Lavasa letter: CEC Sunil Arora denies rifts over MCC సీఈసీకి లేఖ రాసీన ఎన్నికల కమీషనర్ అశోక్ లావాసా..

Ashok lavasa opts out of election commission meets over clean chit

Ashok Lavasa, election commissioner CEC, Narendra Modi, amit shah, Sunil Arora, Rahul Gandhi, Chief election commissioner of India, India, national politics

Election Commissioner Ashok Lavasa has decided to stay away from the meetings related to the Model Code of Conduct (MCC) due to his dissent on the clean chit given to Prime Minister Narendra Modi and BJP President Amit Shah, sources said.

ఎన్నికల కమీషనర్ అశోక్ లావాసా అరోపణలపై కలకలం..

Posted: 05/18/2019 07:49 PM IST
Ashok lavasa opts out of election commission meets over clean chit

ఎన్నికల సంఘం పనితీరు చట్టబద్ధంగా ఉండాలంటూ ఎన్నికల కమిషనర్ అశోక్ లావాసా తన శాఖ అధికారులకే రాసిన లేఖ కలకలం రేపుతోంది. నేతలకు క్లీన్ చిట్ ఇచ్చే సమయంలో తన వాదనను రికార్డు చేయలేదంటూ సీఈసీ అరోరాకు లావాసా లేఖ రాశారు. మైనారిటీ అభిప్రాయాలను కూడా రికార్డు చేయాలని లేఖలో లావాసా పేర్కొన్నారు. అయితే మెజారిటీ అభిప్రాయాలను మాత్రమే రికార్డు చేస్తామని ఎన్నికల సంఘం అంటోంది. దీంతో ఎన్నికల సంఘం పనితీరుపై ఎన్నికల కమిషనర్ లావాసా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. లావాసా లేఖతో ఎన్నికల సంఘం ఇరుకున పడినట్లు తెలుస్తోంది.

ఇప్పటికే సీబీఐ, సుప్రీంకోర్టు లాంటి స్వతంత్ర ప్రతిపత్తి ఉన్న సంస్థల్లో అంతర్గత కలహాలు తలెత్తగా ఇప్పుడు ఎన్నికల సంఘంలో కూడా అలాంటి పరిణామాలు కనిపిస్తున్నాయి. కేంద్ర ఎన్నికల సంఘం సభ్యుల మధ్య నెలకొన్న భేదాభిప్రాయాలపై ప్రధాన కమిషనర్‌ సునీల్‌ అరోడా స్పందించారు.లవాసా వ్యాఖ్యాలను ఆయన ఖండించారు.దీనిపై ఆయన శనివారం మీడియాతో మాట్లాడారు.‘ ఎన్నికల సంఘంలోని ముగ్గురు సభ్యులు ఒకేలా ఉండరు.  ఇలా జరగడం ఇదే తొలిసారి కాదు. ఒకరి అభిప్రాయాలు మరొకరితో కలవకపోవడం వంటి సందర్భాలు ఇంతకు ముందు చాలాసార్లు జరిగాయి. అదే ఇప్పుడు కూడా జరిగింది’ అని అన్నారు.

ఎన్నికల ప్రవర్తన నియమావళి ఉల్లంఘించారని ప్రధాని మోదీ..అమిత్‌ షాలపై కాంగ్రెస్‌ ఆరోపణలపై ఈసీ క్లీన్‌ చిట్‌ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ విషయంలో అశోక్‌ అసంతృప్తితో ఉన్నారు. ఎన్నికల కోడ్‌ ఉల్లంఘించిన వారిపై ఈసీ చర్యలు తీసుకోవడం లేదని ఆయన కొద్ది రోజులుగా సమావేశాలకు దూరంగా ఉన్నారు. తన అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోవడం లేదనేది లవాసా ఆరోపణ.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles