TSRTC Stirke: TJAC announces 7-day agitation 14వ రోజకు కార్మికుల సమ్మె.. ఆర్టీసీ జేఏసీ యాక్షన్ ప్లాన్..

Tjac announces 7 day agitation as government fail to begin talks

TSRTC Workers, High Court, High court urges workers to call off strike, tsrtc jac, Telangana movement, Ashwathama Reddy, TSRTC, TSRTC Workers, TSRTC Workers Strong Warning, Telangana Bandh, ts government

In the absence of any word from the State government or the TSRTC management, the striking employees’ JAC announced a week-long agitation programme from October 21.

14వ రోజకు కార్మికుల సమ్మె.. ఆర్టీసీ జేఏసీ యాక్షన్ ప్లాన్..

Posted: 10/21/2019 12:19 PM IST
Tjac announces 7 day agitation as government fail to begin talks

తెలంగాణలో జరుగుతున్న ఆర్టీసీ కార్మికుల సమ్మె తీవ్రరూపం దాల్చింది. ఇటు ప్రభుత్వం అటు కార్మికులు బెట్టువీడకపోవడంతో రాష్ట్ర ప్రజలు అనేక ఇబ్బందుకులు గురవుతున్నారు. ఆర్టీసీ కార్మికుల సమ్మెతో ప్రజలు తీవ్ర ఇబ్భందులు పడుతున్నారని వ్యాఖ్యానించిన రాష్ట్రోన్నత న్యాయస్థానం హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఆర్టీసీ కార్మిక సంఘాలతో ప్రభుత్వం తక్షణం చర్చలు నిర్వహించి.. వారి సమస్యలను పరిష్కరించాలని హైకోర్టు అదేశాలు జారీ చేసింది.

అయితే ప్రభుత్వం కానీ, ఆర్టీసీ యాజమాన్యం కానీ ఈ దిశగా ఒక్క అడుగు కూడా ముందుకు వేయకపోవడంతో తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ ఆర్టీసీ సమ్మెను మరింత ఉదృతం చేయాలని నిర్ణయించింది. సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో భేటీ అయిన ఆర్టీసీ జేఏసీ నేతలు, అఖిలపక్ష నేతలు తమ కార్యాచరణను సిద్ధం చేశారు. ఈ సందర్భంగా ఆర్టీసీ జేఏసీ చేపట్టే అన్ని కార్యక్రమాలకు మద్దతు ప్రకటించాలని అఖిలపక్ష నేతలు నిర్ణయించారు.

నిధులు పుష్కలంగా వున్న తెలంగాణలోనే ఆర్టీసిని ప్రైవేటు పరం చేయాలని నేతలు పట్టుబడుతుండగా, అటు నిధుల లేమితో భాధపడుతున్న ఆంధ్రప్రదేశ్ లో ఒక్క సంతకంతో ఆర్టీసీ కార్మికులందరినీ అక్కడి ముఖ్యమంత్రి ప్రభుత్వ ఉద్యోగులుగా మార్చేశారని కార్మిక సంఘాల నేతలు వాఖ్యనిస్తున్నారు. తమ ప్రధాన డిమాండును నెరవేర్చేవరకు తమ సమ్మె అగబోదని కార్మికులు భీష్మించుకున్నారు. ఆర్టీసీని టీఎస్ఆర్టీసీలో విలీనం చేసి.. తమను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని డిమాండ్ చేస్తున్నారు.

జాయింట్ యాక్షన్ కమిటీ ప్రణాళికలో భాగంగా ఇవాళ ఆర్టీసీ కార్మికులు.. తమ కుటుంబాలతో కలసి ధర్నా చేయాలని నిర్ణయం తీసుకున్నారు. తాత్కాలిక డ్రైవర్లు, కండక్టర్లను విధులకు రావద్దని కోరారు. బస్సులో ప్రయాణించేవారికి టికెట్లు ఇచ్చి, ఆర్టీసీకి మరింత నష్టం చేకూరకుండా వ్యవహరించాలని సూచించారు. 23వ తేదీన ప్రజాప్రతినిధులను కలిసి తమ డిమాండ్లను వివరించాలని నిర్ణయించారు.

26న ఆర్టీసీ కార్మికులు పిల్లలతో ధర్నా చేయనున్నారు. 27న ఆర్టీసీ కుటుంబసభ్యులతో కలసి వామపక్ష నేతలు, కార్యకర్తలు కుటుంబాలు భోజనాలు చేయనున్నారు. 28, 29న నిరసన ప్రదర్శలను చేపట్టనున్నారు. 30న సకల జనుల సమ్మెకు పిలుపునిచ్చారు. ఈ మేరకు 10 రోజుల కార్యాచరణను సిద్ధం చేశారు. అప్పటికైనా ప్రభుత్వం దిగిరాకపోతే.. తమ సమ్మె మాత్రం యధాతథంగా కొనసాగుతుందని.. ఆ తరువాత కార్యచరణను మరోమారు కూర్చోని నిర్ణయిస్తామని నేతలు తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : TRS  High Court  Ashwathama Reddy  RTC Employees  TSRTC Strike  KCR  Hyderabad  Telangana  

Other Articles