తరువాత ఇవాళ పోరాటాన్ని విరమించాడు. ఆయన చికిత్స పోందుతూ ఇవాళ బెంగళూరులోని ఆర్మీ ఆసుపత్రిలోనే కన్నుమూశారు. ఈ నెల 8న ప్రమాదం అనంతరం ఆయనను కూనూరులోని వెల్లింగ్టన్ అసుపత్రికి తరలించిన చికిత్స అందించారు.

ఆయన పరిస్థితి నిలకడగా వున్నా.. విషమంగానే ఉండడంతో.. ఆయనను బెంగుళూరులోని ఆర్మీ ఆసుపత్రికి తరలించి.. చికిత్స అందించారు. ఆయనను కాపాడేందుకు ఆర్మీ వైద్య బృందాలు చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. కాగా, గ్రూప్ కెప్టెన్ వ‌రుణ్ సింగ్ తుది శ్వాస విడ‌వ‌డంపై రాష్ట్ర‌ప‌తి, ప్ర‌ధానితో స‌హా ప‌లువురు కేంద్ర మంత్రులు ట్విట్ట‌ర్ వేదిక‌గా స్పందించారు. ఈ మాతృభూమి కోసం అత్యంత ధైర్య ప‌రాక్ర‌మాల‌తో ఆయ‌న సేవ‌లు చేశార‌ని కొనియాడారు.

రాంనాథ్ కోవింద్ (రాష్ట్ర‌పతి)
ఈ దేశం ఆయ‌న‌కు ఎంతో రుణ‌ప‌డి ఉంటుంది. ఆయ‌న చూపిన ధైర్య సాహ‌సాలు, పరాక్ర‌మం అద్భుత‌మైన‌వి. వారి కుటుంబానికి ప్ర‌గాఢ సానుభూతి వ్య‌క్తం చేస్తున్నాను.

న‌రేంద్ర మోదీ (ప్ర‌ధాన మంత్రి)

కెప్టెన్ వ‌రుణ్ సింగ్ మృతి చెంద‌డం చాలా బాధ‌గా ఉంద‌ని ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ పేర్కొన్నారు. అత్యంత గ‌ర్వంగా, వృత్తి నిపుణ‌త‌తో ఈ మాతృభూమికి సేవ‌లు చేశార‌ని ట్విట్ట‌ర్ వేదిక‌గా ప్ర‌ధాని కొనియాడారు. ఆయ‌న మ‌ర‌ణించ‌డం చాలా బాధ‌గా ఉంద‌ని, దేశం కోసం ఆయ‌న చేసిన సేవ‌లు ప్ర‌జ‌లెప్ప‌టికీ మ‌రిచిపోర‌ని, వారి కుటుంబ స‌భ్యుల‌కు ప్ర‌గాఢ సానుభూతిని వ్య‌క్తం చేస్తున్నాన‌ని మోదీ ట్వీట్ చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles