Hyderabad Metro commuters fear for their safety మెట్రో రైలు భద్రతపై ఆందోళనలో ప్రయాణికులు

Hyderabad metro commuters fear for their safety after concrete slab falls at ameerpet

Hyderabad Metro commuters, safety concern araises in metro commuters, metro rail commuters safety, ameerpet metro station roof collapses, metro rail, commuters, fear, roof collapse, ameerpet, mounica, safety concern, hyderabad, crime

Safety concern araise in the Hyderabad metro rail commuters, now they are in shock to travel in these trains after a woman dies due to ameerpet metro station roof collapses.

మెట్రో రైలు భద్రతపై అందోళనలో ప్రయాణికులు

Posted: 09/23/2019 12:29 PM IST
Hyderabad metro commuters fear for their safety after concrete slab falls at ameerpet

మెట్రో రైలు నిర్మాణంతో దేశంలోని అగ్రగామిగా హైదరాబాద్ నగరం నిలుస్తుందని.. ఇది హైదరాబాద్ ప్రపంచ నగరంగా తీర్చిదిద్దేందుకు సోమానమని కితాబిచ్చిన పాలకులు.. తమ వ్యాఖ్యలను పున:సమీక్షించాల్సిన తరుణమిది. ప్రతిరోజు లక్షల మంది ప్రయాణికులను వారివారి గమ్యస్థానాలకు చేరవేసే మెట్రో రైలు నిర్మాణం, భద్రతపై అమీర్ పేట ఘటన అనంతరం తాజాగా అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి, ఈ ప్రమాదంతో మెట్రో ప్రయాణం అంటేనే జనం భయపడే పరిస్థితి దాపురించింది.

వర్షం పడటంతో మెట్రో స్టేషన్ మెట్లను అసరగాగా చేసుకున్న మహిళకు అదే శాపంగా మారి.. మెట్రో రైలు పెచ్చులూడి అమెపై పడి మృతి చెందడం, అదీనూ మెట్రో రైలు అధికారులు చెప్పినట్లు అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మితమైన అమీర్ పేట్ ఛేంజ్ ఓవర్ లోనే ఇలాంటి ఘటన జరగడంతో ప్రయాణికులు లను తీవ్రకలవరానికి గురి చేస్తోంది. శరవేగంగా సాగిన నిర్మాణంలో నాణ్యత లేకపోవడమే ప్రమాదానికి కారణమన్న విమర్శలు వినిపిస్తున్నాయి. చిన్నపాటి వర్షానికే పెచ్చులూడితే.. భారీ వర్షం కురిస్తే ప్రయాణికుల ప్రాణాలకు దిక్కెవరు? అన్న సందేహాలు రేకెత్తుతున్నాయి.

అధివారం మధ్యాహ్నం తన ఇంటికి వచ్చిన కసిన్ తో పాటు అమీర్ పేటలోని లేడీస్ హాస్టల్ చూసేందుకు వచ్చిన మౌనిక.. వర్షం రావడంతో రైల్లే స్టేషన్ మెట్ల కిందికు పరుగెత్తింది. అదే సమయంలో మెట్రో స్టేషన్ పెచ్చులూడి కిందనున్న మౌనిక తలపై పడింది. 108కు ఫోన్ చేసినా అది సమయానికి రాకపోవడంతో అమెను అటోలో స్థానికంగానే వున్న ప్రైవేటు అసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే అమె ప్రాణాలు కోల్పోయిందని వైద్యులు తెలిపారు. ఎల్ అండ్ టి అధికారుల నిర్లక్ష్యమే తన భార్య ప్రాణాలు బలైపోయాయని మౌనిక భర్త ఆరోపించారు. వారిపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.

పెద్దపల్లి ఎమ్మెల్యే తమకు ఫోన్‌చేసి మెట్రో అధికారులతో మాట్లాడి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారని ఆయన తెలిపారు. ఈ ఘటనతో మెట్రో నిర్మాణ పనులపై జనాలకు భయం పట్టుకుంది. చిన్నపాటి వర్షానికే పెచ్చులూడి పడితే వరుసగా భారీ వర్షాలు కురిస్తే పరిస్థితి ఏంటని ప్రశ్నిస్తున్నారు. అదే సమయంలో రైళ్లో ప్రయాణిస్తే తమ పరిస్థితి ఏంటనీ, వేగంగా నిర్మాణం పూర్తిచేయాలన్న ఉద్దేశంతో పనుల్లో నాణ్యత లోపించిందని ఆరోపిస్తున్నారు. దీనిపై వెంటనే విచారణ చేపట్టాలని నాణ్యత లేని స్టేషన్2లో తిరిగి పనులు ప్రారంభించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

హైదరాబాద్ మెట్రో దేశానికే ఆదర్శమని, పూర్తి భద్రతా ప్రమాణాలతో తక్కువ కాలంలోనే నిర్మించామని అనేక సందర్భాల్లో నాయకులు, మెట్రో అధికార గణం గొప్పగా చెప్పుకున్నారు. వందేళ్లు సేవలందించేలా రూపొందించామని జబ్బులు చంకలు గుద్దుకున్నారు. అమీర్‌పేట్ ఘటనతో అందరూ ఉలిక్కిపడుతున్నారు. కొన్ని స్టేషన్లలో గోడలు బీటలు వారిన దృశ్యాలు దర్శనమిస్తున్నాయి. నిర్మాణ పనులు జరుగుతున్న సమయంలో పలుచోట్ల ప్రమాదాలు చోటుచేసుకున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles