Lookout notice against Ravi Prakash, Shivaji రవిప్రకాష్.. శివాజీలపై సైబరాబాద్ పోలీసులు లుకౌట్ నోటీసులు

Lookout notices issued to tv9 s ravi prakash actor shivaji

lookout notices to ravi prakash sivaji, tv9 ceo, actor sivaji, Ravi Prakash, Shivaji, MKVN Murthy, Hari, MSN Murthy, vijayawada Advocate, data theft, fake shares purchase, national company law tribunal, Forgery Case, Cyberabad Cybercrime Police, Investigation, Evidences, Hyderabad, KCR, Telangana CM, Telangana, politics

The Cyberabad police have issued a lookout notice against former TV9 Chief Executive Officer V. Ravi Prakash and actor S. Shivaji in connection with a forgery case that was booked against them a few days ago.

రవిప్రకాష్.. శివాజీలపై సైబరాబాద్ పోలీసులు లుకౌట్ నోటీసులు

Posted: 05/18/2019 01:22 PM IST
Lookout notices issued to tv9 s ravi prakash actor shivaji

సైబరాబాద్ పోలీసులు పెట్టిన పోర్జరీ, డాటా చోరి కేసులకు తోడు కంపెనీకి చెందిన లోగో, కాఫీ రైట్స్. ట్రేడ్ మార్కులను కూడా కారుచౌకగా మోజో టీవీకి కట్టబెట్టారన్న పిర్యాదు నేపథ్యంలో టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాశ్‌ పై మరో కేసు కూడా నమోదైన విషయం తెలిసిందే. తమ ఎదుట విచారణకు హాజరుకావాలని పోలీసులు పలుమార్లు నోటీసులు జారీ చేసినా.. పట్టించుకోకుండా తప్పించుకుని తిరుగుతున్న ఆయనపై పోలీసులు కూడా కన్నెర్ర చేస్తున్నారు.

ఆయనతో పాటు టీవీ9 నూతన యాజమాన్యంపై కుట్రపూరితంగా తప్పుడు కేసులు బనాయించారన్న అరోపణలను ఎదుర్కోంటున్న నటుడు శివాజీ తీరుపై కూడా పోలీసులు మండిపడుతున్నారు. ఈ క్రమంలో ఇటీవలే తమకు కొంత సమయం కావాలని వీరిద్దరూ వేర్వేరుగా పోలీసులకు ఈ మెయిళ్లు పంపించాడంతో వాటి ఐపీ అడ్రెస్ లు కనుగోన్న పోలీసులు వారు విజయవాడలోనే వున్నారని కూడా తెలుసుకన్నారు. అయితే వీరు సమయం కోరడంతో నేషనల్ కంపెనీ లా ట్రిబ్యూనల్ లో కేసు కోసం కాలయాపన చేస్తున్నారని భావించిన పోలీసులు.. ఈ కేసు వాయిదా పడిన నేపథ్యంలోనూ వీరు తమ ఎదుట హాజరుకాకపోవడంతో.. వీరు విజయవాడలోనే వున్నారా..? లేక విదేశాలకు పారిపోయారా.? అన్న కోణంలో అలోచిస్తున్నారు.

దీంతో రవిప్రకాష్ సహా నటుడు శివాజీపై సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు లుక్ అవుట్ నోటీసులు జారీ చేశారు. విచారణకు హాజరు కాకుండా తప్పించుకుని తిరుగుతున్న వీరిద్దరిపై లుక్ ఔట్ నోటీసులు జారీ అయ్యాయి. తమ అదేశాలను పట్టించుకొకపోవడంతో సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు క్రితం రోజు రాత్రి లుకౌట్ నోటీసులు జారీ చేశారు. ఇప్పటికే రెండు సార్లు పోలీసులు విచారణకు హాజరుకావాలని నోటీసులు జారీ చేశారు. అయినా కూడా హాజరుకాలేదు రవిప్రకాష్. ఈ క్రమంలోనే విదేశాలకు పారిపోకుండా లుక్ ఔట్ నోటీస్ జారీ చేశారు పోలీసులు.

రవిప్రకాష్, శివాజీ దేశం విడిచిపారిపోయే ఛాన్స్ ఉందని అనుమానిస్తున్నారు. దీంతో దేశంలోని అన్ని ఎయిర్ పోర్టులను అలర్ట్ చేశారు. ఆయా విమానాశ్రయాల్లో తనిఖీలు చేపడుతున్నారు. వీరు ఎయిర్ పోర్టుల్లోకి ప్రవేశిస్తే వెంటనే అరెస్టు చేయాలని కూడా ఆదేశించారు పోలీసులు.తో కలసి ఏబిసీఎల్ సంస్థ నూతన యాజమాన్యాన్ని ఇబ్బంది పెట్టేందుకు చేసిన ఇరువురు చేసుకున్న లోగుట్టును తెలంగాణ సైబర్ క్రైమ్ పోలీసులు సేకరించి.. వెలుగులోకి తీసుకువచ్చిన నేపథ్యంలో ఆయనపై మరో కేసు కూడా నమోదు కావడం చర్చనీయాంశంగా మారింది. టీవీ9 సీఈవోగా ఆయన అధికార దుర్వినియోగానికి పాల్పడినట్టు సమాచారం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Ravi Prakash  Sivaji  Lookout Notice  Cyberabad Cybercrime Police  Investigation  Telangana  politics  

Other Articles