Telangana reports first two cases of Omicron అప్రమత్తం: తెలంగాణలోకి తన ప్రభావాన్ని విస్తరించిన ఒమిక్రాన్..

Omicron spreads its tentacles in telangana hyderabad reports two cases

coronavirus, Dr. Srinivas Rao, Omicron Variant, Health Department, Foreigners, omicron cases in Telangana, omicron cases in hyderabad, Kenaya national omicron, somalia national Omicron, 7yr old omicron, RT-PCR tests, Covid Tests at RGIA Airport, Crime

Three cases of the newly detected Omicron Covid variant have been reported in Telangana's Hyderabad. A seven-year-old is also among the infected people. The cases were reported after one 24-year-old Kenya national and a Somalia national arrived in Hyderabad. Another seven-year-old who was flying to Kolkata also tested positive for the new variant on arrival in Hyderabad.

తెలంగాణలోకి తన ప్రభావాన్ని విస్తరించిన ఒమిక్రాన్.. ఇద్దరు విదేశీయులకు..

Posted: 12/15/2021 12:34 PM IST
Omicron spreads its tentacles in telangana hyderabad reports two cases

తెలంగాణ‌లోకి ఒమిక్రాన్ వేరియంట్ ప్ర‌వేశించింది. హైదరాబాద్ లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగిన ఇద్ద‌రు విదేశీయులు ఒమిక్రాన్ సోకింది. ఈ విషయాన్ని తెలంగాణ వైద్యారోగ్య సంచాల‌కులు శ్రీనివాస్ రావు మీడియాకు వెల్ల‌డించారు. విమానాశ్రయంలో వీరికి కరోనా పరీక్షలు నిర్వహించగా, వారికి పాజిటివ్ గా తేలిందని, అయితే వారిని నుంచి నమూనాలను తీసుకుని జీనోమ్ సీక్వెన్సింగ్ కు పంపగా వారికి సోకింది ఒమిక్రాన్ వేరియంటేనని పరీక్షలలో నిర్థారణ అయ్యిందని శ్రీనివాసరావు మీడియాకు తెలిపారు. కాగా, వీరు ఈ నెల 12న కెన్యా, సోమాలియా నుంచి శంషాబాద్ విమానాశ్రయానికి వ‌చ్చినట్లు తెలిపారు.

కెన్యా జాతీయురాలి వ‌య‌సు 24 ఏండ్లు కాగా, సోమాలియా దేశ‌స్థుడి వ‌య‌సు 23 ఏండ్లు అని పేర్కొన్నారు. 12వ తేదీనే వీరిద్ద‌రి శాంపిల్స్ సేక‌రించి జీనోమ్ సీక్వెన్స్‌కు పంపామ‌ని, నిన్న రాత్రి ఫ‌లితాలు వ‌చ్చాయ‌న్నారు. వీరిద్ద‌రికి ఒమిక్రాన్ పాజిటివ్ అని తేలింద‌న్నారు. కెన్యా జాతీయురాలిని టిమ్స్‌కు త‌ర‌లించాం. సోమాలియా దేశ‌స్థుడిని ట్రేస్ చేస్తున్నామని తెలిపారు. వారిద్ద‌రూ హైద‌రాబాద్‌లోని టోలీచౌకిలో ఉండ‌డానికి వ‌చ్చార‌ని వివ‌రించారు. ఒమిక్రాన్ సోకిన వారిలో ల‌క్ష‌ణాలు స్వ‌ల్పంగా క‌న‌ప‌డుతున్నాయని ఆయ‌న అన్నారు. త‌ల‌నొప్పి, నీరసం, జ‌లుబు, ద‌గ్గు వంటివి ఉంటున్నాయని వివ‌రించారు.

