Alas, men have no domestic violence law: Madras high court భర్తలకు గృహహింస చట్టం లాంటి చట్టం లేదే.. మద్రాస్ హైకోర్టు

Unfortunately there is no law like domestic violence act for husband madras high court

Madras High Court, Domestic Violence Act, The Protection of Women from Domestic Violence Act 2005, Justice S Vaidyanathan, Marriage, Protection of Women from Domestic Violence Act, Live-in Relationship, madras high court chennai, divorce, complaint

A case involving allegations that a woman had filed a domestic violence complaint against her husband only to harass him prompted the Madras High Court to make interesting observations on the Domestic Violence Act itself as well as on marriage.

భర్తలకు గృహహింస చట్టం లాంటి చట్టం లేదే.. మద్రాస్ హైకోర్టు

Posted: 06/02/2021 04:50 PM IST
Unfortunately there is no law like domestic violence act for husband madras high court

వివాహబంధం అన్నది కాంట్రాక్టు కాదని, అది ఒక పవిత్ర బంధమని నేటి తరం తెలుసుకోవాల్సిన అవశ్యకత ఎంతైనా వుందని మద్రాసు హైకోర్టు పేర్కొంది. ఈ క్రమంలో అహం, ఆధిపత్యం అన్నవి వారి మధ్యలో రాకూడదని, అవి చెప్పులు మాదిరిగా ఇంటి బయటే వదిలేయాల్సిన అవసరం వుందని తెలిపింది. అలా కాని పక్షంలో వారి సంతానం ఆ ఫలితాన్ని అనుభవించాల్సి వస్తుందని అన్నారు. పెళ్లి అనే పవిత్ర బంధాన్ని తలపాగా తీసినంత తేలిగ్గా తెంచుకోరాదని పేర్కోంది. అయితే, సహ జీవనానికి హక్కు కల్పించిన గృహ హింస చట్టం 2005 అమల్లోకి వచ్చినప్పటి నుంచి ‘పవిత్రత’ అన్న పదానికి అర్థం లేకుండాపోయిందని అన్నారు.

ఈ నేపథ్యంలో గృహ హింస చట్టంపై కూడా న్యాయస్థానం ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. భార్యపై తప్పుడు కేసు పెట్టడానికి వారిలాగా భర్తల కోసం గృహ హింస చట్టమంటూ ఒకటి లేకపోవడం దురదృష్టమంటూ వ్యాఖ్యానించింది. శశికుమార్ అనే వెటర్నరీ వైద్యుడు వేసిన రిట్ పిటిషన్ ను విచారించిన హైకోర్ట్ ధర్మాసనంలోని న్యాయమూర్తి జస్టిస్ ఎస్. వైద్యనాథన్ ఈ వ్యాఖ్యలు చేశారు. 2015లో శశికుమార్ పై అతడి భార్య సేలంలోని జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ కమ్ అదనపు మహిళా కోర్టులో గృహ హింస కేసు పెట్టింది. ప్రతిగా తన భార్యే తనను చిత్రహింసలు పెట్టిందని, తనను వదిలేసి వెళ్లిపోయిందని ఫస్ట్ అడిషనల్ సబ్ జడ్జికి శశికుమార్ ఫిర్యాదు చేశారు.

విడాకులు రావడానికి నాలుగు రోజుల ముందు యానిమల్ హస్బెండ్రీ అండ్ వెటర్నరీ సర్వీసెస్ డైరెక్టర్ కూ తన భర్తపై ఫిర్యాదు చేస్తూ లేఖ రాసింది. దీంతో ఆయన శశికుమార్ ను విధుల నుంచి సస్పెండ్ చేస్తూ 2020 ఫిబ్రవరి 28న ఉత్తర్వులిచ్చారు. ఆ తరువాత నాలుగు రోజుల వ్యవధిలోనే సేలం కోర్టు ఈ దంపతులకు విడాకులు మంజూరు చేసింది. సస్పెన్షన్ ఆర్డర్ పై గత ఏడాది శశికుమార్ హైకోర్టుకు వెళ్లారు. ఆ కేసు తాజాగా విచారణకు రావడంతో జస్టిస్ వైద్యనాథన్.. పిటిషనర్ ను కావాలనే ఇబ్బందులకు గురిచేసినట్టుందని అన్నారు. విడాకులు వస్తాయని ముందే తెలిసీ ఆమె ఇలా ఫిర్యాదు చేసినట్టు అర్థమవుతోందన్నారు. ఈ నేపథ్యంలో శశికుమార్ ను సస్పెన్షన్ లో ఉంచాల్సిన అవసరం సంబంధిత శాఖ అధికారులు లేదని అన్నారు. పక్షం రోజుల్లోగా శశికుమార్ ను విధుల్లోకి తీసుకోవాలని పశుసంవర్థకశాఖ డైరెక్టర్ ను జస్టిస్ వైద్యనాథన్ ఆదేశించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles