MP moves SC against extension of tenure of CBI, ED directors సీబీఐ, ఈడీ డైరెక్టర్ల పదవీకాలం పొడగింపుపై ‘సుప్రీం’ విచారణ

Tmc mp moves supreme court against centre s ordinances to extend tenure of cbi ed directors

Central Bureau of Investigation, CBI, Enforcement Directorate, ED, Mahua Moitra, Lok Sabha MP Mahua Moitra, TMC, CBI Ed directors tenures increased, supreme court, Advocate M.L. Sharma, Delhi Special Police Establishment

Lok Sabha MP Mahua Moitra moved the Supreme Court against two ordinances brought out by the Centre under which the tenure of directors of the CBI and the Enforcement Directorate can now be extended by up to three years after the mandated term of two years.

సీబీఐ, ఈడీ డైరెక్టర్ల పదవీకాలం పొడగింపుపై ‘సుప్రీం’ విచారణ

Posted: 11/25/2021 05:35 PM IST
Tmc mp moves supreme court against centre s ordinances to extend tenure of cbi ed directors

కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ), ఈడీ (ఎన్స్ ఫోర్స్ మెంట్‌ డైరెక్టరేట్‌) డైరెక్టర్ల పదవీకాలాన్ని రెండేళ్ల నుంచి ఐదేళ్ల కాలానికి పొడగించడాన్ని సవాల్‌ చేస్తూ దాఖలైన పిటిషన్లపై గురువారం దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు విచారణ జరిపింది. సీబీఐ, ఈడీ డైరెక్టర్ల పదవీకాలాన్ని ఐదేళ్ల పాటు పొడగిస్తూ ఇటీవల కేంద్రం ఆర్డినెన్స్‌ జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ ఆర్డినెన్స్‌ను సవాల్‌ చేస్తూ ఎంఎల్‌ శర్మ అనే న్యాయవాది పిటిషన్‌ దాఖలు చేశారు. ఆర్డినెన్స్‌పై సత్వరమే విచారణ చేపట్టాలని కోర్టును కోరారు. పిటిషన్‌ విచారణ తేదీని త్వరలోనే నిర్ణయిస్తామని సీజేఐ జస్టిస్‌ ఎన్వీ రమణ పేర్కొన్నారు.

కేంద్రం తీసుకువచ్చిన ఆర్డినెన్స్‌ రాజ్యాంగ విరుద్ధమని, ఏకపక్షమని పిటిషనర్‌ ఆరోపించారు. సభలో మెజారిటీ లేకుండా ఆర్డినెన్స్‌ జారీ చేసే హక్కు ప్రభుత్వానికి లేదన్నారు. కాగా, సీబీఐ, ఈడీ డైరెక్టర్ల పదవీకాలాన్ని పొడగిస్తూ కేంద్రప్రభుత్వం ఆర్డినెన్స్ జారీ చేయడాన్ని విపక్షాలు సైతం వ్యతిరేకిస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ సైతం ఈ ఆర్డినెన్సులకు వ్యతిరేకంగా అత్యున్నత న్యాయస్థానంలో పిటీషన్ దాఖలు చేసింది. ఈ మేరకు కాంగ్రెస్ జాతీయ అధికార ప్రతినిధి రణదీప్‌ సూర్జేవాలా ఆర్డినెన్స్‌పై పిటిషన్‌ దాఖలు చేశారు. ఆర్డినెన్స్‌ను రద్దు చేయాలని కోరారు. అలాగే టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రా కూడా పిటిషన్‌ దాఖలు చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : CBI  ED  Mahua Moitra  TMC  CBI Ed directors tenures increased  supreme court  

Other Articles