అయితే వీరి కుటుంబ స‌భ్యుల‌కు కూడా ఆర్టీపీసీఆర్ ప‌రీక్షలు నిర్వ‌హించామ‌న్నారు. ఇక మూడో వ్య‌క్తికి కూడా ఒమిక్రాన్ పాజిటివ్ గా నిర్ధారణ అయ్యిందని ప్రజారోగ్య సంచాలకులు తెలిపారు. అత‌ని వ‌య‌సు ఏడేండ్లు మాత్ర‌మే. ఈ బాలుడి ప‌శ్చిమ బెంగాల్‌ కు చెందిన వాడు. శంషాబాద్ ఎయిర్‌పోర్టులో దిగిన వెంట‌నే కోల్‌క‌తాకు వెళ్లాడ‌ని, రాష్ట్రంలోకి ప్ర‌వేశించ‌లేద‌ని శ్రీనివాస్ రావు స్ప‌ష్టం చేశారు. ప్ర‌స్తుతం 77 దేశాల్లో ఒమిక్రాన్ కేసులు ఉన్నాయని తెలిపారు. ప్ర‌జ‌లు అజాగ్ర‌త్తతో వ్య‌వ‌హ‌రిస్తే వారి కుటుంబ స‌భ్యులు కూడా ఒమిక్రాన్ బారిన‌ప‌డే అవ‌కాశం ఉంటుంద‌ని చెప్పారు.

ఒమిక్రాన్ వేరియంట్‌ను అడ్డుకునే ఆయుధం మాస్క్ మాత్ర‌మే అని తెలంగాణ ప్ర‌జారోగ్య సంచాల‌కులు డాక్ట‌ర్ శ్రీనివాస్ రావు స్ప‌ష్టం చేశారు. వ్యాక్సిన్ వేసుకున్నా.. అప్ర‌మ‌త్త‌త అవ‌స‌రం అన్నారు. ప్ర‌తి ఒక్క‌రూ మాస్కు ధ‌రించాల‌న్నారు. అప్పుడే ఒమిక్రాన్‌ను అడ్డుకోవ‌చ్చు అని తెలిపారు. తెలంగాణ‌, హైద‌రాబాద్‌లో స్థానికుల‌కు ఒమిక్రాన్ వేరియంట్ వ్యాప్తి చెంద‌లేదు. ప్ర‌జ‌లు ఆందోళ‌న చెందాల్సిన అవ‌స‌రం లేదు. సోష‌ల్ మీడియాలో వ‌చ్చే అస‌త్య వార్త‌ల‌ను న‌మ్మొద్దు. ఆ వార్త‌లు వైర‌స్ కంటే ప్ర‌మాద‌క‌రం. అప్ర‌మ‌త్త‌తో, జాగ్ర‌త్త‌తో ఉండాల్సిన స‌మ‌య‌మిది.

ఈ క్ర‌మంలో మాస్కును త‌ప్ప‌నిస‌రిగా ధ‌రించ‌డం అల‌వాటు చేసుకోవాలి. సామాజిక దూరం పాటిస్తూనే.. వంద శాతం మాస్కు ధ‌రించాలి అని విజ్ఞ‌ప్తి చేశారు. క‌రోనా టెస్టుల సంఖ్య‌ను పెంచడానికి చ‌ర్య‌లు తీసుకుంటున్నాం. వేలాదిగా హోం ఐసోలేష‌న్ కిట్లు సిద్ధం చేస్తున్నాం. ప్ర‌భుత్వ ఆస్ప‌త్రుల్లో బెడ్స్ ను సిద్ధం చేశామ‌న్నారు. ప్ర‌జ‌లంద‌రూ ప్ర‌భుత్వానికి స‌హ‌క‌రించాల‌న్నారు. ఒమిక్రాన్ వేరియంట్‌ను ఎదుర్కొనేందుకు ప్ర‌భుత్వం, వైద్యారోగ్య శాఖ సిద్ధంగా ఉంద‌న్నారు. అధికార యంత్రాంగం అప్ర‌మ‌త్త‌తో ఉంద‌ని శ్రీనివాస్ రావు స్ప‌ష్టం చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : coronavirus  Dr. Srinivas Rao  Omicron Variant  Health Department  Foreigners  Telangana  Crime  

Other Articles