Trujet rebrands, announces 'great take off sale' ట్రూజెట్ ఎయిర్ బంపర్ ఆఫర్.. రూ 799కే విమానయానం

Trujet rebrands announces great take off sale

udan project, Turbo Megha Airways, trujet discount offers, Trujet Airways, sky for all, great take off sale, flight tickets special offers, flight tickets discount offers, flight tickets. Trujet, great take off sale, aviation news

Trujet, part of Turbo Megha Airways Private Limited, coinciding with its expansion plans under the UDAN scheme, has announced it has undertaken a rebranding exercise.

ట్రూజెట్ ఎయిర్ వేస్ నుంచి గ్రేట్ టేకాఫ్ సేల్ ఆఫర్.. రూ 799కే విమానయానం

Posted: 03/08/2019 02:46 PM IST
Trujet rebrands announces great take off sale

టర్బో మేఘా ఎయిర్ వేస్ కు చెందిన ట్రూ జెట్.. విమాన ప్రయాణికులకు బంఫర్ ఆఫర్ ప్రకటించింది. మరీ ముఖ్యంగా మధ్యతరగతి ప్రజలు తొలిసారి విమానయానం చేయాలన్న కలను సాకారం చేసేందుకు మెగా పవర్ స్టార్ రాంచరణ్ తేజ్ కు చెందిన ట్రూ జెట్ అదిరిపోయే ఆఫర్ ను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇందుకోసం నూతనంగా గ్రేట్ టేకాఫ్ సేల్ పేరుతో ప్రయాణికులకు బ్రహ్మండమైన రాయితీని ప్రకటించింది.

ఈ ఆఫర్ కింద టికెట్ ధరల రాయితీపై కేవలం రూ. 799లకే అందించనుంది. ఈ ఆఫర్ మాత్రం మార్చి 08వ తేదీ నుండి మార్చి 17వ తేదీ వరకు మాత్రమే ఉండనుంది. కాగా ఈ ఆఫర్ కింద టికెట్లను బుక్ చేసుకున్న ప్రయాణికులు మార్చి 8 నుంచి అక్టోబర్ 26 మధ్యకాలంలో ఎప్పుడైనా ప్రయాణించవచ్చు. గ్రేట్ టేకాఫ్ సేల్ ఆఫర్ కింద మొత్తంగా లక్ష సీట్లను అందుబాటులో వుంచినట్లు ట్రూజెట్ సీసీవో సుధీర్ రాఘవన్ తెలిపారు.

ఈ టికెట్లు ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వడ్ విధానంలో విక్రయాలు జరుపుతాయని చెప్పారు. కేంద్రం ప్రభుత్వం తీసుకొచ్చిన ఉడాన్ స్కీమ్‌ను మరింత ముందుకు తీసుకెళ్లేందుకు తాము ప్రయత్నం చేస్తున్నట్లు కంపెనీ ప్రతినిధులు పేర్కొన్నారు. కాగా ట్రూజెట్ విమానయాన సంస్థ హైదరాబాద్ కేంద్రంగా ప్రాంతీయ విమాన సర్వీసులు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles