ysrcp mla's white ration card post goes viral వైసీపీ ఎమ్మెల్యే సీదిరి అప్పల రాజు పోస్టు వైరల్..

Ysrcp mla seediri appala raju white ration card post goes viral

ysrcp mla white ration card, mla seediri appala raju white ration card, palasa mla white ration card, social media white ration card, white ration card andhra pradesh, ysrcp mla, mla seediri appala raju, palasa mla, social media, white ration card, viral news, andhra pradesh, politics

ysrcp mla seediri appala raju white ration card post after village volunteer delivers ration to his house, goes viral on social media

వైసీపీ ఎమ్మెల్యే సీదిరి అప్పల రాజు పోస్టు వైరల్.. విమర్శలు

Posted: 09/10/2019 10:45 AM IST
Ysrcp mla seediri appala raju white ration card post goes viral

ఆంద్రప్రదేశ్ లో దారిద్య్ర రేఖకు దిగువనున్న ప్రజలకు నాణ్యమైన బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ప్రభుత్వం పైలెట్ ప్రాజెక్టు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి శ్రీకాకుళంలో ప్రారంభించిన విషయం తెలిసిందే. తెల్లరేషన్ కార్డున్న ప్రతి ఒక్కరికీ ఈ బియ్యాన్ని గ్రామ వాలంటీర్లు స్వయంగా అందజేస్తున్నారు. ఇంతవరకు బాగానే వున్నా.. ఇక్కడే అసలు సమస్య వచ్చింది. గ్రామ వాలెంటీరు ఏకంగా పలాస ఎమ్మెల్యే డాక్టర్ సీదిరి అప్పలరాజుకు నాణ్యమైన బియ్యం అందజేశారు.

ఈ సందర్భంగా ఆయన తన కుటుంబసభ్యులతో కలిసి ఫోటో దిగి ఫేస్‌బుక్‌లో పెట్టారు. ‘జీఎంఈ కాలనీలోని తన ఇంటికి వాలంటీర్ ఎస్. ప్రసాద్ వచ్చి రేషన్ అందజేశారు.. నాకు బియ్యం అప్పగించిన విధానం ప్రకారం.. వాలంటీర్ల వ్యవస్థ అద్భుతంగా పని చేస్తోంది. గుమ్మం వద్దకే వచ్చి వారుసేవలు అందిస్తున్నారు. ఇదే పాలనలోని పారదర్శకత’ అని ఆయన పోస్టు చేశారు. ఇది వైరల్ కావడంతో ఆయనకు తెల్ల రేషన్‌కార్డు ఎలా వచ్చిందంటూ సోషల్ మీడియాలో పలువురు ప్రశ్నించారు.

అయితే, ఈ పోస్ట్ కిందే ఎమ్మెల్యే పలు సందేహాలకు వివరణ ఇచ్చారు. ‘నాకు తెల్లరేషన్ కార్డు ఉందని తెలియదు.. ఈ విషయం కుటుంబసభ్యులకు కూడా తెలియదు.. నేనే తెల్లరేషన్ కార్డుదారుడునైతే ప్రతి నెల నా రేషన్, ఇతర బిపిఎల్ సంక్షేమ పథకాలు ఏమవుతున్నాయి.. నాకు నెల నెల రేషన్ అందనప్పుడు దానిని ఎద్దుకు రద్దుచేయలేదు.. పాస్‌పోర్టు కోసం 2009లో రేషన్ కార్డు అవసరం వచ్చింది. ఈ క్రమంలో గులాబీ రేషన్‌కార్డు కోసం దరఖాస్తు చేశాను. 2010-11లో తెల్లకార్డు ఇచ్చారు.

అయితే దాన్ని రద్దు చేయాలని కోరాను.. తరువాత పట్టించుకోలేదు. అప్పటినుంచి రద్దు కాలేదట. దీనిపై పలాస, వజ్రపుకొత్తూరు తహసీల్దార్లతో మాట్లాడాను. 2014లోనే రద్దయిందని అన్నారు. అప్పట్లో రద్దయిన కార్డులు ఇప్పుడు మళ్లీ పునరుద్ధరించామని చెబుతున్నారు. ప్రస్తుతం ఇచ్చిన బియ్యాన్ని వెనక్కి ఇస్తూ విచారించాలని అధికారులను కోరా’ అని అప్పలరాజు వివరించారు. ఎమ్మెల్యే అప్పలరాజు స్వగ్రామం పలాస నియోజకవర్గంలోని వజ్రపుకొత్తూరు మండలం దేవునల్తాడ. అక్కడి ఆయన పేరుతో తెల్ల కార్డు ఉండగా, ప్రస్తుతం పలాసలో ఉంటున్నారు.

రేషన్‌కార్డుకు ఆధార్‌ మ్యాపింగ్‌ చేసిన ప్రకారం పలాసలో ఉంటున్న ఎమ్మెల్యేకు సరకులు ఇచ్చినట్లు తెలుస్తోంది. ‘వాలంటీర్లు చక్కగా పనిచేస్తున్నారు.. సరుకులను నేరుగా లబ్దిదారుల ఇంటికే తీసుకొచ్చి ఇస్తున్నారు. రేషన్ ధరకు అయ్యే మొత్తమే తీసుకుంటున్నారని గానీ అంతకంటే ఒక్క పైసా కూడా ఎక్కువ తీసుకోవడం లేదు. ఏదైనా సంక్షేమ పథకాలను అదే రోజున అందజేస్తున్నారు. వాలంటీర్ల వ్యవస్థ అద్భుతంగా పని చేస్తోంది. గుమ్మం వద్దకే వచ్చి వారు సేవలందిస్తున్నారు. ఇదే వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి పాలనలోని పారదర్శకత అంటూ’ ఫేస్‌బుక్‌లో వివరించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles