Teenmaar Mallanna sensational allegations on Telangana govt తెలంగాణ ప్రభుత్వంపై తీన్మార్ మల్లన్న సంచలన అరోపణలు

Teenmaar mallanna sensational allegations on telangana goverment

Teenmaar Mallanna, Arrest, chikadpally police, Astrologer, Lakshmikant Sharma, Blackmailing, Hyderabad Police,Q News Office, Police Raids, CM KCR, Srinivas Goud, Corruption, Telangana Rashtra Samithi, TRS social media convenor Krishank, Youtube channel, Cybercrime police, Telanagana, politics, Crime

Popular political activist and journalist Chintapandu Naveen Kumar alias Teenmaar Mallanna had mad sensational allegation on Telangana Government. The Q news Youtube Channel head alleged that the had attempted to kill him in Jail.

తెలంగాణ ప్రభుత్వంపై తీన్మార్ మల్లన్న సంచలన అరోపణలు

Posted: 11/15/2021 04:17 PM IST
Teenmaar mallanna sensational allegations on telangana goverment

తీన్మార్ మల్లన్నగా తెలంగాణ ప్రజలకు సుపరిచుతుడైన జర్నలిస్ట్.. క్యూ న్యూస్ యూట్యూబ్ ఛానెల్ అధినేత అలియాస్ చింతపండు నవీన్‌ తాజాగా ప్రభుత్వంపై సంచలన అరోపణలు చేశారు. తనను ప్రభుత్వం హతమార్చేందుకు యత్నించిందని.. దానిని తప్పించుకుంటే తనను పిచ్చివాడిని కూడా చేసేందుకు బలవంతంగా ప్రయత్నాలు చేసిందని అరోపించారు. అయితే తాను ప్రభుత్వంపై చేస్తున్న అరోపణల్లో నిజమందని తెలిసిన ప్రజలు, తన యూట్యూబ్ ప్రేక్షకుల దీవెనలు, అశీస్సులతో తాను ప్రభుత్వ కుట్రలను, కుటిల యత్నాలకు తప్పించుకుని బయటకు రాగలిగానని చెప్పారు.

రాష్ట్రంలో ఇటీవల జరిగిన గ్రాడ్యూయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలలో ఆయన కొద్దిపాటి మెజారిటీతో అధికార టీఆర్ఎస్ అభ్యర్థి చేతిలో ఓటమిని చవిచూసిన తరుణంలో ఆయనను అధికార పార్టీ టార్గెట్ చేసి అరెస్టు చేసిందన్న అరోపణలు వెలువెత్తిన విషయం తెలిసిందే. అయితే తనను బ్లాక్ మెయిల్ చేసి బెదిరించాడన్న జ్యోతిష్యుడు లక్ష్మీకాంతశర్మ ఇచ్చిన పిర్యాదుతో పాటు నిజామాబాద్ జిల్లాలో ఓ కల్లు వ్యాపారిని బెదిరించి డబ్బులు దండుకున్నాడన్న అభియోగాలతో ఆయనను అరెస్టు చేసి పలుమార్లు ఆయన కార్యాలయాలపై దాడులు చేసిన పోలీసులు.. కార్యాలయంలోని 10 కంప్యూటర్లు, 15 హర్డ్‌ డిస్క్‌లు, కేబుల్‌ పత్రాలు, పుస్తకాలు తీసుకెళ్లిన విషయం తెలిసిందే.

కాగా, జైలు నుంచి బయటకు వచ్చిన ఆయన తనను ప్రభుత్వ హతమార్చే చర్యలకు పాల్పడిందని సంచలన అరోపణలు చేశాడు. భవిష్యత్ కార్యచరణ అన్న పేరుతో ఘట్ కేసర్ మండలం కొర్రెములలో సదస్సు నిర్వహించిన ఆయన ఆ సందర్భంగా మాట్లాడుతూ. జైలులోనే తనను అంతమొందించాలని ప్రయత్నించారని ఆరోపించారు. అక్టోబరు 2న గాంధీ జయంతి రోజున పాత నేరస్థుల సహకారంతో తనను చంపాలని ప్రయత్నించారని ఆయన ఆరోపించారు. అయితే, వారి ప్రయత్నం విఫలం కావడంతో తర్వాతి రోజు జైలులో తనను ఓ చీకటి గదిలో బంధించారని అన్నారు. మానసిక దివ్యాంగులకు ఇచ్చే ఔషధాలను బలవంతంగా తనకు ఎక్కించి పిచ్చివాడిని చేయాలనుకున్నారని మల్లన్న ఆరోపించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles