A moment of joy turns tragic for ‘miracle mom’ అంత్యక్రియలు జరిపించిన పక్షం రోజులకు.. తిరిగొచ్చిన భార్య!

Woman returns home after family believed she died of covid 19

Girijamma, Christianpet, Gaddayya, Jaggaiahpet, COVID-19, Coronavirus, Krishna District, Dead, woman, Returns, Cremation, Andhra Pradesh, Crime

A 75-year-old woman in Andhra Pradesh who recovered from COVID-19 returned home on Wednesday only to find that her family had cremated another body by mistake. The bizarre incident occurred in Jaggaiahpet town in the state’s Krishna district.

అంత్యక్రియలు జరిపించిన పక్షం రోజులకు.. తిరిగొచ్చిన భార్య!

Posted: 06/02/2021 05:41 PM IST
Woman returns home after family believed she died of covid 19

ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బంది ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారో చెప్పడానికి ఇది మరో ఉదాహరణ. బతికి ఉన్న తన భార్యకు దహన సంస్కారాలతో పాటు దశదిన కర్మలు కూడా చేయించిన తరువాత అమె సజీవంగా కళ్లముందుకు వస్తే.. ఆ భర్త పడే బాధ వర్ణణాతీతం. అదీకాక.. ఎవరో శవానికి తాను దహనసంస్కారాలు చేశానని, తమ బంధువులకు అమె కడసారి చూపు కూడా దక్కనీయకుండా చేశానన్న మనోవేధన ఆతడ్ని కంగదీస్తుంది. రెక్కడితే కానీ డొక్కాడని కుటుంబాలకు చెందిన వ్యక్తి తన భార్య అంతక్రియలు, దశదిన కర్మ చేసేందుకు కూడా అప్పు చేయాల్సి వచ్చింది. మరీ ఆ డబ్బు ఎవరు తీరుస్తారన్నది కూడా మిలియన్ డాలర్ల ప్రశ్న.

వివరాల్లోకి వెళ్తే కృష్ణా జిల్లా జగ్గయ్యపేటలోని క్రిస్టియన్ పేటకు చెందిన గిరిజమ్మ అనే మహిళ కరోనా కారణంగా విజయవాడలోని ప్రభుత్వ ఆసుపత్రిలో చేరారు. అయితే, ఆమెకు అడ్మిట్ చేసుకున్న వైద్యులు.. చికిత్సను అందించారు. కాగా గిరిజమ్మ చనిపోయారంటూ మే 15న ఓ మృతదేహాన్ని ఆమె భర్తకు వైద్యులు అప్పగించారు. దీంతో చేసేది లేక బాధాతప్త హృదయంతో ఆమెకు తన భర్త అయిన గడ్డయ్య అంత్యక్రియలను నిర్వహించారు. ఇదిలావుండగానే కరోనా కారణంగా ఖమ్మం జిల్లాలోని అసుపత్రిలో చేరిన అమె కుమారుడు రమేశ్ కూడా మే 23న మృతి చెందాడు. వారం వ్యవదిలో ఒకే ఇంట్లో ఇద్దరు మృత్యువాత పడటంతో గడ్డయ్య పరిస్థితి దీనంగా మారింది.

రెండు రోజుల క్రితమే తల్లి, కొడుకుకి కుటుంబసభ్యులు దశదినకర్మలను పూర్తి చేశారు. అయితే, ఈరోజు వారికి ఊహించని ఘటన ఎదురైంది. గిరిజమ్మ జగ్గయ్యపేటలోని తన ఇంటికి వచ్చింది. దీంతో అంతా షాక్ కు గురయ్యారు. ఈ ఘటన నేపథ్యంలో ఆసుపత్రి సిబ్బందిపై కుటుంబసభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎవరు చనిపోయారో కూడా నిర్ధారించుకోకుండానే మరొకరి మృతదేహాన్ని ఎలా అప్పగిస్తారని ఆమె భర్త గడ్డయ్య మండిపడ్డారు. మరోవైపు గిరిజమ్మ రావడం కుటుంబసభ్యులకు సంతోషం కలిగించినప్పటికీ... కొడుకుని కోల్పోవడంతో గడ్డయ్య దంపతులు కంటతడి పెట్టుకుంటున్నారు. ఓవైపు ఆనందం, మరోవైపు విషాదం ఆ ఇంటిలో నెలకొంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles