Resue team recover 4 more bodies from godavari గోదావరినదిలోంచి మరో నాలుగు మృతదేహాల వెలికితీత

Resue team recover 4 more bodies from godavari dozens still missing

4 more bodies recoverd, another 4 bodies recovered from godavari, CM Jagan review on boat capsize, CM jagan to console the victims, boat capsizes in Godavari river, sight seeing boat capsizes, boat capsizes near devipatnam, boat capsizes in East Godavari, boat capsizes in Andhra Pradesh, Godavari river, sight seeing boat, devipatnam, boat capsizes, East Godavari, Andhra Pradesh, Crime

National Disaster Response Force (NDRF) and local villagers search is on for bodies of the victims of the boat capsize accident. On sunday night they recovered eight bodies and on Monday another four bodies were recovered.

గోదావరినదిలోంచి మరో నాలుగు మృతదేహాల వెలికితీత

Posted: 09/16/2019 11:42 AM IST
Resue team recover 4 more bodies from godavari dozens still missing

తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం మండలం కచ్చులూరు దగ్గర లాంచీ బోల్తా ఘటన పెను విషాదాన్ని నింపింది. ఈ ప్రమాదంలో గల్లంతైనవారిలో ఇదివరకే 8 మృతదేహాలు రెస్క్యూ బృందాలు వెలికి తీశారు. ఇవాళ ఉదయం మరో నాలుగు మృతదేహాలను గుర్తించారు. ఇందులో నెలల వయసున్న పసి పాప కూడా ఉండటం బాధిస్తోంది. ప్రమాదం జరిగిన ప్రాంతంలో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. ప్రమాదంలో గల్లంతైన వారి కోసం స్థానికులు, ఎన్డీఆర్‌ఎఫ్ సిబ్బంది గాలిస్తున్నారు.

క్షత్రగాత్రులకు ముఖ్యమంత్రి జగన్ పరామర్శ

హెలికాప్టర్ ను కూడా రంగంలోకి దించిన అధికారులు గాలింపు చర్యలను ముమ్మరం చేస్తున్నారు. గల్లంతైన వారికోసం అన్వేషిస్తున్నారు. కాగా, ఈ ఘటన నేపథ్యంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ తాడేపల్లి నుంచి హెలికాప్టర్‌లో సంఘటనా స్థలానికి బయల్దేరారు. లాంచీ బోల్తా పడిన కచ్చులూరు ప్రాంతాన్ని ముఖ్యమంత్రి ఏరియల్‌ సర్వే ద్వారా పరిశీలించారు. తర్వాత రాజమండ్రి ప్రభుత్వాసుపత్రికి వెళ్లి క్షతగాత్రులను పరామర్శించి.. ప్రమాదానికి గల కారణాలను తెలుసుకోనున్నారు. అనంతరం అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు.

దేవీపట్నం మండలం మంటూరు-కచ్చులూరు దగ్గర గండి పోచమ్మ ఆలయం నుంచి పాపికొండలకు పర్యాటకులతో వెళ్తుండగా ఘటన జరిగింది. ప్రమాదం జరిగిన సమయంలో లాంచీలో 60మందికిపైగా పర్యాటకులు ఉన్నట్లు తెలుస్తోంది. సుడిగుండం, లాంచీకి రాయి తగలడం వల్ల ఒక్కసారిగా లాంచీ బోల్తాపడినట్లు తెలుస్తోంది. ప్రమాదం నుంచి 27మంది సురక్షితంగా బయటపడగా.. 39 మంది గల్లంతైనట్లు అధికారులు చెబుతున్నారు.

ఈ ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడి.. ఆస్పత్రిలో చికిత్సపొందుతున్న వారిని మంత్రులు కన్నబాబు, ఆళ్లనానిలు పరామర్శించారు. బాధితుల వివరాల గురించి ఆరా తీశారు.. వారిని ఫోన్‌లో కుటుంబ సభ్యులతో మాట్లాడించారు. కోలుకున్న తర్వాత సొంత ఊర్లకు పంపేలా ఏర్పాట్లు చేయాలని అధికారుల్ని ఆదేశించారు. ప్రమాద సమయంలో పర్యాటకులు చాలామంది లైఫ్ జాకెట్లు వేసుకోలేదని మంత్రులు చెబుతున్నారు. లాంచీలో సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతండటంతో చాలామంది జాకెట్లు వేసుకోలేదని ప్రత్యక్ష సాక్ష్యులు చెబుతున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles