SPY Reddy health condition serious says doctors జనసేన ఎంపీ అభ్యర్థి ఎస్పీవై రెడ్డి పరిస్థితి విషమం..

Janasena nandyal mp candidate spy reddy health condition critical

pawan kalyan, janasena, Pawan Kalyan SPY Reddy, Pawan Kalyan SPY Reddy nandyal, SPY Reddy JanaSena, SPY Reddy nandyal, SPY Reddy, nandyal parliamentary constituency, andhra pradesh, politics

Janasena party noted politician and industralist SPY Reddy, the Nandyal lok sabha candidate from Janasena party, health condition detoriated and is presently critical says his family members.

జనసేన నంద్యాల ఎంపీ అభ్యర్థి ఎస్పీవై రెడ్డి ఆరోగ్య పరిస్థితి విషమం

Posted: 04/08/2019 11:35 AM IST
Janasena nandyal mp candidate spy reddy health condition critical

తీవ్ర అస్వస్థతకు గురై హైదరాబాదులోని ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పోందుతున్న నంద్యాల జనసేన అభ్యర్థి, సిటింగ్‌ ఎంపీ ఎస్పీవై రెడ్డి అరోగ్యం పరిస్థితి మరింత విషమించింది. ఈ నెల 4వ తేదీన ఉన్న తన పార్లమెంటు నియోజకవర్గంలో ముమ్మరంగా ప్రచారం చేస్తున్న ఆయన అకస్మాత్తుగా అస్వస్థతకు గురికాగా ఆయనను కుటుంబసభ్యులు  హుటాహుటిన హైదరాబాద్‌ తరలించి చికిత్సనందిస్తున్నారు.

కాగా ఆయన పరిస్థితి మరింత విషమించిందని వైద్యులు వెల్లడించారు. ఐదు రోజులుగా చికిత్స జరుగుతున్నా ఆయన కోలుకోలేదు. ప్రస్తుతం ఎస్పీవై రెడ్డికి బంజారాహిల్స్ లో ఉన్న కేర్ ఆసుపత్రి ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితిపై జనసేన వర్గాల్లో ఆందోళన నెలకొంది. 2014 లోక్ సభ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ తరఫున ఎంపీగా గెలిచారు.

అయితే ఆ వెనువెంటనే ఎస్పీవై రెడ్డి, ఎంపీగా ప్రమాణ స్వీకారం చేయకముందే టీడీపీలోకి చేరి ఆదే పార్టీలో గత ఐదేళ్లుగా కోనసాగారు. అయితే ఆయనకు టీడీపీ టిక్కెట్ కేటాయించకపోవడంతో.. ఆయన జనసేన పార్టీలో చేరి.. ఆ పార్టీ తరఫున బరిలోకి దిగారు. చిన్న కుమార్తెను, పెద్ద అల్లుడిని బనగానపల్లి, నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి జనసేన పోటీలో నిలిపింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : pawan kalyan  janasena  SPY Reddy  nandyal lok sabha  andhra pradesh  politics  

Other Articles