Seven Naxals killed in Chhattisgarh encounter భద్రతాబలగాల ఎన్ కౌంటర్లో ఏడుగురు మావోల మృతి

7 naxals killed in encounter in chhattisgarh s rajnandgaon

arms and ammunition, attack on security forces, Bastar, Chhattisgarh, CRPFs 227th battalion, CRPFs 74th battalion, encounter, Encounter between security forces and Naxals, Rajnandgaon, Sukma, Chhattisgarh encounter, Maoist, Chhattisgarh, Chhattisgarh police, Security forces

Seven alleged Maoists were killed in an encounter with security forces in Rajnandgaon district, Police also recovered one AK-47, two .303 rifles and other arms/ammunition from the spot.

భద్రతాబలగాల ఎన్ కౌంటర్లో ఏడుగురు మావోల మృతి

Posted: 08/03/2019 12:45 PM IST
7 naxals killed in encounter in chhattisgarh s rajnandgaon

మావోయిస్టులకు మరో కొలుకోలేని దెబ్బ తగిలింది. ఇలీవలే భద్రదా-కొత్తగూడెం జిల్లాలో న్యూడెమొక్రసీ దళానికి చెందిన మావోయిస్టు నేత లింగన్నను తెలంగాణ పోలీసులతో జరిగిన ఎన్ కౌంటర్లో మరణించగా, తాజాగా ఇవాళ ఉదయం ఛత్తీస్ గఢ్ లోని రాజ్ నంద్ గావ్ జిల్లాలో భద్రతాబలగాలకు, మావోయిస్టులకు మధ్య భీకర ఎన్ కౌంటర్ చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఏడుగురు మావోయిస్టులను భద్రతాబలగాలు హతమార్చాయి.

పచ్చటి అడవి మరోసారి నెత్తురోడింది. ప్రశాంతంగా ఉండే కొండల్లో తుపాకులు గర్జించాయి. జిల్లాలోని సీతాగోటా అటవీప్రాంతంలో మావోయిస్టులు నక్కినట్లు బలగాలకు నిఘావర్గాలు సమాచారం అందించాయి. వెంటనే అప్రమత్తమైన డీఆర్జీ ప్రత్యేకదళం కూంబింగ్ ప్రారంభించింది. అడవిలోకి కొద్దిదూరం వెళ్లగానే బలగాల రాకను పసిగట్టిన మావోలు బుల్లెట్ల వర్షం కురిపించారు.

దీంతో వెంటనే అప్రమత్తమైన భద్రతాబలగాలు ఎదురుకాల్పులు ప్రారంభించాయి. బలగాలు వెంటనే ప్రతిస్పందించడంతో ఏడుగురు మావోయిస్టులు అక్కడికక్కడే చనిపోయారు. మిగతావారు కాల్పులు జరుపుతూ ఘటనాస్థలి నుంచి పరారయ్యారు. ఈ సందర్భంగా ఎన్ కౌంటర్ జరిగిన చోటు నుంచి భారీ సంఖ్యలో తుపాకులు, బుల్లెట్లు, మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. మిగతా మావోయిస్టులను పట్టుకునేందుకు కూంబింగ్ ఆపరేషన్ కొనసాగుతోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Bastar  Chhattisgarh  security forces  Naxals  Rajnandgaon  Sukma  Chhattisgarh encounter  

Other Articles