Murder suspect booked for releasing dog on cops పోలీసులపైకి కుక్కలను ఉసిగొల్పిన నిందితులు

Hyderabad murder suspect booked for releasing dog on cops

Land dispute, Physical attack, Arif, Jubilee hills, police case, banjara hills police station, dog, hyderabad Police, latched dogs, Banjara Hills Inspector, K Shiva Chandra, syed ahmed jafri (71), Hyderabad, Crime

A suspect in a murder attempt case was booked for the second time by the police allegedly for releasing his dog on a police team that went to arrest him. The incident happened at Banjara Hills. According to the police, Syed Ahmed Jafri (71) of Banjara Hills had a dispute with one Arif over a land plot in Jubilee Hills.

కుక్కలను వదిలి తప్పించుకునే యత్నం.. వెంబడించి పట్టుకున్న పోలీసులు

Posted: 10/08/2021 11:04 AM IST
Hyderabad murder suspect booked for releasing dog on cops

భూమి వివాదం కేసులో తన ప్రత్యర్థిపై దాడి చేసిన నిందితులపై పిర్యాదు రావడంతో వారిని విచారించేందుకు వెళ్లిన పోలీసులకు చేధు అనుభవం ఎదురైంది. అయితే ఇదివరకు కూడా ఇలాంటి అనుభవాన్నే చవిచూసిన పోలీసులు వెంటనే తేరుకుని నిందితులను అదుపులోకి తీసుకుని వారిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. సినీనిర్మాత, వైసీపీ నాయకుడు పొట్లూరి వి ప్రసాద్ పై పిర్యాదు నేపథ్యంలోనే ఇలాంటి అనుభవాన్ని చవిచూసిన పోలీసులు ఈ సారి వెంటనే తేరుకుని.. నిందితులను వెంబడించి పట్టుకున్నారు. పోలీసులు తెలిపిన ప్రకారం ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలావున్నాయి.

బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12లో నివసిస్తున్న సయ్యద్ అహ్మద్ హుస్సేన్ జాఫ్రి (71)కి జూబ్లిహిల్స్ లోని ఓ భూమి విషయంలో స్థానికుడైన అరిఫ్ అనే వ్యక్తితో వివాదం నెలకొంది. దీంతో రోడ్డు నెంబరు 86లో వున్న తన ఇంట్లో నివసిస్తున్న అరిప్ పై మంగళవారం రాత్రి దాడి చేశారు. దీంతో జాఫ్రిపై అరిఫ్ పోలీసులకు పిర్యాదు చేశారు. దీంతో బుధవారం పోలీసులు వారిని విచారణకు పిలిచేందుకు వెళ్లారు. అయితే పోలీసులను చూడంగానే జాఫ్రి సహా కుటుంబసభ్యులు.. గది తలుపు పెట్టేసుకున్నారు. అంతటితో ఆగని నిందితులు పోలీసులపైకి వారి పెంపుడు కుక్కలను వదిలారు.

ఇదే తరహా ఘటన సిని నిర్మాత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు పోట్లూరి వి ప్రసాద్ పోలీసుల ఎదుట హాజరుకాకుండా తప్పించుకోవడంతో అతన్ని తీసుకుంచ్చేందుకు వెళ్లిన పోలీసులపైకి జాగిలాలను వదిలిన విషయం తెలిసిందే. దీంతో ఆ ఘటనను గుర్తుకు తెచ్చుకున్న పోలీసులు.. వెంటనే ఉన్నాతాధికారులకు ఫోన్ చేసి సమాచారం అందించారు. మరికొంతమంది పోలీసు బలగాలను జాఫ్రి ఇంటికి పంపించారు ఉన్నతాధికారులు. అయితే నిందితులు ఏమాత్రం భయపడకుండా పోలీసులకు కత్తులు చూపించారు. వాటితో తాము గాయాలు చేసుకుంటామని పోలీసులను బ్లాక్ మెయిల్ చేస్తూ.. ఇంట్లోకి వెళ్లి తలుపులు వేసుకున్నారు.

ఇక అవకాశం లభించిందని బావించిన నిందితులు ఎదురుగా వున్న పోలీసులపైకి లోపలి నుంచి వాటర్ బాటిళ్లను విసిరారు. అదే సమయంలో వారిక కంట పడకుండా ఇంటి వెనుక నుంచి పరారయ్యారు. అనుమానం వచ్చిన పోలీసుల్లో కొందరు వెనుక వైపుకు చేరుకునే సరికి పారిపోతున్న నిందితులను వెంబడించి పట్టుకున్నారు. నిందితులకు సహకరించిన జబీనా (30), షబానా బేగం (25)లను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. అలాగే, శునకాలను ఉసిగొల్పి విధులకు ఆటంకం కలిగించినందుకు నిందితులపై మరో కేసు కూడా నమోదైంది. నిందితులుపై భారత శిక్షాస్మృతి కింద 332, 353., 504, 506, 109 r/w 34 సెక్షన్ల కింద పోలీసులు కేసులు నమోదు చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles