Uttarakhand youth kills leopard in self-defence ఆత్మరక్షణ కోసం చిరుతను చంపిన పశువుల కాపరి

Uttarakhand villager killed leopard with sickle to save own life

Uttarakhand, Leopard, Sickle, goats, Pithoragarh, grazer, wild cat, Leopard, self-defence, Human- animal Conflict, Naresh Singh Saun, forest officials

A 39-year-old goat grazer from Uttarakhand’s Pithoragarh district managed to kill a female leopard with a sickle when attacked by the wild cat while grazing goats in the village. “If I hadn’t hit it with the sickle to protect myself, I wouldn’t be alive today,” said Naresh Singh Saun of Naini-Saini village.

ఆత్మరక్షణ కోసం చిరుతను చంపిన పశువుల కాపరి

Posted: 09/02/2021 09:20 PM IST
Uttarakhand villager killed leopard with sickle to save own life

సాధార‌ణంగా మ‌న‌కు చిరుత‌పులి క‌నిపిస్తే ఏం చేస్తాం..? ప్రాణాలు అరిచేతిలో పెట్టుకుని ప‌రుగులు తీస్తాం..! ఒక‌వేళ అది మ‌న‌ల‌ను గుర్తించి దాడి చేసినా భ‌యంతో కేకలు వేసి.. దాని నుంచి తప్పించుకునే ప్రయత్నాలే చేస్తాము తప్ప.. దానిని ఏ కోశానా ఎదుర్కోనలేము. కానీ ఉత్తరాఖండ్ రాష్ట్రం పితోర్‌గ‌ఢ్ జిల్లాకు చెందిన ఓ మేక‌ల కాప‌రి మాత్రం చిరుతను చంపేశాడు. మేకలను కాసేందుకు వస్తూ.. వెళ్తూ వెళ్తూ.. ఎండు కట్టెలు తీసుకెళ్లేందుకు గాను చేతిలో కొడవలి పట్టుకుని వచ్చిన ఈయన.. అదే కొడవలిని ఆయుధంగా మలచి చిరుతను చంపేశాడు.

అయితే చిరుతను చంపిన వార్త దవాణంలా గ్రామంతోపాటు జిల్లావాసులకు, పట్టణాలకు కూడా పాకింది. వెనువెంటనే రంగంలోకి దిగిన అటవీశాఖ అధికారులు వచ్చి.. పశువుల కాపరిని ప్రశ్నలు సంధించారు. ఎందుకని చిరుతను చంపావని అడిగారు. అతను చెప్పిన సమాధానాలను పరిగణలోకి తీసుకున్న అటవీశాఖ సిబ్బంది అక్కడ చిరుతకు.. పశువుల కాపరికి మధ్య జరిగిన పెనుగులాటను కూడా పరిశీలించారు. చిరుత దాడి చేసిన మేకలను కూడా గుర్తించారు. దీంతో ఏ కేసు లేకుండానే పశువుల కాపరిని వదిలేసారు.  

ఇంతకీ పశువుల కాపరిని వదిలిపెట్టడానికి గల కారణాలు ఏంటీ.? అంటే.. ఆయన తన ప్రాణాల‌కు తెగించి చిరుత‌తో పోరాడాడు. కోపంతో మీదకు దూసుకొస్తున్న చిరుత‌ను చివ‌రికి త‌న ద‌గ్గరున్న కొడ‌వ‌లితో దాడిచేసి హ‌త‌మార్చాడు. ఇలా ఎందుకు చేశాడంటే.. తన మేకలపై దాడి చేసిన చిరతను తప్పించే ప్రయత్నం చేయగా.. అది వాటిని వదిలి పశువుల కాపరి మీదకే దూసుకోచ్చి పంజా విసిరింది. దాంతో దిక్కుతోచని పరిస్థితుల్లో దానిని హతమార్చాడు. వివ‌రాల్లోకి వెళ్తే.. పితోర్‌గ‌ఢ్ జిల్లాలోని నైనీ గ్రామానికి చెందిన న‌రేష్‌సింగ్ మేక‌ల కాప‌రి. ఎప్ప‌టిలాగే మేక‌ల‌ను మేపేందుకు వెళ్లాడు.

అయితే, ఎక్క‌డి నుంచి వ‌చ్చిందో గానీ ఓ చిరుత‌పులి త‌న మేక‌ల మంద‌పై దాడిచేసింది. ఇది గ‌మ‌నించిన న‌రేష్‌సింగ్ భ‌యంతో పారిపోకుండా.. చిరుత‌ను వెళ్ల‌గొట్టి మేక‌ల‌ను ర‌క్షించుకునే ప్ర‌య‌త్నం చేశాడు. దాంతో ఆగ్ర‌హించిన చిరుత మేక‌ల‌ను వ‌దిలేసి న‌రేష్‌సింగ్‌పై దాడిచేసింది. న‌రేష్ సింగ్ త‌న చేతిలో ఉన్న క‌ర్ర‌తో చిరుత‌ను బెద‌ర‌గొట్టే ప్ర‌య‌త్నం చేసినా అది బెద‌ర‌లేదు. పైగా మ‌రింత ఆగ్ర‌హంతో న‌రేష్‌సింగ్ పైకి దూసుకురాసాగింది. దాంతో ప్రాణ ర‌క్ష‌ణ కోసం న‌రేష్‌సింగ్ త‌న ద‌గ్గరున్న కొడ‌వ‌లితో చిరుత‌ను న‌రికి చంపేశాడు. ఘ‌ట‌న‌పై సమాచారం అందుకున్న పోలీసులు, అట‌వీ అధికారులు అక్క‌డికి చేరుకున్నారు. కానీ, ఆత్మ‌ర‌క్ష‌ణ కోసం చిరుత‌ను చంపినందున న‌రేష్‌సింగ్‌పై ఎలాంటి కేసు న‌మోదు చేయ‌లేదు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles