HC grants conditional bail to Judge RamaKrishna జడ్జి రామకృష్ణకు షరతులతో కూడిన బెయిల్

Andhra pradesh high court grants conditional bail to judge ramakrishna

Andhra Pradesh High Court, Rama Krishna, Judge Rama Krishna, YS Jagan, Pileru police station, sedition case, Andhra Pradesh, crime

Andhra Pradesh High Court granted bail to suspended judge Rama Krishna. The court granted bail upon surety of Rs 50,000 and ordered to co-operate with the investigating officers. Judge Rama Krishna, who was arrested in a sedition case, has approached the high court court for bail. The court granted him conditional bail and directed him not to speak to the media on the case.

జడ్జి రామకృష్ణకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు..

Posted: 06/15/2021 01:59 PM IST
Andhra pradesh high court grants conditional bail to judge ramakrishna

జడ్జి రామకృష్ణకు హైకోర్టులో ఊరట లభించింది. ఆయనకు షరతులతో కూడిన బెయిల ​ను రాష్ట్రోన్నత న్యాయస్థానం హైకోర్టు మంజూరు చేసింది. రూ.50 వేల పూచీకత్తుతో ఏపీ హైకోర్టు జడ్జి రామకృష్ణకు బెయిల్ మంజూరు చేసింది. ఆయనకు విధించిన షరతుల్లో భాగంగా విచారణాధికారికి సహకరించాలని న్యాయస్థానం ఆదేశించింది. ఇక ఈ కేసుకు సంబంధించిన ఏ విషయాన్ని మీడియాతో మాట్లాడేందుకు కానీ, లేదా మీడియా ప్రశ్నలకు సమాధానాలు చెప్పరాదని న్యాయస్థానం షరతు విధించింది. రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజల్లో విద్వేషాలు రేపేందుకు ప్రయత్నిస్తున్నారన్న అభియోగాలపై జడ్జి రామకృష్ణపై రాజద్రోహం కింద కేసులు నమోదైన విషయం తెలిసిందే.

రాష్ట్రంలోని చిత్తూరు జిల్లాకు చెందిన జడ్జి రామకృష్ణ ఏప్రిల్ లో అరెస్ట్ అయ్యారు. ఆంద్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంపై.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై ప్రజల్లో ద్వేషం కలిగించేందుకు ప్రయత్నిస్తున్నారన్న అభియోగాలను ఆయనపై మోపారు పోలీసులు. రాజ్యాంగబద్ధంగా ఏర్పాటైన ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వంపైనా.. ప్రజాబీష్టం మేరకు ఎన్నికైన సీఎం జగన్‌పై ప్రజల్లో ద్వేషం కలిగించేందుకు ప్రయత్నిస్తున్నారని మదనపల్లెలో పోలీసులు న్యాయమూర్తి రామకృష్ణను అరెస్టు చేసిన విషయం తెలిసిదే. చిత్తూరు జిల్లా పీలేరుకు చెందిన జయరామచంద్రయ్య ఫిర్యాదు చేయగా..రామకృష్ణపై ఐపీసీ సెక్షన్‌ 124ఏ కింద పీలేరు పోలీసులు దేశద్రోహం కేసు నమోదు చేశారు.

జడ్జి రామకృష్ణలో కరోనా లక్షణాలు కనిపించటంతో బి. కొత్తకోట నుంచి మదనపల్లె వెళ్లి పరీక్షలు చేయించుకోవటానికి వెళుతుండగా మార్గ మధ్యలో అడ్డుకున్న పోలీసులు అరెస్ట్ చేశారు. కాగా అండర్ ట్రయల్ ఖైదీగా ఆయన జైలులో వున్న సమయంలో ఆయన బ్యారాక్ లోని సహచర నిందితుడి వద్ద కత్తి వుందని ఆయన అరోపించారని.. ఈ నేపథ్యంలో ఆయన కుమారుడు మీడియాతో చెప్పడం సంచలనం రేపింది. ఇదిలావుండగా, తనను అక్రమంగా అరెస్టు చేశారని తాను ఏలాంటి రాజధ్రోహం చర్యలకు పాల్పడలేదని, తనకు బెయిలు మంజూరు చేయాలని ఆయన పెట్టుకున్న పిటీషన్ ను విచారించిన న్యాయస్థానం ఇవాళ షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles