nara lokesh trolled by netigens for his telugu మంగళగిరి స్పీచ్ లో నారా బాబు మళ్లి ‘పరవశించారు’..!

Tdp young leader nara lokesh trolled by netigens for his telugu

nara lokesh slips again, nara lokesh tounge slip, nara lokesh mangalairi, nara lokesh mangalagiri campaign, nara lokesh mangalgiri election speech, nara lokesh, campaign, speech, TDP, 1980, mangalagiri, assembly constituency, Andhra pradesh, politics

TDP young leader and AP Minister Nara Lokesh who rose immediatly into the battle field after party announces him as contestant from mangalagiri constituency. the young leader once again trolled by netgens as he slips again his tongue.

మంగళగిరి స్పీచ్ లో నారా బాబు మళ్లి ‘పరవశించారు’..!

Posted: 03/18/2019 06:48 PM IST
Tdp young leader nara lokesh trolled by netigens for his telugu

తప్పులెన్నువారు తమ తప్పులెరుగరు అన్న సూక్తిని మర్చిపోయిన నేటి తరం నెటీ జనులు.. ఇతరులు. ప్రముఖుల తప్పులను మాత్రమే ఎలుగెత్తి చాటుతుంటారు. అయితే తాము కూడా పలు సందర్భాలలో తప్పులు చేస్తామని గ్రహించకుండా.. ఎదుటివారి తప్పులను బట్టి సామాజిక మాధ్యమాల్లో వారిని టార్గెట్ చేసి ట్రాల్ చేయడం నేటి యువతకు అలవాటుగా మారింది. అయితే ఎవరో ఒకరు పొరపాటునో గ్రహపాటునో పరాధ్యానంగానో తప్పులు చేస్తే వారిని టార్గెట్ చేయడం సముచితం కాదన్న విషయాన్ని కూడా తెలుసుకోవాలి.

అయితే పోరబాటు పదే పదే చేస్తున్న వారి విషయంలో కూడా ఈ విమర్శల పర్వం మరీ ఎక్కువగా వుంటుంది. ఇక రాజకీయ నేతలైతే వారిని అన్ని పక్షాల వారూ నెట్టింట్లో  ఉతికి అరేస్తుంటారు. ఇప్పడు తాజాగా ఆంద్రప్రదేశ్ యువనాయకుడు, మంత్రి నారా లోకేష్ విషయంలోనూ అదే జరుగుతోంది. మంగళగిరిలో స్థానికంగా ప్రాబల్యం ఉన్న సామాజిక వర్గాన్ని పట్టించుకోకుండా తనకు సీటివ్వడంతో అక్కడ టీడీపీలో అసంతృప్తిని చల్లార్చడానికి వెళ్లిన చినబాబు తాను నోరు తెరిస్తే ఏం జరుగుతుందో జనానికి మరోసారి రుచి చూపించారు.

ఆయన మాట్లాడే తెలుగుపై ఇప్పటికే సోషల్ మీడియాలో సెటైర్లు చక్కర్లు కొడుతుండగా, తాజాగా మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య గురించి మాట్లాడుతూ తడబడ్డారు. మంగళగిరిలో ప్రచారం చేస్తున్న లోకేశ్‌ రోడ్‌ షోలో మాట్లాడుతూ వైసీపీపై విమర్శల వర్షం కురిపించారు. ఈ సందర్భంగా వివేకా మరణంపై మాట్లాడుతూ.. ‘‘పాపం వివేకానందరెడ్డి గారు చనిపోయారు.. పరవశించాం. ఎవరు చేశారో తెలియదు గానీ చంద్రబాబు నాయుడు మీద ఆరోపణలు చేస్తున్నారు. హత్య రాజకీయాలు చంద్రబాబు నాయుడుకు తెలుసా తల్లి..’ అంటూ ప్రసంగం కొనసాగించారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా చక్కర్లు కొడుతోంది.

అక్కడితో ఆగని లోకేష్,, మంగళగిరిలో 1980 నుంచి టీడీపీ గెలవలేదని, తాను గెలుస్తానో లేదో ప్రజలే నిర్ణయిస్తారని అన్నారు. ఇక్కడే అసలు ట్విస్టుంది. అసలు తెలుగుదేశం పార్టీ పుట్టిందే 1982వ సంవత్సరంలో అయినపుడు అంతకు రెండేళ్లు ముందుగానే ఆ పార్టీ ఎన్నికల్లో పోటీ చేయడం ఎలా సాధ్యం? అంటూ సోషల్ మీడియాలో నారా లోకేష్ పై నెట్ జనులు విమర్శలు చేస్తున్నారు. 1982లో పుట్టిన పార్టీ 1980లోనే ఎలా గెలుస్తుందో మేధావి చినబాబే సెలవియ్యాలంటూ లోకేశ్ ను తెగ ట్రోలింగ్ చేస్తున్నారు. అయితే టీడీపీ వర్గాలు మాత్రం లోకేష్ ను వెనకేస్తున్నాయి.

ఆయన 1980 దశకం నుంచి మంగళగిరిలో తెలుగుదేశం పార్టీ గెలవలేదని అన్నారని, అయితే దాన్ని కూడా రాద్దాంతం చేసి.. బురదజల్లేందుకు విపక్షపార్టీలు చేస్తున్న కుట్రలో భాగమే నెట్టింట్లో ట్రాలింగ్ అని అంటున్నారు. పదే పదే ఇలాంటి చౌకబారు విమర్శలు చేసినంత మాత్రాన తమకు వచ్చే నష్టమేమీ లేదని, ఇలాంటి ట్రాలింగ్ లతో తమ నేత నైతికస్థైర్యాన్ని దెబ్బతీయలేరని కూడా చెబుతున్నాయి. తమ నేత ప్రచారంలో ప్రజల నుంచి వచ్చిన ఆదరణను చూసే చౌవకబారు విమర్శలకు దిగుతున్నారని పేర్కోన్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : nara lokesh  campaign  speech  TDP  1980  mangalagiri  assembly constituency  Andhra pradesh  politics  

Other Articles