Cyclone Amphan kills more than 80 people అంఫన్ బీభత్సం.. పశ్చిమ బెంగాల్ లో 84 మంది మృతి..

Cyclone amphan kills more than 80 people as it tears through india

Cyclone Amphan, Cyclone Amphan updates, Amphan cyclone, Amphan cyclone current position, cyclone amphan latest news, Amphan cyclone landfall, Amphan cyclone Kolkata, cyclone Amphan, cyclone amphan rains, Amphan cyclone odisha, Amphan cyclone West Bengal

Cyclone Amphan barrelled through eastern India's coastal communities and neighboring Bangladesh on Wednesday, leaving at least 84 people dead. It was the strongest Super Cyclone ever recorded in the Bay of Bengal, but it lost much of its steam before making landfall.

అంఫన్ బీభత్సం.. పశ్చిమ బెంగాల్ లో 84 మంది మృతి..

Posted: 05/21/2020 07:57 PM IST
Cyclone amphan kills more than 80 people as it tears through india

అతి తీవ్ర తుపాను అంఫన్ తీరం దాటుతూ సృష్టించిన బీభత్సం మాటలకందనిది. తుఫాను బీభత్సంతో ఒడిశా, పశ్చిమ బెంగాల్ రెండు రాష్ట్రాల తీరప్రాంతాలు చిగురుటాకులా వణికిపోయాయి. ఈ రెండు రాష్ట్రాల్లో భారీ వర్షంతో కూడిన అత్యంత వేగంతో వీచిన ఈదురుగాలల ధాటికి ఏకంగా 84 మంది మృత్యువాత పడ్డారు. లక్షల ఎకరాల్లో పంట నష్టం సంభవించింది. ఈ తుపాను దాటికి బెంగాల్ లో భారీ ఆస్తి, ప్రాణ నష్టం సంభవించింది. తుపాను దాటిన సమయంలో భీకర గాలులు, భారీ వర్షాలకు బెంగాల్ రాష్ట్రంలోనే 72మంది మృతిచెందినట్టు సీఎం మమతాబెనర్జీ వెల్లడించారు. వీరిలో 15 మంది కోల్‌కతాకు చెందినవారేనన్నారు.  

ఇలాంటి తుపాను దాదాపు దశాబ్దకాలం తరువాత పశ్చిమ బెంగాల్ లో తీరం దాటి రాష్ట్ర తీర ప్రాంతాన్ని అతలాకుతలం చేసిందని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అన్నారు. అంఫన్ తీవ్రతకు తీర ప్రాంత గ్రామాలతో పాటు కోల్‌కతా వంటి నగరాల్లోనూ పెను విధ్వంసం రేగి.. విషాదం మిగిలిందని అమె అవేదన వ్యక్తం చేశారు. వేల సంఖ్యలో ఇళ్లు ధ్వంసమయ్యాయని, భారీ సంఖ్యలో చెట్టు, వటవృక్షాలు సైతం నెలకూలాయని, అనేక విద్యుత్ స్థంబాలు కూడా నేలకూలాయని అన్నారు. ఇక అదే స్థాయిలో అటు ఒడిశాలో కూడా విధ్వంసాన్ని సృష్టించింది అంఫన్ తుపాన్. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలు సహాయక చర్యలు కొనసాగిస్తున్నాయి.

అంఫన్ తుఫానుతో అల్లకల్లోమైన బెంగాల్ ను కేంద్రం అదుకోవాలని అమె కోరారు. ప్రధాని మోదీ పశ్చిమ బెంగాల్‌లో పర్యటించాలని కోరారు. ఉత్తర, దక్షిణ 24 పరగణాల జిల్లాల్లో తీవ్ర నష్టం వాటిల్లిందని చెప్పారు మమతా బెనర్జీ. అక్కడి చెరువులు, ఇతర నీటి వనరులన్నీ కలుషితమయ్యాయని.. తాగునీరు లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. అక్కడి ప్రజలకు వెంటనే మంచి నీటి సౌకర్యం కల్పించాల్సిన అవసరం ఉందని తెలిపారు. రాష్ట్రంలో ఈ తుపాను తీవ్రతతో మృతిచెందిన వారికి సీఎం మమతా బెనర్జీ పరిహారం ప్రకటించారు. ఒక్కో మృతుడి కుటుంబానికి రూ.2లక్షలు నుంచి రూ.2.5లక్షల వరకు పరిహారం ఇవ్వనున్నట్టు తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీని సుందర్బన్స్ ప్రాంతంలో పర్యటించాలని ఆమె విజ్ఞప్తి చేశారు. అంతేకాకుండా తీవ్రంగా నష్టపోయిన ప్రాంతాల్లో పునరుద్ధరణ కోసం ఆర్థికసాయం చేయాలన్నారు. కేంద్రమంత్రి అమిత్‌ షా తనతో మధ్యాహ్నం మాట్లాడారని చెప్పారు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles