Nagababu slams YCP leaders comments దున్నపోతు ఈనిందంటే.. దూడను కట్టేసే వైసీపీ నేతలు: నాగబాబు

Mega brother nagababu gives befitting reply to ycp leaders comments

Pawan Kalyan, JanaSena, Naga babu, YCP Leader Comments, Disha case, Disha Encounter case, Women, Rape cases, sexual assault cases, molestation case, Instant Justice, Telangana, Crime

Jana Sena Chief Pawan Kalyan reacted to the encounter of the four accused in the heinous crime of rape and murder of Disha. But his comments were misunderstood by media and published a wrong version. Now Mega Brother Nagababu gives befitting reply to YCP leaders on Disha comments.

దున్నపోతు ఈనిందంటే.. దూడను కట్టేసే వైసీపీ నేతలు: నాగబాబు

Posted: 12/07/2019 10:43 AM IST
Mega brother nagababu gives befitting reply to ycp leaders comments

తెలంగాణ వెటర్నరీ వైద్యురాలు దిశ హత్యాచార కేసులో నిందితులను పోలీసులు ఎన్ కౌంటర్ చేయడంతో కథ ముగిసిపోయింది. అయితే ఈ నిందితుల పట్ల తెలంగాణ ప్రభుత్వం, పోలీసులు కఠినంగా వ్యవహరించడం లేదని ఎన్ కౌంటర్ కు ముందు విమర్శలు వెల్లువెత్తిన పక్షంలో మీడియాతో మాట్లాడిన పవన్ కల్యాణ్.. దిశ హత్యాచార కేసులోని నిందితులకు.. చిన్నప్పుడు వారు వక్రమార్గం పట్టిన సమయంలో రెండు బెత్తం దెబ్బలు వేసి వుంటే.. ఇప్పుడు ఇలాంటి పరిస్థితులు వచ్చి వుండేవి కాదు అని వ్యాఖ్యానించారు.

కానీ ఆయన వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకున్న ఓ పత్రిక నిందితులకు రెండు బెత్తం దెబ్బలు చాలునని.. జనసేన అధినేత పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారని వార్తను ప్రచురించింది. దీంతో ఈ వార్తను పట్టుకుని వైసీపీ నేతలు పవన్ కల్యాణ్ ను టార్గెట్ చేశారు. విమర్శలు గుప్పిస్తున్నారు. నా నాలుకకే కాదు చేతికి కూడా నరాలు లేవు అన్నట్లు వ్యవహరిస్తున్న వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఆ అంశమై జనసేనను లక్ష్యంగా చేసుకున్నారు. అయితే ఈ అంశంలో అధికార పార్టీ పవన్ కల్యాణ్ ను ఇరుకున పెట్టే ప్రయత్నాలు చేస్తున్న క్రమంలో మెగా బ్రదర్ నాగబాబు.. రంగంలోకి దిగారు.

పవన్ కల్యాణ్ ను జనసేన పార్టీని ఇబ్బందిపెట్టాలని ప్రయత్నిస్తున్న వైసీపీ నేతలపై జనసేన నేత నాగబాబు విరుచుకుపడ్డారు. దిశ అత్యాచార నిందితుల విషయంలో పవన్ కల్యాణ్ ఏమన్నారో పూర్తిగా, సరిగ్గా వినండీ. అ తరువాత దీనిపై విమర్శలు చేయండి.. అంతేకాని దున్నపోతు ఈనింది అంటే దూడను కట్టేయండి అనే బాపతు ఆలోచనలు పక్కనపెట్టండని ఆయన వైసీపీ నేతలకు సూచించారు. ఇకపై కూడా ఇలాంటి విమర్శలే చేస్తే.. సహించబోమన్నారు. వైసీపీ నేతలకేనా నోటికి వచ్చినంత మాట్లాడే దమ్ము ధైర్యం ఉంది అని ప్రశ్నించారు.

తమకు కూడా ఇలాంటి వ్యాఖ్యలు చేయడం, నీతిమాలిన విమర్శలు చేయడం చేతనౌనని.. అయితే అలా చేయడానికి మాకు సంస్కారం అడ్డం వస్తుందని ఆయన అన్నారు. వైసీపీ నేతలు దిగజారుడు విమర్శలు చేస్తున్నారు.. సంస్కారాన్ని, వ్యక్తిత్వాన్ని మర్చి తమ స్థాయిని తామే తగ్గించుకుంటున్నారని నాగబాబు విరుచుకుపడ్డారు. అయితే అలాంటి విమర్శలు చేసేందుకు తమకు సంస్కారం అడ్డువస్తుందని.. కాబట్టి అనిగి ఉన్నామని అన్నారు. ఇక దిగజారుడు విమర్శలు చేయడంపై మీ వివేకానికే, విజ్ఞతకే వాటిని  వదిలేస్తున్నామంటూ నాగబాబు  తీవ్ర స్థాయిలో మండి పడ్డారు.. ప్రస్తుతం ఈ మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(1 Vote)
Tags : Pawan Kalyan  JanaSena  Naga babu  YCP Leader Comments  Disha case  Telangana  Crime  

Other Articles