KTR unveils Col. Santosh Babu statue at Suryapet అమరవీరుడు కల్నల్ సంతోష్ బాబు విగ్రహావిష్కరణ..

Galwan martyr colonel santosh babu s statue unveiled in suryapet

Indo-china clash, colonel Santosh Babu, ladakh, Galwan, santosh babu, Galwan Valley, k t rama rao, Mahavir, Suryapet, K Chandrashekar Rao, Hyderabad, Telangana,

A statue of Colonel Santosh Babu, who died in the Chinese army attack at Galwan Valley in eastern Ladakh in June last year, was unveiled at Suryapet by Telangana Minister K T Rama Rao. Colonel Babu was native of Suryapet, about140 Km from the state capital Hyderabad.

అమరవీరుడు కల్నల్ సంతోష్ బాబు విగ్రహావిష్కరణ..

Posted: 06/15/2021 04:53 PM IST
Galwan martyr colonel santosh babu s statue unveiled in suryapet

భారత్ లోకి చోచ్చుకోచ్చిన చైనా బలగాలను వెనక్కు తరిమే నేపథ్యంలో చైనా సైన్యంతో జరిగిన ఘర్షణల్లో అమరుడైన కల్నల్ సంతోష్ బాబు వీరత్వానికి ప్రతీకగా ఆయన విగ్రహాన్ని సూర్యపేట ప్రధాన కూడలిలో ఇవాళ మంత్రి కేటీఆర్ ఆవిష్కరించారు. భారత్‌-చైనా సరిహద్దులో విదులు నిర్వహిస్తూ భారతదేశం కోసం చైనా సైనికులతో వీరోచితంగా పోరాడి అమ‌రుడైన‌ కర్నల్‌ సంతోష్‌ బాబు విగ్ర‌హాన్ని సూర్యాపేట‌లోని కోర్టు చౌరస్తాలో కల్నల్ సంతోష్ బాబు 9 అడుగుల‌ కాంస్య విగ్రహాన్ని ఈరోజు మధ్యాహ్నాం రాష్ట్ర‌ ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ చేతుల మీదుగా ఆవిష్క‌రించారు.

అనంతరం ఆ వీరుడా వందనం అంటూ సెల్యూట్ చేశారు. నీ త్యాగం ఎప్పటికీ మర్చిపోం అంటూ ప్రతిజ్ఞ చేశారు. భారత్- చైనా సరిహద్దుల్లోని లద్దాఖ్‌లో వాస్తవాధీన రేఖ వెంట 2020 జూన్‌ 15న చైనా సైనికులతో జరిగిన ఘర్షణలో సూర్యాపేటకు చెందిన సంతోష్‌బాబు వీరమరణం పొందాడు. సంతోష్ బాబుతో పాటు మ‌రికొంద‌రు భారత సైనికులు అమరులైన విషయం తెలిసిందే. దేశం కోసం ప్రాణాలు అర్పించిన సంతోష్‌బాబు వీరోచిత పోరాట స్ఫూర్తి ప్రజల గుండెల్లో ఎప్పటికీ గుర్తుండిపోయేలా సూర్యాపేట జిల్లా కేంద్రంలోని కోర్టు చౌరస్తాలో సంతోష్ బాబు విగ్రహాన్ని ఆవిష్కరించాలని అప్పట్లో ప్రభుత్వం నిర్ణయించింది.

ఆ నిర్ణయం ప్రస్తుతం కార్యరూపం దాల్చడంతో మంత్రి కేటీఆర్ చేతులమీదుగా కల్నల్ సంతోష్ బాబు విగ్రహాం అవిష్కరించారు. కాగా..తెలంగాణ ముద్దు బిడ్డ సంతోష్ బాబు మరణం అనంతరం ఆయన కుటుంబాన్ని సీఎం కేసీఆర్ స్వయంగా పరామర్శించారు. తెలంగాణ ప్రజలకే కాదు యావత్ భారతదేశానికి ఎప్పటికీ గుర్తుండిపోతుంది అన్న సీఎం కేసీఆర్ అన్నారు. ఈ సందర్భంగా సంతోష్ బాబు కుటుంబానికి సీఎం కేసీఆర్ ఆర్థిక సహాయంతో పాటు ఉద్యోగాన్ని కూడా ఇచ్చి గౌరవించింది. అలాగే హైదరాబాద్ లో ఓ స్థలాన్ని కూడా కేటాయిచిన విషయం తెలిసిందే.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles