Army School Teacher Recruitment 2019 ఆర్మీ పాఠశాలల్లో 8 వేల ఉపాద్యాయ పోస్టుల భర్తీ

Army welfare education society announces school teacher recruitment 2019

Army Public School AWES Teacher Recruitment, AWES PGT/TGT/PRT 2019 Exam Pattern, AWES, teacher posts, teacher jobs, pgt teacher post, tgt teacher posts, prt teacher posts, Army schools teacher jobs

Army Public Schools (APS) located in various Cantonments and Military Stations across India. These schools are administered and managed by local Army authorities and affiliated to CBSE through Army Welfare Education Society (AWES).

ఆర్మీ పాఠశాలల్లో 8 వేల ఉపాద్యాయ పోస్టుల భర్తీ

Posted: 09/10/2019 11:46 AM IST
Army welfare education society announces school teacher recruitment 2019

ఆర్మీ వెల్‌‌ఫేర్ ఎడ్యుకేషన్ సొసైటీ-ఏడబ్యూఈఎస్ (AWES) భారీగా పీఆర్‌టీ, టీజీటీ, పీజీటీ పోస్టుల భర్తీ చేపట్టింది. ఆర్మీ పబ్లిక్ స్కూల్స్‌లో 8000 పైగా టీచర్ ఉద్యోగాలను భర్తీ చేయబోతోంది. దేశంలోని మిలిటరీ స్టేషన్స్, కంటోన్మెంట్లల్లో ఉన్న ఆర్మీ పబ్లిక్ స్కూళ్లల్లో ఈ పోస్టుల్ని నియమించనుంది. అయితే దేశవ్యాప్తంగా వున్న ఈ స్కూళ్లల్లో ఎక్కడెక్కడ ఎన్నెన్నీ పోస్టులు ఉన్నాయో ఇంటర్వ్యూ నిర్వహించే ముందు ఆయా స్కూళ్లు వెల్లడిస్తాయి.

దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. దరఖాస్తుకు 2019 సెప్టెంబర్ 21 చివరి తేదీ. కంబైన్డ్ సెలెక్షన్ స్క్రీనింగ్ ఎగ్జామినేషన్ ద్వారా ఈ పోస్టుల్ని భర్తీ చేయనుంది ఏడబ్యూఈఎస్. ఆన్ లైన్ స్క్రీనింగ్ టెస్ట్, ఇంటర్వ్యూ, టీచింగ్ స్కిల్స్ పరిశీలన ద్వారా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలను www.awesindia.com వెబ్ సైట్ లో చూడొచ్చు. 8000 పైగా టీచర్ పోస్టుల భర్తీకి ఆర్మీ వెల్‌‌ఫేర్ ఎడ్యుకేషన్ సొసైటీ జారీ చేసిన జనరల్ ఇన్‌స్ట్రక్షన్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. దరఖాస్తు చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

AWES Recruitment 2019: గుర్తుంచుకోవాల్సిన తేదీలు...

* ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం: 2019 సెప్టెంబర్ 1
* దరఖాస్తుకు చివరి తేదీ: 2019 సెప్టెంబర్ 21
* అడ్మిట్ కార్డుల డౌన్‌లోడ్: 2019 అక్టోబర్ 4 నుంచి
* పరీక్ష నిర్వహించే తేదీ: 2019 అక్టోబర్ 19, 20
* ఫలితాల విడుదల: 2019 అక్టోబర్ 30

PGT: పోస్ట్ గ్రాడ్యుయేషన్‌లో 50% మార్కులతో పాస్ కావడంతో పాటు బీఈడీ ఉండాలి.
TGT: గ్రాడ్యుయేషన్‌లో 50% మార్కులతో పాస్ కావడంతో పాటు బీఈడీ ఉండాలి.
PRT: బీఈడీతో పాటు రెండేళ్ల డిప్లొమా 50% మార్కులతో పాస్ కావాలి.
వయస్సు: ఫ్రెషర్‌కు 40 ఏళ్లు, అనుభవజ్ఞులకు 57 ఏళ్లు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles