Sujana Shell companies raided by GST officials సుజనా చౌదరి డొల్ల కంపెనీలపై జీఎస్టీ అధికారుల దాడులు

Shell companies linked to sujana chowdary raided by gst officials

GST, sujana chowdary, shell companies, Starship Enterprise, industries, enforcement directorate, corporation bank, CBI, ED

Firms linked to or founded by former Union minister and TDP MP YS Chowdary have come under the scanner of GST officials after CBI and Enforcement Directorate (ED) who are now digging into documents.

సుజనా చౌదరి డొల్ల కంపెనీలపై జీఎస్టీ అధికారుల దాడులు

Posted: 03/12/2019 10:18 PM IST
Shell companies linked to sujana chowdary raided by gst officials

రాజ్యసభ సభ్యుడు, కేంద్ర మాజీ మంత్రి సుజనా చౌదరి చుట్టూ మరోమారు ఉచ్చు బిగిస్తొంది, ఆయనకు చెందిన పలు కంపెనీలపై మరోమారు కేంద్ర జీఎస్టీ అధికారులు కొరడా ఝలిపించారు. హైదరాబాదులో ఆయనకు చెందిన పలు డొల్ల కంపెనీలపై అధికారులు దాడులు నిర్వహించారు. ఈ సంస్థల్లో ఆయన పలు హోదాల్లో వ్యవహరిస్తున్నట్లు పక్కా సమాచారాన్ని కనుగోన్న జీఎస్టీ అధికారులు సుమారుగా 8 నుంచి 9 షెల్ కంపెనీలు భారీ మోసానికి పాల్పడినట్లు అధికారులు గుర్తించారు.

దీంతో ఇవాళ ఉదయం నుంచి జీఎస్టీ అధికారుల బృందం పెద్ద ఎత్తున సోదాలు చేపట్టింది. ఈ తనిఖీల్లో అధికారులు నివ్వెరపోయే నిజాలు బయటపడినట్లు తెలుస్తోంది. ప్రాథమికంగా ఈ కంపెనీల ద్వారా 1300 కోట్ల రూపాయల మేర నకిలీ లావాదేవీలు జరిపినట్లు గుర్తించారు. దీనిపై 250 కోట్ల రూపాయల మేర జీఎస్టీని ఎగవేసినట్లు గుర్తించారు. ఏదీ కొనకుండా.. దేన్నీ అమ్మకుండా.. ఫేక్ ఇన్వాయిస్‌లు సృష్టించి.. నకిలీ టర్నోవర్‌ను నమోదు చేసినట్లు జీఎస్టీ అధికారుల తనిఖీల్లో బయటపడింది.

సుజనా షెల్ కంపెనీల మధ్యే ఈ అమ్మకం కొనుగోళ్లను.. కేవలం కాగితాలపైనే సృష్టించినట్లు అధికారులు గుర్తించారు. ఇప్పటికే తనిఖీల్లో పట్టుబడ్డవి కాకుండా.. మరో 10 షెల్ కంపెనీలు కూడా సుజనా నేతృత్వంలో నడుస్తున్నట్లు అధికారులు పసిగట్టారు. వీటి లావాదేవీలపై కూపీ లాగుతున్నారు. ఈ కేసుకు సంబంధించి ఒకటి రెండు రోజుల్లో కీలక పరిణామాలు చోటు చేసుకోవచ్చని అధికారుల ద్వారా తెలుస్తోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles