Pawan demands action on cop for harassing a party cadre అక్రమ ఇసుక రవాణపై ప్రశ్నిస్తే వేదిస్తారా.? ప్రభుత్వానికి పవన్ ప్రశ్న

Pawan kalyan demands action on cop for harassing a jana sena cadre

Jana Sena, JSP president, Pawan Kalyan, Police department, party cadre, Unnamatla Lokesh, police harassed, AP government, illegal sand activities, YSRCP

The Jana Sena president Pawan Kalyan demanded the Police department to take immediate action against the Cops who were responsible for instigating one of the party cadre, Unnamatla Lokesh to attempt suicide. Pawan Kalyan criticised that the police harassed the deceased since he questioned the government on illegal sand activities carrying out by the ruling YSRCP.

అక్రమ ఇసుక రవాణపై ప్రశ్నిస్తే వేదిస్తారా.? ప్రభుత్వానికి పవన్ ప్రశ్న

Posted: 05/21/2020 02:34 PM IST
Pawan kalyan demands action on cop for harassing a jana sena cadre

అధికారంలోకి రాకముందు ప్రజలకు ఇస్టానుసారంగా హామీలు గిప్పించిన పార్టీలు అధికారం అందుకోగానే ప్రతిపక్షాల కార్యకర్తలను టార్గెట్ చేసి వారిపై పోలీసులతో వేధింపులకు గురిచేస్తారా.? అదికారంలోకి రాగానే ప్రజలకు ఇచ్చిన హామీలను మర్చిపోయి ప్రత్యర్థి పార్టీల కార్యకర్తలపైకి పోలీసులను ఉసిగోల్పి వారు అత్మహత్యకు పాల్పడేలా ఉరిగొల్పుతారా.? అంటూ జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ప్రశ్నించారు. ఈ సందర్భంగా ఆయన అధికార వైసీపీ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

నీతి, నిజాయితీతో కూడిన పాలనను అందిస్తానని ప్రగాల్భాలు పలికిన పార్టీ అధికారంలోకి రాగానే.. ఇసుక అక్రమాలపై ప్రశ్నించినందుకు తమ పార్టీ కార్యకర్తపై వేధింపులకు పాల్పడతారా? అని ఫైర్ అయ్యారు. తమ పార్టీ కార్యకర్తపై వేధింపులకు పాల్పడిన పోలీసులపై తక్షణం పోలీసు ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అధికార వైసీపీ ప్రభుత్వానికి చెందిన పెద్దలు దొడ్డిదారిన అక్రమంగా ఇసుకను రవాణా చేస్తున్నా పట్టించుకోని పోలీసులు.. దానిపై ప్రశ్నించిన జనసేన కార్యకర్తలను మాత్రం టార్గెట్ చేసి.. వేధింపులకు గురిచేస్తున్నారని పవన్ కల్యాణ్ ధ్వజమెత్తారు.

పోలీసులు ప్రజలకే జవాబుదారీ.. అధికార పక్షానికి కాదంటూ జనసేన అధినేత పవన్ కల్యాణ్ మండిపడ్డారు. తాడేపల్లిగూడెం పట్టణానికి చెందిన జనసేన కార్యకర్త ఉన్నమట్ల లోకేశ్ పోలీసుల వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్యకు ప్రయత్నించాడు. ఈ నేపథ్యంలో పవన్ కల్యాణ్ స్పందిస్తూ ఇసుక అక్రమ రవాణాను అడ్డుకుని ప్రశ్నించినందుకు పోలీసులు వేధించడం నియంతృత్వాన్ని తలపిస్తోంది. జనసేన కార్యకర్త ఆత్మహత్యకు ప్రేరేపించిన పోలీసు అధికారి రఘుపై తక్షణం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ విషయాన్ని జిల్లా ఎస్పీతో పాటు అధికార పార్టీ చేస్తున్న ఇసుక దందా, ఇతర అక్రమాలను కలెక్టర్ దృష్టికి తీసుకెవెళ్లాలని నాయకులకు సూచించారు. లోకేశ్ కుటుంబ సభ్యులకు అండగా నిలిచి ధైర్యం చెప్పాలని స్థానిక నాయకత్వానికి నిర్దేశించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles