Seven Attempted Suicide in Guntur గుంటూరులో కలకలం.. ఏడుగురు ఆత్మహత్యాయత్నం..

Tension triggers as seven attempted suicide in guntur

seven members, suicide attempt, Illegal constructions, illegal encroachments, Revenue officials, Police, demolition, pothuru, Guntur Outskirts, Guntur district, Andhra Pradesh, Politics

In a shocking incident, seven attempted suicide, protesting against the removal of the structures by the higher officials. The incident took place in Pothuru which is located in the outskirts of Guntur district.

ITEMVIDEOS: గుంటూరులో కలకలం.. ఏడుగురు ఆత్మహత్యాయత్నం..

Posted: 12/07/2019 11:34 AM IST
Tension triggers as seven attempted suicide in guntur

గుంటూరు జిల్లాలో ఏడుగురు వ్యక్తులు ఆత్మహత్యకు పాల్పడటం కలకలం రేపుతోంది. గుంటూరు నగర శివార్లలోని పొత్తూరు ప్రాంతంలో వున్న డంపింగ్ యార్డు సమీపంలో అక్రమ నిర్మాణాలను తొలగించేందుకు వచ్చిన రెవెన్యూ, పోలీసు అధికారులు రావడంతో.. తమ ఇళ్లను కూల్చవద్దని వేడుకున్న స్థానికులు అధికారుల చర్యలను నిరసించారు. ఈ క్రమంలో తమ నిర్మాణాలను కూల్చివేయడం అపని అధికారుల వైఖరికి నిరసనగా ఏకంగా ఏడుగురు వ్యక్తులు క్రిమి సంహారక మందు సేవించి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ఈ ఘటన ఇవాళ వెలుగులోకి రావడంతో తీవ్ర కలకలం రేపింది.

వివరాల్లోకి వెళ్తే.. గుంటూరు నగర శివారు పొత్తూరు నాయుడుపేట డంపింగ్‌ యార్డు స్థలంలో ఆక్రమణల తొలగింపు కొనసాగుతోంది. శుక్రవారం అర్ధరాత్రి 2 గంటల నుంచి రెవెన్యూ, పోలీసులు ఆధ్వర్యంలో జేసీబీలతో ఆక్రమణలను తొలగిస్తున్నారు. ఈ పనుల్లో 300 మంది సిబ్బంది పాల్గొన్నారు. గతంలో ఈ స్థలాన్ని అపాచీ సంస్థకు కేటాయించారు. నవ్యాంధ్ర ఎమ్‌ఆర్టీఎస్‌, ఎంసీపీఐ(యూ) ఆధ్వర్యంలో సుమారు 30 ఎకరాల స్థలంలో గత ఆరు నెలలుగా ఆక్రమణల తొలగింపును కొనసాగిస్తున్నారు.

దీనిని నిరసిస్తూ ఏడుగురు ఆక్రమణదారులు పురుగుమందు సేవించి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. వీరిని చికిత్స నిమిత్తం జీజీహెచ్ కు తరలించారు. అర్బన్‌ దక్షిణ మండల డీఎస్పీ కరుణాకర్‌రావు, ఆర్డీవో భాస్కర్‌రెడ్డి, తహసీల్దార్‌ మోహన్‌రావు, ఈ తొలగింపు వ్యవహారాన్ని పర్యవేక్షిస్తున్నారు. అపాచీ సంస్థకు చెందిన స్థలంలో అక్రమాలను తొలగిస్తున్నామని.. అయితే కొందరు కావాలనే ఆక్రమణలను నిరోధించడానికి ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డారని అధికారులు తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles