Dozens still missing after boat capsized in Godavari గోదావరినదిలో కొనసాగుతున్న గాలింపు.. 18 మంది గల్లంతు

Dozens still missing after sight seeing boat capsized in godavari killing 8

boat capsizes in Godavari river, sight seeing boat capsizes, boat capsizes near devipatnam, boat capsizes in East Godavari, boat capsizes in Andhra Pradesh, Godavari river, sight seeing boat, devipatnam, boat capsizes, East Godavari, Andhra Pradesh, Crime

While 27 people were rescued by members of National Disaster Response Force (NDRF) and local villagers, eight bodies were recovered as of late Sunday evening, officials said. Rescue operations, however, were hampered due to heavy flow of water and darkness.

గోదావరినదిలో కొనసాగుతున్న గాలింపు.. 18 మంది గల్లంతు

Posted: 09/16/2019 10:18 AM IST
Dozens still missing after sight seeing boat capsized in godavari killing 8

గోదావరి నదిలో లాంచీ మునిగిపోయిన ప్రమాదంలో గల్లంతైన వారి మృతదేహాలు సముద్రంలోకి కొట్టుకుపోకుండా, అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. రాజమండ్రి ధవళేశ్వరం ఆనకట్ట వద్ద అన్ని గేట్లనూ కిందకు దించారు. మృతదేహాలు నీటిపైనే కొట్టుకు వస్తాయి కాబట్టి, నీటి మట్టానికి కాస్తంత దిగువ వరకూ గేట్లను మూసివేయాలని ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు అందినట్టు జలాశయం ఉద్యోగులు వెల్లడించారు. దీంతో సముద్రంలోకి వదులుతున్న నీటిని కాస్తంత తగ్గించామన్నారు.

ఎగువ నుంచి వచ్చే ప్రవాహాన్ని అనుసరించి, తదుపరి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. కొట్టుకువచ్చే మృతదేహాలు సముద్రంవైపునకు వెళితే, దాదాపు 500 చదరపు కిలోమీటర్ల పరిధికి పైగానే గాలింపు చర్యలు చేపట్టాల్సి వస్తుంది. ప్రమాదం జరిగి ఇంకా 24 గంటలు దాటలేదు కాబట్టి, మృతదేహాలు ప్రమాదం జరిగిన ప్రాంతం నుంచి ఎక్కువ దూరం కొట్టుకువచ్చే అవకాశాలు లేవు. అందువల్లే ధవళేశ్వరం డ్యామ్ గేట్లను నీటిలోకి మూడు అడుగుల మేరకు దించినట్టు అధికారులు వెల్లడించారు.
 
ఈ ప్రమాదంలో ఇప్పటి వరకు 8 మంది మృతదేహాలను వెలికి తీశారు. గల్లంతైన వారి కోసం రెస్క్యూ సిబ్బంది, స్థానికులు నదిలో గాలిస్తున్నారు. కాగా, ప్రమాదంలో గల్లంతైన వారి వివరాలు ఇలా ఉన్నాయి. హైదరాబాద్ ఉప్పల్‌కు చెందిన అంకం శివజ్యోతి, అంకం పవన్ కుమార్, అంకం వసుంధర, అంకం సుశీల్, పట్టిసీమకు చెందిన మణికంఠ, వరంగల్ జిల్లా కడిపికొండకు చెందిన బసికె అవినాశ్, సునీల్, ధర్మరాజు, వెంకటయ్యలు ఉన్నారు.

ఇక వీరితో పాటు డ్రైవర్ నూకరాజు, డ్రైవర్ సత్యనారాయణ, శెట్టిపల్లి గంగాధర్, వి.రఘురాం, బాలు, రమణ, అరుణ, అశిలేశ్, శాలీల ఆచూకీ తెలియరాలేదు. మరో ఇద్దరి వివరాలు తెలియాల్సి ఉంది. ప్రమాదం నుంచి బయటపడిన వారిలో వరంగల్ జిల్లాలోని కడిపికొండకు చెందిన ఆరపల్లి యాదగిరి, బసికె దశరథ్, బసికె వెంకటస్వామి, దర్శనాల సురేశ్, గొర్లె ప్రభాకర్, హైదరాబాద్ ఉప్పల్‌కు చెందిన చింతామణి జానకిరామ్, కోదండ అర్జున్ లు వున్నారు.

వీరతో పాటు ఎండీ మజురద్దీన్, నార్లపురం సురేశ్, సోరేటి రాజేశ్, నల్గొండ జిల్లా కోదాడకు చెందిన గల్లా శివశంకర్, చిట్యాలకు చెందిన మేడి కిరణ్ కుమార్, అనకాపల్లి గోపాలపురానికి చెందిన బోసాల లక్ష్మి, తిరుపతికి చెందిన దుర్గం మధులత, హనుమాన్ జంక్షన్‌కు చెందిన మద్దెల జోజిబాబు, ఉంగరాల శ్రీను, నరసాపురానికి చెందిన మండల గంగాధర్, హైదరాబాద్‌కు చెందిన పాడి జననీ కుమార్, గొల్లపూడికి చెందిన కర్ణపు గాంధీ, కడపకు చెందిన కంచా జగన్నాథరెడ్డిలు ఉన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Godavari river  sight seeing boat  devipatnam  boat capsizes  East Godavari  Andhra Pradesh  Crime  

Other Articles