Telangana CM hints at further extension of lockdown తెలంగాణలో గణనీయంగా తగ్గిన కోరానా.. శుభసూచకమన్న కేసీఆర్

Telangana may soon be covid 19 free hopes kcr says lockdown to continue till may 7

coronavirus, coronavirus in Telangana, Telangana coronavirus cases, coronavirus cases in Telangana, coronavirus count in india, india coronavirus count, Tabilghi Jamat Telangana, Tabilghi jamat Telangana cases, Nizamudding event Telangana, Delhi coronavirus cases, Delhi Nizamuddin coronavirus cases, coronavirus india, coronavirus update, coronavirus in india, coronavirus cases, coronavirus cases india, coronavirus update india, coronavirus news, COVID-19, COVID 19 update, coronavirus in ts, coronavirus Hyderabad, Telangana

Emphasising that Telangana was heading towards becoming a coronavirus-free state gradually, chief minister K Chandrasekhar Rao on Monday said the lockdown would continue strictly till May 7, as announced earlier, without any scope for complacency.

తెలంగాణలో గణనీయంగా తగ్గిన కోరానా.. శుభసూచకమన్న కేసీఆర్

Posted: 04/27/2020 10:21 PM IST
Telangana may soon be covid 19 free hopes kcr says lockdown to continue till may 7

తెలంగాణలో కరోనా మహమ్మారి మళ్లి నెమ్మదించింది. ప్రభుత్వం, అరోగ్యశాఖ అధికారులు, వైద్యులు, పోలీసులు, హెల్త్ వర్కర్లు, శానిటేషన్ సిబ్బంది అహర్నిశలు శ్రమించి చేస్తున్న కృషి ఎట్టకేలకు ఫలితానిస్తోంది. గడిచిన 24 గంటల వ్యవధిలో కేవలం 38 కరోనా కేసులు మాత్రమే పిర్యాదు కావడంతో అధికారులు ఊపిరి పీల్చుకుంటున్నారు. తాజా పెరుగుదలతో తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య ఏకంగా 983కు చేరింది. కాగా, కరోనా బారినపడి కోలుకుని డిశ్చార్జ్ అయిన బాధితులు 291 కాగా, ప్రస్తుతం అసుపత్రులలో చికిత్స పోందుతున్నవారు 663 మందిని చెప్పారు. కాగా తాజా మరణాలతో మొత్తం మరణాల సంఖ్య కూడా 26కి చేరింది.  

నిన్న సాయంత్రం నుంచి ఇప్పటివరకు 500లకు పైగా పరీక్షలు నిర్వహించినట్లు తెలంగాణ అరోగ్యశాఖ మంత్రి ఈటెల రాజేందర్ వెల్లడించారు. రాష్ట్రంలో కరోనా పరిస్థితిపై ఇవాళ సాయంత్రం ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలోని నాలుగు ప్రాంతాల నుంచి ఎక్కువగా కరోనా కేసులు వచ్చాయని తెలిపారు, వికారాబాద్ లో 14 కుటుంబాల నుంచి కేసులు ఎక్కవగా వచ్చాయని, గద్వాలలో 30 కుటుంబాల నుంచి 45 మందికి కోవిడ్ సోకిందని తెలిపారు. సూర్యాపేటలో 25 కుటుంబాల నుంచి  83 మందికి వ్యాపించిందని, అలాగే గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 44 కుటుంబాల నుంచి 260 మందికి కరోనా మహమ్మారి సోకిందని ఈటెల వివరించారు.

రాష్ట్రంలో కరోనా కేసులు కొనసాగుతున్న నేపథ్యంలో సికింద్రాబాదులోని గాంధీ అసుపత్రిని ఇకపై పూర్తి కోవిడ్ అసుపత్రిగా నామకరణం చేశామని వెల్లడించారు. రాష్ట్రంలో కరోనా రోగులకు పౌష్టికాహారం అందిస్తున్నామని చెప్పారు, రోగులకు అందించే ఆహారంపై కొందరు దుష్ఫ్రచారం చేస్తున్నారు. తమకు పౌకర్యాలు లేవని, రోగులెవరూ చెప్పలేదు. గాంధీ నుంచి డిశ్చార్జి అయినవారెవరూ అసంతృప్తిగా లేరని అన్నారు. కొన్ని చోట్ల వైద్యులు, సిబ్బందిని తమ ఇళ్ల వద్దకు రానివ్వడం లేదని.. వైద్యులపై దాడులు జరిగితే ప్రభుత్వం ఉపేక్షించే పరిస్థితిలో లేదని తేల్చిచెప్పారు. పది లక్షల పిపిఈ కిట్లు, పది లక్షల ఎన్ 95 మాస్కులు ఆర్డర్ ఇచ్చామని చెప్పారు. రాష్ట్రంలో వైద్యులకు కరోనా ఎక్కడా సోకలేదని ఈటెల చెప్పారు.

తెలంగాణ ప్రభుత్వం ముందు నుంచి చేపడుతున్న కఠినమైన చర్యలతో రాష్ట్రంలో కరోనావైరస్ కేసులు తగ్గుముఖం పడుతోంది. రాష్ట్రముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు, వైద్యఅరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ లు ముందునుంచి రాష్ట్రంలో కరోనా కరుమరుగు అవుతుందనే అశాభావాన్ని వ్యక్తం చేస్తూనే వున్నారు. ఢిల్లీలోని హజ్రత్ నిజాముద్దీన్ కు వెళ్లి అక్కడ తబ్లిగీ జామాత్ ప్రార్థనల్లో హజరైన కొందరు రాష్ట్రానికి చెందిన వారి అంశం వెలుగులోకి రావడంతో కరోనా కేసులు తెలంగాణలో కల్లోలం రేపింది. మార్చి 27తో తెలంగాణ కనుమరుగు కావాల్సిన కరోనా ఇప్పుడిప్పుడే తగ్గుముఖం పడుతోంది.

ఈ క్రమంలో ఆదివారం తక్కువ సంఖ్యలో నమోదైన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య సోమవారం మరింత గణనీయంగా తగ్గాయి. సోమవారం కేవలం రెండు కరోనా పాజిటివ్ కేసులు మాత్రమే నమోదయ్యాయి. ఇంత తక్కువ సంఖ్యలో నమోదు కావడంపై ప్రభుత్వం స్పష్టతనిచ్చింది. తెలంగాణలో సోమవారం 159 మందికి కరోనా నిర్ధారిత పరీక్షలు చేయగా కేవలం ఇద్దరికి మాత్రమే పాజిటివ్ వచ్చినట్లు తెలంగాణ ముఖ్యమంత్రి కార్యాలయం పేర్కొంది. ఈ రెండు కేసులూ జీహెచ్‌ఎంసీ పరిధిలోనే నమోదు కావడం గమనార్హం. సోమవారం కరోనా నుంచి కోలుకున్న 16 మంది డిశ్చార్జ్ అయినట్లు తెలిపింది.

తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గడంపై సీఎం కేసీఆర్ హర్షం వ్యక్తం చేశారు. ఇది శుభసూచకమని సీఎం కేసీఆర్ అన్నారు. ప్రధాని మోదీతో ముఖ్యమంత్రుల వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్న అనంతరం ప్రగతిభవన్ లో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాల వారీగా ‘కరోనా’ వైరస్ వ్యాప్తి, రోగులకు అందుతున్న చికిత్స, సహాయ కార్యక్రమాలు, లాక్ డౌన్ అమలు తదితర అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ, రేపటితో రాష్ట్రంలోని 21 జిల్లాలు ఒక్క కరోనా యాక్టివ్ కేసు లేని జిల్లాలుగా మారుతున్నాయని ప్రకటించారు.

రాబోయే రోజుల్లో ‘కరోనా’ రహిత రాష్ట్రంగా తెలంగాణ మారే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని అన్నారు. ఈ వైరస్ బారిన పడ్డ వారిలో 97 శాతానికి పైగా పేషెంట్లు కోలుకుని డిశ్చార్జి అవుతుండటం మంచి పరిణామం అని అన్నారు. అనుకోని పరిస్థితుల్లో మళ్లీ పాజిటివ్ కేసులు వచ్చినా వెంటనే గుర్తించి తగిన చర్యలు తీసుకోవడానికి వైద్య ఆరోగ్య శాఖ సిద్ధంగా ఉందని అన్నారు. ముందుగా ప్రకటించినట్టుగా మే 7 వరకు లాక్ డౌన్ కొనసాగుతుందని, ప్రజలు సహకరించాలని కోరారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles