Congress party to Fight UP elections independently యూపీ ఎన్నికలలో ఒంటరిగానే కాంగ్రెస్.. అన్ని స్థానాల్లో పోటీ

Uttar pradesh election congress party to contest up elections independently

Uttar Pradesh election, UP Assembly Elections, Congress, Ajay Lallu, Lakhimpur Kheri, Hathras, Unnao, samajwadi party, priyanka gandhi, bjp, Covid-19, Mediacal kits, up polls, uttar pradesh, Politics

Congress party, which is not in power since decades is putting all its efforts, to re-gain back the charisma in the country's largest state in the forth comming assembly elections. For which the party is contesting assembly elections independently,keeping its allies SP and BSP aside.

ఉత్తర్ ప్రధేశ్ ఎన్నికలలో ఒంటరిగానే కాంగ్రెస్.. అన్ని స్థానాల్లో పోటీ

Posted: 11/15/2021 03:29 PM IST
Uttar pradesh election congress party to contest up elections independently

ఉత్తరప్రదేశ్‌ అసెంబ్లీకి వచ్చే ఏడాది జరగనున్న ఎన్నికల్లో కాంగ్రెస్ తన పూర్వవైభవం కోసం పరుగు తీస్తోంది. అచ్చంగా నాయినమ్మ ఇందిరాగాంధీలా వున్నరని, తెలివైన వారని కాంగ్రెస్ నేతలతో పాటు దేశ ప్రజల మన్ననలు అందుకున్న ప్రియాంక గాంధీ ఈ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలను తన భుజస్కంధాలపై వేసుకున్నారు. దేశంలోనే అత్యధిక స్థానాలు కలిగిన రాష్ట్రంలో తమ పార్టీ మళ్లీ పాగా వేయాలని అమె ఉవ్విళ్లూరుతూ పావులు కదుపుతున్నారు. ఈ క్రమంలో రానున్న అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్  ఉత్తర్ ప్రదేశ్ ఎన్నికలలో సింగిల్‌గానే బరిలోకి దిగేందుకు నిర్ణయించింది. ఏ పార్టీతోనూ పొత్తు లేకుండా ముందుకు వెళ్లాలని నిర్ణయం తీసుకుంది.

తాము ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు ఇస్తున్న ఎన్నికల హామీలే తమను గెలిపిస్తాయని పార్టీ నేతలు భావిస్తున్నారు. ప్రజలు సమస్యలతో కొట్టుమిట్టాడుతున్న తరుణంలో తమ పార్టీ తస్ప ఇతర పార్టీలేవి రంగంలోకి దిగి.. ప్రజల తరుపున.. మరీ ముఖ్యంగా బడుగు, బలహీన, అణగారిన వర్గాల వారితో పాటు బాధితు కుంటుంబాల తరపున పోరాటం చేసింది తమ పార్టీయేనని చెప్పారు. మరి ప్రజల ఆక్రంధనలు విన్న రాష్ట్రంలోని విపక్ష పార్టీలు ఏక్కడ.. అని ప్రశ్నిస్తూనే అటు ఎస్సీ, ఇటు బీఎస్సి పార్టీలను టార్గటె చేస్తోంది. ఇదే సమయంలో యూపీ ఎన్నికలలో తమ పార్టీ ఇప్పటికే ప్రకటించిన ఎన్నికల హామీలు కూడా జనరంజకంగా ఉన్నాయని పార్టీ వర్గాలు అంటున్నాయి.

ఏకంగా 40 శాతం స్థానాలు కేవలం మహిళలకు మాత్రమే కేటాయిస్తోందని తమ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ అమె చేసిన ప్రకటనకు కూడా మహిళాలోకం నుంచి పార్టీ వైపు ఆకర్షించేలా చూస్తోందని పార్టీ వర్గాలు అంటున్నాయి. ఇక ఇంటర్ పూర్తి చేసిన అమ్మాయిలకు స్మార్ట్ ఫోన్లు, గ్రాడ్యూయేషన్ పూర్తి చేసిన యువతులకు ఎలక్ట్రిక్ స్కూటర్లు అందిస్తామన్న ప్రకటన కూడా మహిళా యువతను తమ పార్టీ వైపు అకర్షితుల్ని చేస్తోందని అంటున్నాయి. ఇక రాష్ట్ర రైతాంగం తరపున తమ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో పోరాటం చేస్తున్నది తమ పార్టీయేనని అన్నారు. లఖీంపూర్ ఘటనకు వ్యతిరేకించి ప్రియాంక గాంధీ జైలు పాలుయ్యారని అంటున్నాయి.

అది నుంచి రైతుల పక్షాన నిలిచిన తమ పార్టీ రైతులకు వ్యవసాయ సాగు రుణాలను మాఫీ చేస్తోందని కూడా ఎన్నికల హామీని ఇచ్చిందని అన్నారు. అదే సమయంలో రైతుల విద్యుత్ బకాయిలను కూడా మాఫీ చేస్తామని ప్రకటించిందన్నారు. ఈ హామీలతో రాష్ట్ర రైతాంగం తమ వైపుకు ఆశగా చూస్తోందని, తమపార్టీ అధికారంలోకి రావాలని మహిళలు, రైతులు కోరుకుంటున్నారని అన్నారు. రాష్ట్రంలోని ప్రతీ వ్యక్తికి రూ. 10 లక్షల రూపాయల వరకు వైద్యసౌకర్యం ఉచితంగా అందిస్తామన్న హామీతో నగరాలు, పట్టణాలలోని యువత కూడా అసుపత్రుల బిల్లులు కట్టలేక తమ ఎన్నికల హామీని చూపి అకర్షితులవుతున్నారని పార్టీ వర్గాలు తెలిపాయి.

ఈ నేపథ్యంలో ప్రజల తరుపున నిలబడని పార్టీలతో పోత్తులు పెట్టుకుని పరువు పోగొట్టుకుకోవడం కన్నా.. ప్రజలకోసం పోరాటంలో ముందున్న తమను ప్రజలు నమ్ముతున్నారని
 ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ తెలిపారు. బులంద్‌షహర్‌లో కాంగ్రెస్ నిర్వహిస్తున్న ‘ప్రతిజ్ఞ సమ్మేళన్-లక్ష్య 2022’ కార్యక్రమంలో పాల్గొన్న అమె రాష్ట్రంలోని అన్ని స్థానాల్లోనూ కాంగ్రెస్ ఒంటరిగానే పోటీ చేస్తుందన్న ప్రియాంక.. అన్ని స్థానాలకు కాంగ్రెస్ కార్యకర్తలనే నామినేట్ చేస్తామన్నారు. కాంగ్రెస్ ఒంటరిగానే విజయం సాధిస్తుందని అన్నారు. కాగా, యూపీ కాంగ్రెస్ సీఎం అభ్యర్థిగా ప్రియాంక గాంధీ పేరును ప్రకటించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. 2017 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ 7 స్థానాలకు మాత్రమే పరిమితం కాగా, 312 స్థానాలు గెలుచుకున్న బీజేపీ అధికారాన్ని చేపట్టింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles