COVID-19 Apathy: 500 Constables Assault DCP అర్థరాత్రి డీసీపీపై కానిస్టేబుళ్ల దాడి.. కరోనా తెచ్చిన తంట..

500 constables attack dcp for not santising barrack after advent of covid 19 cases

West Bengal, constables, DCP, masks, SI tested corona positive, sanitization, COVID 10 cases, coronavirus, Mamata Banerjee, Kolkata, Politics

In a never seen before situation, hundreds of constables attacked their superior, an officer of Deputy Commissioner rank, late on Tuesday night alleging that the barrack where they live was not sanitised after a sub-inspector tested positive for COVID-19.

అర్థరాత్రి డీసీపీపై కానిస్టేబుళ్ల దాడి.. కరోనా తెచ్చిన తంట..

Posted: 05/21/2020 01:33 PM IST
500 constables attack dcp for not santising barrack after advent of covid 19 cases

ఉన్నతాధికారులపై తిరుగుబాటు బావుటా ఎగురవేసే కార్మికులు, కార్మిక సంఘాల నేతలను ఇప్పటివరకు చూశాం, అంతెందుకు పార్టీ అధిష్టానంపై ఎంపీలు, ఎమ్మెల్యేలే కాదు పార్టీ నేతలు కూడా తిరుగుబాటు ఎగురవేయడం చూస్తూనే వుంటాం. కానీ అటు రక్షణశాఖ, ఇటు పోలీసు(హోం) శాఖలో మాత్రం ఉన్నతాధికారులంటే ఎంతో గౌరవమర్యాదలతో కూడుకుని వుంటారు, అప్పడప్పుడు ఒక్కటి రెండు సినిమాల్లో హీరో క్యారెక్టర్ ఎలివేట్ చేయడం కోసం కథనాయకులో లేక వారి తరపు వారో ఇలా చేస్తుంటారు. కానీ అదేంటో నిజంగానే ఒక పోలీసు ఉన్నతాధికారపై కానిస్టేబుళ్లు దాడి చేశారు. వారి నుంచి తప్పించుకునేందుకు ఏకంగా ఆ పోలీసు ఉన్నతాధికారి పరుగులు పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది.

పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని జరిగిన ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా వున్నాయి. ఉమ్ పున్ తుఫాను కారణంగా సహాయక చర్యల కోసం 500 మంది కానిస్టేబుళ్లకు ఆన్ డ్యూటీ వేశారు. అయితే, వాళ్లు తాత్కాలికంగా బస ఏర్పాటు చేసిన బ్యారక్‌లో.. వారితో పాటు ఉంటున్న ఓ ఎస్సైకి కోవిడ్ పాజిటివ్ అని తేలింది. దీంతో కానిస్టేబుళ్లు కంగారెత్తిపోయి.. తమ బ్యారెక్ ను పరిశుభ్రం చేయడంతో పాటు శానిటైజ్ చేయాలని సంబంధిత అధికారులను కోరారు. అయినా.. ఉన్నతాధికారులు ఈ విషయంలో తీవ్ర నిర్లక్ష్యం వహించారు. దీంతో కానిస్టేబుళ్లు డీసీపీ నివాసముంటున్న ప్రాంతానికి వెళ్లి తీవ్ర నిరసన వ్యక్తం చేశారు.

దీంతో డీసీపీ పాల్ బయటకు వచ్చి వారిని శాంతించే ప్రయత్నం చేశారు. చర్చలు జరుగుతుండగానే.. సమూహంలోని కానిస్టేబుళ్లు ఒక్కసారిగా ఆయనపై దాడికి దిగారు. కంటైన్మెంట్ జోన్లలో పని చేస్తున్నా సరిపడా మాస్కులు ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తూ దాడికి దిగారు. ప్రాణభయంతో డీసీపీ పరుగెత్తగా అలర్ట్ అయిన ఇతర పోలీసులు డీసీపీని రక్షించి దగ్గరలోని ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనతో యావత్తు దేశం షాక్‌కు గురైంది. పోలీస్ శాఖలో ఇంత పెద్ద దాడి ఇదే. కాగా, నిన్న ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సంఘటనా స్థలాన్ని సందర్శించి కానిస్టేబుళ్లతో చర్చించారు

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles