దేశంలో వేగంగా వ్యాపిస్తున్న కొవిడ్-19 వైరస్ పాజిటివ్ కేసులను పరిశీలిస్తే స్టేజ్-3లోకి వెళ్లామా.? అన్న అనుమానాలు కలుగుతున్నాయి. ఈ దశలో కమ్యూనిటీ ట్రాన్స్ మిషన్ ప్రారంభమైందా.? అన్న సందేహాలు కూడా తెరపైకి వస్తున్నాయి. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ తాజా గణంగాకలు కూడా ఈ విషయాన్నే రూడీ చేస్తున్నాయి, కరోనా పాజిటివ్ గా తేలిన వారిలో 38 శాతం కేసులు ఏ విధమైన ప్రయాణ చరిత్ర లేనివారేనని, ఎక్కడికీ ప్రయాణించని వారికి కూడా వైరస్ సోకుతోందని తమ రాండమ్ టెస్టుల్లో తేలుతోందని వెల్లడించింది.
ఇండియాలో ఇప్పటికే కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 6 వేలు దాటగా, సుమారు 2,500 వరకూ కేసులు కమ్యూనిటీ ట్రాన్స్ మిషన్ కారణంగానే వచ్చాయని ఐసీఎంఆర్ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. దీంతో రెండు వారాల క్రితం ఇండియాలో కమ్యూనిటీ ట్రాన్స్ మిషన్ ఇంకా ప్రారంభం కాలేదని అధికారికంగా ప్రకటించిన ఐసీఎంఆర్, ఇప్పుడు కమ్యూనిటీ ట్రాన్స్ మిషన్ పై మరింత స్పష్టమైన అభిప్రాయానికి వచ్చేందుకు మరిన్ని పరీక్షలు చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు ఐసీఎంఆర్, ఎస్ఏఆర్ఐ (సివియర్ అక్యూట్ రెస్పిరేటరీ ఇల్ నెస్) ఉన్న వారికి మరిన్ని రాండమ్ టెస్ట్ లు చేయాలని నిర్ణయించాయి.
ఇప్పటివరకూ ఇండియాలో కరోనా పాజిటివ్ వచ్చిన కేసుల్లో అత్యధికులు విదేశీ ప్రయాణాలు, ఢిల్లీలో జరిగిన మత ప్రార్థనలకు హాజరైన వారివే. దీంతో వీరందరినీ గుర్తించి, ఐసొలేషన్ చేయడం ద్వారా, వైరస్ వ్యాప్తిని సులువుగా అరికట్టవచ్చని కేంద్రం భావించింది. అయితే, వాస్తవాలు చూస్తే, పరిస్థితి దిగజారుతోందని చెబుతున్నాయి. వైరస్ ఎక్కడి నుంచి వస్తోందన్న విషయాన్ని గుర్తించకుంటే, కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంటుందని ఇప్పటికే ఇటలీ, స్పెయిన్ వంటి దేశాలు నిరూపించాయి. ఇన్ఫెక్షన్ సోకిన వారి రేటు శరవేగంగా పెరుగుతూ ఉండి, ఎక్కడికీ ప్రయాణాలు చేయని వారికి కరోనా పాజిటివ్ వస్తుంటే, కమ్యూనిటీ ట్రాన్స్ మిషన్ మొదలైపోయినట్టే.
ఇదిలావుండగా, ఎస్ఏఆర్ఐ గత నెలలో నిర్వహించిన పరీక్షల ఫలితాలకు, ఇప్పుడు చేస్తున్న పరీక్షల ఫలితాలకూ ఎంతో వ్యత్యాసం కనిపిస్తోంది. కరోనా లక్షణాలుగా చెప్పబడుతున్న జలుబు, దగ్గు, జ్వరం తదితరాలతో బాధపడుతున్న వారిలో 106 మందికి మార్చి 15 నుంచి 21 మధ్య పరీక్షించగా, కేవలం రెండు కరోనా పాజిటివ్ కేసులు మాత్రమే వచ్చాయి. అదే మార్చి 22 నుంచి 28 మధ్య 2,877 మంది రక్త నమూనాలను పరీక్షించగా, 48 పాజిటివ్ కేసులు (1.7 శాతం) వచ్చాయి. ఆపై మార్చి 29 నుంచి ఏప్రిల్ 2 మధ్య 2,069 మందిని పరీక్షించగా, 54 పాజిటివ్ కేసులు (2.6 శాతం) వచ్చాయి. వారం వారం కరోనా పాజిటివ్ వస్తున్న వారి శాతం పెరుగుతూ ఉండటం వైద్యాధికారులను ఆందోళనకు గురి చేస్తోంది.
కరోనా లక్షణాలు కనిపించిన మొత్తం 5,911 మంది రక్త నమూనాల పరీక్షల తరువాత 104 మందికి పాజిటివ్ రాగా, అందులో 40 మందికి పైగా ఎటువంటి అంతర్జాతీయ ప్రయాణాలూ చేయలేదు. వీరంతా దేశవ్యాప్తంగా 15 రాష్ట్రాల్లోని 36 జిల్లాలకు చెందిన వారు కాగా, ఆయా జిల్లాలపై మరింత దృష్టిని సారించాలన్న ఆదేశాలు కేంద్ర ఆరోగ్య శాఖ నుంచి రాష్ట్ర ప్రభుత్వాలకు వెళ్లాయి. ఇక కరోనా కేసుల్లో 80 శాతానికిపైగా కేసులు 40 ఏళ్లు దాటిన వారివేనని కూడా అధికారులు అంటున్నారు. వీరిలోనూ పురుషుల సంఖ్య అధికమని వెల్లడించారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more