Telangana govt makes wearing face masks mandatory అప్రమత్తమైన తెలంగాణ ప్రభుత్వం.. తాజా ఉత్తర్వులు జారీ

Covid 19 telangana makes wearing masks compulsory for all

People who step out of homes should mandatorily wear face masks from now on in telangana. In yet another move to keep the spread of coronavirus in check, the state government issued orders which make wearing masks mandatory.

People who step out of homes should mandatorily wear face masks from now on in telangana. In yet another move to keep the spread of coronavirus in check, the state government issued orders which make wearing masks mandatory.

అప్రమత్తమైన తెలంగాణ ప్రభుత్వం.. తాజా ఉత్తర్వులు జారీ

Posted: 04/10/2020 12:32 PM IST
Covid 19 telangana makes wearing masks compulsory for all

తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా కరోనా వైరస్ రోజురోజుకు విస్తరిస్తూ ఉంది. బయట తిరిగే పరిస్థితి కూడా లేదు. అయినా అత్యవసర పరిస్థితుల నేపథ్యంలో బయటకు రావాలనుకునే వారు తప్పకుండా ప్రభుత్వ అదేశాలను పాటించాల్సిందే. కరోనావైరస్ వ్యాప్తి ఇంతింతై వటుడింతై అంటూ వ్యాప్తి చెందుతున్న తరుణంలో మూడో దశకు చేరుకుందన్న వార్తల నేపథ్యంలో ప్రభుత్వం అప్రమత్తమైంది. ఈ క్రమంలోనే రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇళ్ల నుంచి బయటకు వచ్చేవారు ఇకపై తప్పనిసరిగా తమ అదేశాలను పాటించాల్సిందేనని హెచ్చరించింది.

అయితే తాజాగా ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాలు ఏమిటనగా.. లాక్ డౌన్ నేపథ్యంలో అత్యయిక పరిస్థితుల్లో బయటకు వస్తే  ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా మాస్క్‌ ధరించాల్సిందే అంటూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. లాగే విధుల్లో ఉన్న ఉద్యోగులందరూ మాస్క్‌లు ధరించాలంటూ స్పష్టం చేసింది. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ఉద్యోగులు కూడా మాస్క్‌లు పెట్టుకోవాలంటూ ఆదేశాలు విడుదల చేసింది. బయట దొరికే మాస్కులతో పాటు ఇళ్లలో తయారు చేసిన మాస్క్‌లను కూడా ధరించేందుకు ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది.

ఇప్పటికే ఢిల్లీ, మహారాష్ట్ర, పంజాబ్‌, ఒడిశా రాష్ట్రాలు మాస్క్‌లు ధరించడం తప్పనిసరి చేశాయి. కొన్ని రాష్ట్రాల్లో మాస్క్‌లు పెట్టుకోకుంటే అరెస్టుతో పాటు జరిమానాలు విధిస్తున్నాయి. ఇప్పుడు వాటి జాబితాలో తెలంగాణ  చేరింది. ఓ అధ్యయనం ప్రకారం మాస్కుల వినియోగంతో జపాన్‌లో కరోనా కేసుల వ్యాప్తి తగ్గినట్లు తేలడంతో దేశంలో ఈ ప్రభుత్వాలు నిర్ణయం తీసుకుంటున్నాయి. దగ్గడం, తుమ్మడం, మాట్లాడే సమయాల్లో వెలువడే తుంపర్లు అవతలి వ్యక్తిపై పడటంతో కోవిడ్‌-19 వ్యాపిస్తుంది. దానిని అరికట్టాలంటే ఈ మేరకు నిర్ణయం తప్పదని ప్రభుత్వం అభిప్రాయం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles