BJP MP Nayab Saini's Car Rams Into Protesters హర్యానాలోనూ రైతులపైకి దూసుకెళ్లిన బీజేపి ఎంపీ కారు

Haryana one injured after bjp mp nayab sainis convoy allegedly runs over protesting farmers

Nayab Saini, Farmers, Nayab Saini BJP MP, Haryana, Kurukshetra Parliamentary seat, farmer injured, Naraingarh, Ambala, lakhimpur kheri like incident, Farmers demand MP Arrest, Saini Bhawan, Haryana, Politics, Crime

Farmers in Haryana said that one of the cars in Bharatiya Janata Party leader Nayab Saini's convoy reportedly hit people protesting against the Centre's farm laws in Ambala. One farmer is also said to have sustained injuries. The injured farmer has been admitted to a government hospital in Naraingarh near Ambala, where the alleged incident took place.

హర్యానాలోనూ లఖింఫూర్ ఖేరి తరహా ఘటన.. రైతులపైకి దూసుకెళ్లిన బీజేపి ఎంపీ కారు..

Posted: 10/08/2021 12:01 PM IST
Haryana one injured after bjp mp nayab sainis convoy allegedly runs over protesting farmers

ఉత్తర్ ప్రదేశ్ లోని ల‌ఖింపూర్ ఖేరి ఘ‌ట‌న‌ను సృష్టించిన భీభత్సంలో అలుముకున్న విషాధచాయలు ఇంకా కళ్లముందు మొదులుతున్న తరుణంలోనే హర్యానాలోనూ ఇదే తరహాలో ఓ ఘటన చోటుచేసుకుంది. లఖీంపూర్ ఖేరీ ఘటనలో కేంద్రమంత్రి అజయ్ కుమార్ మిశ్రా తనయుడు అశీష్ మిశ్రా రైతులపైకి కారును తొక్కిస్తూ వెళ్లడాని రైతులు అరోపిస్తుండగా, అదే తరహాలో హర్యానాలోనూ ఓ బీజేపి పార్లమెంటు సభ్యుడు రైతులపైకి కారును దూసుకెళ్లేలా చేసి.. అందోళన చేస్తున్న రైతులలో ఒకరి తీవ్రగాయాలకు కారణమయ్యాడని అరోపణలు వస్తున్నాయి.

ఈ ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళ్తే.. బీజేపీ ఎంపీ నయాబ్ సైనీకి చెందిన కారు నిరసన చేస్తున్న రైతులపైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఒకరు తీవ్రంగా గాయపడినట్లు రైతులు ఆరోపించారు. గాయపడిన రైతును అంబాల సమీపంలోని నారిన్‌గఢ్‌ ప్రభుత్వ ఆసుపత్రిలో అడ్మిట్‌ చేశామని, అతడి పరిస్థితి సీరియస్‌గా ఉన్నదని తెలిపారు. తనపైకి బీజేపీ ఎంపీ కారు దూసుకురాగా తృటిలో తప్పించుకున్నట్లు ఒక రైతు ఆరోపించాడు. కురుక్షేత్ర బీజేపీ ఎంపీ నయాబ్ సైనీ, హర్యానా మైనింగ్ మంత్రి మూల్ చంద్ శర్మతో సహా ఇతర పార్టీ నాయకులు నారిన్ గఢ్ లోని సైనీ భవన్‌లో జరిగిన కార్యక్రమానికి హాజరయ్యారు.

కాగా, బీజేపీ నేతల పర్యటనను వ్యతిరేకిస్తూ స్థానిక రైతులు ఆ భవనం బయట పెద్ద సంఖ్యలో గుమిగూడారు. వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా నిరసనకు దిగారు. ప్రధాని నరేంద్రమోడీ నేతృత్వంలోని కేంద్రప్రభుత్వం తీసుకువచ్చిన నూతన సాగు చట్టాలను తక్షణం బేషరుతుగా ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలో తమ సమావేశ కార్యక్రమం ముగియడంతో బయటకు వచ్చిన బీజేపీ ఎంపీ నయాబ్‌ సైనీ కారులో కూర్చోగా.. కారును ముందుకు వెళ్లనీయకుండా రైతులు ఘెరావ్ చేశారు.

కాగా ఆయన కాన్వాయ్ లోని ఓ కారు నిరసన చేస్తున్న రైతులపైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఒక రైతుకు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో హుటాహుటిన రైతులు ఆ రైతును అంబాలాలోని అసుపత్రికి తరలించి చికిత్సను అందిస్తున్నారు. అయితే రైతు పరిస్థితిపై మాత్రం ఇప్పడే ఏమీ చెప్పలేమని వైద్యులు తెలిపారు. ఈ నేపథ్యంలో ఈ ఘటనపై అరోపణలు ఎదుర్కొంటున్న పార్లమెంటు సభ్యుడిపై కేసు నమోదు చేయాలని హర్యానా రైతులు డిమాండ్‌ చేశారు. ఈ నెల 10వ తేదీలోపు ఇది జరుగకపోతే పోలీస్‌ స్టేషన్‌ను ముట్టడిస్తామని వారు హెచ్చరించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles