TTD kept check on hotel rates at Tirumala తిరుమలలో ఇక ఇడ్లీ రూ.7.50, భోజనం రూ.22.50 మాత్రమే!

Good news to tirumala devotees as ttd kept check on hotel rates

tirumala, Sri venkateshwara swamy, devotees, hotels, tiffins, meals, srivari temple, TTD check on hotel rates, Crime

With Repeated complaints from devotees, now in the presence of new Government and New Tirumala Tirupati devasthanam board took a good decision to keep check on tiffins and meals on Tirumala.

శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్.. ఇక భోజనపలహారాలు చౌకే.!

Posted: 08/03/2019 02:07 PM IST
Good news to tirumala devotees as ttd kept check on hotel rates

దేశంలోని ప్రసిద్ద పుణ్యక్షేత్రాలన్నీ దోపిడీదారులకు అడ్డాలు అన్న వాదన భక్తులలో బలంగా నాటుకుపోతుంది. పుణ్యక్షేత్రానికి వెళ్లాలంటే.. దారి ఖర్చులను ఇచ్చి మరీ ప్రోత్సహించిన గ్రామపెద్దలు, తోటి గ్రామస్థుల సంఖ్య క్రమంగా కనుమరుగైంది. దీనికి బదులుగా దోపిడీదారులు సంఖ్య గణనీయంగా పెరిగింది. రూపాయి వస్తువును పది రూపాయలుగా చెప్పి.. చివరకు దానిని ఏడుకో, ఎనమిదికో అంటగట్టే వ్యాపారుల సంఖ్య పెరిగింది.

అది డబ్బులున్నవారికే అనుకుందామా..? అలాంటి పరస్థితి లేదు. పుణ్యక్షేత్రాలకు వెళ్లి దేవుడ్ని దర్శించుకున్న తరువాత దారిపోడువునా వున్న దుకాణాల వైపు చూసి చిన్నారులు అడుగు కూడా ముందుకు వేయరు. మాకు అది కావాలంటే.. కాదు అదని మారం చేయడం.. చివరకు తల్లిదండ్రులు వాటి ధర తెలుసుకుని బేరమాడి చివరకు ఎంతకో దానిని కొనుగోలు చేయడం పుణ్యక్షేత్రాలలో పరిపాటి అని చెప్పక తప్పదు. ఇది వస్తువులకే పరిమితం కాదు.. అల్పాహారం మొదలుకుని బోజనం వరకు అన్ని చోట్ల ధరాఘాతం ప్రళయతాండవం చేస్తోంది.

అయితే ఈ తరహా దోపిడీలకు ప్రసిద్ద చెందిన పుణ్యక్షేత్రాలు నెలవు కావడం.. అనేక పిర్యాదులు వెల్లువెత్తినా.. తూతూ మంత్రంగా చర్యలు తీసుకోవడం తప్ప నిజంగా చిత్తశుద్దితో చర్యలు చేపట్టిన అధికారులు మాత్రం కానరాలేదు. మరీ ముఖ్యంగా కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీవారు కొలువైన తిరుమల కొండపై ఈ తరహా ఘటనలు అనేకం. అయితే ఇన్నాళ్లు అధికారులు, ప్రభుత్వాలు పట్టించుకోని ఈ సమస్యను, రాష్ట్రంలో కొలువుదీరిన కొత్త ప్రభుత్వం.. తిరుమలపై నూతనంగా బాధ్యతలు చేపట్టిన ఆలయ కమిటీ భక్తులను నిలువుదోపిడి చేస్తున్నఅల్పాహారం, భోజన హోటళ్లపై చెక్ పెట్టాయి.

తిరుమల కొండపై ప్రస్తుతం రెండు ఇడ్లీలకు రూ.25, ప్లేట్ మీల్స్‌కు రూ.60 వసూలు చేయడంతో పాటు.. ఆ భోజన పలహారాలు కూడా నాసి రకంగా వుండటంపై దేవాదాయశాఖ కన్నెర చేసింది. ఇకపై వీటి ధరలను రూ.7.50, రూ.22.50గా నిర్ణయించింది. ఫుల్ మీల్స్‌కు రూ.31గా తీసుకోవాలని దేవాదాయశాఖ ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతం కొండపై 17 పెద్ద హోటళ్లు, 8 చిన్న హోటళ్లు, 150 ఫాస్ట్‌ఫుడ్ సెంటర్లు, 30 చిరు దుకాణాలు ఉన్నాయి. వీటిలో ఎవరైనా నిర్ణయించిన ధరకు కాకుండా ఎక్కువ ధరకు విక్రయిస్తే టోల్‌ఫ్రీ నంబరు 18004254141కి ఫోన్ చేయాలని ఏపీ ఎండోమెంట్స్ విభాగం తెలిపింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles