Man arrested for divulging info on Indian Army to ISI భారత అర్మీ రహస్యాలను సేకరిస్తున్న పాక్ గూఢచారి అరెస్టు

Pak spy assigned to collect information on indian army arrested

pakistan spy, isi spy, Nawab Khan, Jaisalmer, Inter-Services Intelligence, Indian Army, India-Pakistan border, Barmer district, rajasthan

A 36-year-old man from Jaisalmer was arrested by Rajasthan police’s intelligence unit, for allegedly sharing confidential information about the Indian Army’s activities with Inter-Services intelligence (ISI).

భారత అర్మీ రహస్యాలను సేకరిస్తున్న పాక్ గూఢచారి అరెస్టు

Posted: 03/13/2019 11:18 AM IST
Pak spy assigned to collect information on indian army arrested

జమ్మూకాశ్మీర్ లోని పూల్వామాలో విధులకు హాజరయ్యేందుకు తమ క్యాంపులకు చేరుకుంటున్న ఆర్మీ జవాన్లపై మానవబాంబు దాడికి పాల్పడిన నేపథ్యంలో భారత ఇంటెలిజెన్స్ వైఫల్యం కారణంగానే 48 మంది జవాన్లు అసువులు బాసారని విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంతో పాకిస్థాన్ అక్రమిత కాశ్మీర్ లోని ఉగ్రవాద శిభిరాలపై దాడులు చేసిన తరువాత పాకిస్థాన్ ఏటు నుంచైనా భారతపై ప్రతీకారం తీర్చకునేందుకు సిద్దం అవుతుందని అనుక్షణం అప్రమత్తంగా వున్నారు భారతీయులు.

మరీ ముఖ్యంగా భారత్-పాకిస్తాన్ సరిహద్దు ప్రాంతాల్లో అనుమానాస్పదంగా ఎవరు తచ్చాడుతున్నా.. వారిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. ఈ క్రమంలో జీపు డ్రైవర్ గా పనిచేస్తూ సరిహద్దులో తిరుగుతున్నప్పుడు సేకరించిన భారత్‌ ఆర్మీ రహస్యాలను పాకిస్థాన్ కు చేరవేస్తున్న గూఢచారిని నిఘా విభాగం అధికారులు పట్టుకున్నారు. నిందితుడిని రాజస్థాన్‌ రాష్ట్రం జైసల్మేర్ కు చెందిన నవాబ్ ఖాన్ గా గుర్తించారు. రాజస్థాన్ లోని ఇండియా-పాకిస్థాన్‌ సరిహద్దులో తిరుగుతూ ఇతను గూఢచర్యానికి పాల్ప డుతున్నాడని అనుమానం వచ్చిన ఆర్మీ అధికారులు నిఘా పెట్టారు.

తమ అనుమానం నిజం కావడంతో వెంటనే అతడిని అరెస్టు చేసినట్లు అడిషనల్‌ డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ ఇంటెలిజెన్స్‌ ఉమేష్‌ మిశ్రా తెలిపారు. ‘ఇతను ఇండియన్‌ ఆర్మీ రహస్యాలను సేకరించి వాటిని ఓ కోడ్‌ భాషలో వాట్సాప్‌ ద్వారా పాకిస్థాన్‌ ఆర్మీకి చేరవేస్తున్నాడు. ఖాన్‌ గత ఏడాది పాకిస్థాన్‌ సందర్శించాడు. అప్పటి నుంచి అక్కడి ఐఎస్‌ఐతో టచ్ లో ఉన్నాడు. ఐఎస్‌ఐ ఖాన్ కు గూఢచర్యంలో శిక్షణ అందజేసి రహస్యాలు ఎలా పంపాలో నేర్పింది' అని మిశ్రా తెలిపారు. దీంతో అతన్ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నామని పోలీసులు తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles