cheruku sudhakar sensational comments on CM post ఈటెలకు సీఎం పదవిని కట్టబెట్టండీ: చెరుకు సుధాకర్

Mlc candidate cheruku sudhakar sensational comments on cm post

Etela Rajender, Cheruku Sudhakar, BC Leadership, SC candidate, TRS, KCR, Kalvakuntla ChandraShekar Rao, KTR, KT RamaRao, CM Candidate, Telangana Movement, telangana inti party, Telangana, Politics

As TRS suppoters and Ministers praising that KTR has capability to become Cheif Minister of Telangana and news comming out all the steps are being taken in this regard Telangana Inti Party President and MLC candidate cheruku sudhakar made sensational comments on CM post. He demanded KCR to give CM post to Eetala, to back BC Leadership in the state.

ఈటెల రాజేందర్ కు ముఖ్యమంత్రి పదవిని ఇవ్వండీ: చెరుకు సుధాకర్

Posted: 02/04/2021 11:25 AM IST
Mlc candidate cheruku sudhakar sensational comments on cm post

తెలంగాణలో ముఖ్యమంత్రిగా టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ తప్పుకుని ఆ పదవిని తన తనయుడు, రాష్ట్ర మంత్రి కేటీఆర్ కు అప్పగించనున్నారని వార్తలు జోరుగా వినిపిస్తున్న వేళ.. ఆయనకు సీఎం పదవిని అప్పగించనున్నారన్న వార్తలపై విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. ఇప్పటికీ అటు కాంగ్రెస్, ఇటు బీజేపి నేతలు కేటీఆర్ అర్హతలను ప్రశ్నించగా, తెలంగాణ ఇంటి పార్టీ తరపున ఎమ్మెల్సీ అభ్యర్థిగా బరిలో నిలిచిన చెరుకు సుధాకర్ మరో అడుగు ముందుకేసీ.. ఉద్యమ పార్టీలో వారసత్వానికి చోటు ఎక్కడి ఎందుకు కల్పిస్తున్నారని ప్రశ్నించారు.

ఈ సందర్భంగా వరంగల్, నల్గొండ, ఖమ్మం జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి చెరుకు సుధాకర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ఏర్పడితే దళితుడిని రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిని చేస్తానని ప్రజలకు చెప్పిన కేసీఆర్.. తన పార్టీ అధికారంలోకి రాగానే ఆఘమేఘాల మీద సీఎం పీఠాన్ని అధిరోహించారని విమర్శించారు. తెలంగాణకు తాను కాపాలాదారుగా మాత్రమే ఉంటానని చెప్పిన టీఆర్ఎస్ పార్టీ అధినేత.. మాయమాటలతో తెలంగాణ ప్రజలను వంచిస్తున్నారని దుయ్యబట్టారు. ఎన్నికల వేళ ప్రజలకు అరచేతిలో వైకుంఠం చూపించేలా కొత్త ఆశలు కల్పించి.. అధికారంలోకి రాగానే వాటిని తుంచడం ఆయనకు పరిపాటిగా మారిందని విమర్శించారు.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే ఇంటికో ఉద్యోగం ఇస్తానన్న ముఖ్యమంత్రి కనీసం ఊరికో ఉద్యాగాన్ని కూడా కల్పించలేదని ధ్వజమెత్తారు. తెలంగాణ ఉద్యమంలో భాగంగా అన్ని పార్టీలను, నేతలను కలుపుకుపోయిన కేసీఆర్.. ఇప్పుడు తెలంగాణ పోరులో కలిసివచ్చిన పార్టీలను అణిచివేసి.. నాయకులను తొక్కేసి.. పార్టీలో నియంతలా మారి.. ఇప్పడు తన తనయుడికే ముఖ్యమంత్రి పీఠాన్ని పట్టం కట్టాలని చూస్తున్నారని సుధాకర్ మండిపడ్డారు. తెలంగాణ ఏర్పడితే బీసీలకు న్యాయం జరుగుతుందని అప్పటి యూపీఏ చైర్ పర్సెన్ సోనియాగాంధీ భావించారని.. కానీ తెలంగాణలో బీసీలను కూడా ఎదగనీయడం లేదని ఆయన అవేదన వ్యక్తం చేశారు.

ఈ క్రమంలో తెలంగాణలో బీసి నేతలు ఎదగాలంటే.. తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ తో పాటుగా ఆది నుంచి ప్రత్యేక రాష్ట్ర ఉధ్యమంలో పాటుపడి.. జైలుకు వెళ్లి, పోలీసుల లాఠీల దెబ్బలు తిన్న బీసి నేత ఈటెల రాజేందర్ ను ముఖ్యమంత్రిని చేయాలని చెరుకు సుధాకర్ డిమాండ్ చేశారు. తెలంగాణ ఉద్యమంలో ఆది నుంచి వున్న నేతలు వదలిపెట్టి.. మధ్యలో ఉద్యోగాలు వదిలేసిన నేతలకు ముఖ్యమంత్రి పదవిని కట్టబెట్టడం ఏంటని ప్రశ్నించారు, ఎమ్మెల్సీ ఎలక్షన్స్ లో కోదండరామ్ కు ఎన్డీయే నేతలు ఎందుకు మద్దతిస్తున్నారో తెలియడం లేదని అన్నారు. తాను కమ్యూనిస్టు ఉద్యమాల్లో తరచూ పాల్గొంటున్న వాడినని, తాను విజయం సాధిస్తే, విద్యావంతుల సమస్యలు తీర్చేందుకు ప్రయత్నిస్తానని అన్నారు. తనను గెలిపించాలని పట్టభద్రులను ఆయన కోరారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Cheruku Sudhakar  Etela Rajender  BC Leadership  TRS  KCR  KTR  telangana  trs  telangana inti party  Telangana  Politics  

Other Articles