govt liabilities rise to Rs 83.4 lakh crore బీజేపి ఐదేళ్ల హయాంలో 27.13 లక్షల కోట్ల రుణభారం..

Total government liabilities rise to rs 83 4 lakh crore in q3

Finance Ministry, government liabilities, government saving, government debt, government loan, government liability, G-Sec yields, finance ministry report, public debt, india news, Politics

Total liabilities of the government increased to Rs 83.40 lakh crore at the end of the December 2018 quarter from Rs 82.03 lakh crore in the previous quarter of the current fiscal, latest data on public debt showed Friday.

అప్పుల భారతం: బీజేపి పాలనలో రూ.27.13 లక్షల కోట్ల రుణభారం..

Posted: 03/08/2019 07:54 PM IST
Total government liabilities rise to rs 83 4 lakh crore in q3

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలో ఎన్డీయే ప్రభుత్వం తన హయాంలో సాధించిన విజయాల గురించి గొప్పగా చెప్పుకోవచ్చు, అందులో నోట్ల రద్దు నుంచి సర్జికల్ స్ట్రైక్ వరకు స్వచ్ఛా భారత్ నుంచి మేకిన్ ఇండియా వరకు ఎన్నో పథకాలు, కార్యక్రమాలు వుండవచ్చు. నోట్ల రద్దుతో కేంద్రప్రభుత్వానికి అదాయం బాగా పెరిగిందని చెప్పుకుంటున్న ప్రభుత్వం.. ఆదాయం వస్తున్నా.. దేశాన్ని మాత్రం అప్పుల భారతంగా మార్చేసింది. డిసెంబర్ తో ముగిసిన ఈ వార్షిక మూడో త్రైమాసానికి ప్రభుత్వం ఏకంగా రూ.83.40 లక్షల కోట్ల రుణభారంలో వుందని తాజా గణంకాలు స్పష్టం చేస్తున్నాయి.

దేశంలో విప్లవాత్మక మార్పలు పెద్దగా చోటుచేసుకోలేకపోయినా.. సర్ధర్ వల్లభబాయ్ పటేల్ విగ్రహావిష్కరణ.. శతాబ్ది ఎక్స్ ప్రెస్ రైలు స్థానంలో వందే భారత్ రైలు ప్రారంభం.. మరోవైపు గుజరాత్ లోని అహ్మదాబాద్ నుంచి ముంబై వరకు స్పీడ్ రైలు పనులు వేగంగా సాగుతున్నాయి. అయితే భారత్ దేశానికి మాత్రం ఈ నాలుగున్నరేళ్ల కాలంలో అప్పుల భారం అంతకంతకూ పెరిగింది.

నరేంద్రమోడీ సర్కార్ పరిపాలన దేశంపై ఒక పెను భారాన్ని తెచ్చి నెత్తిన పెట్టింది. ఈ కష్టం రాబోయే ప్రభుత్వాలకు పెద్ద గుదిబండగా మారనుంది. మోడీ ప్రభుత్వ నాలుగున్నరేళ్ల పరిపాలనలో ప్రభుత్వం తెచ్చిన మొత్తం అప్పులు 50శాతం పెరిగి రూ.82 లక్షల కోట్లకు చేరుకుంది. ఇటీవల ప్రభుత్వ రుణంపై జారీ చేసిన స్టేటస్ పేపర్ 8వ సంచిక ద్వారా ఈ విషయం వెల్లడైంది.

ప్రభుత్వ రుణాలపై ఆర్థిక మంత్రిత్వశాఖ జారీ చేసిన డేటాలో సెప్టెంబర్ 2018 నాటి గణాంకాలతో పోల్చి చెప్పింది. దీని ప్రకారం సెప్టెంబర్ 2018 వరకు కేంద్ర ప్రభుత్వంపై మొత్తం రూ.83.40 లక్షల కోట్ల రుణభారం ఉంది. జూన్ 2014 వరకు ప్రభుత్వంపై మొత్తం రూ.54.90 లక్షల కోట్ల అప్పులు ఉన్నాయి. ఈ విధంగా మోడీ సర్కార్ హయాంలో భారతదేశంపై ఇప్పుడు మొత్తం అప్పులు దాదాపుగా రూ.28 లక్షల కోట్లు పెరిగిపోయాయి. ఈ కాలంలో పబ్లిక్ డెట్ లో ప్రభుత్వ రుణం 51.7% పెరిగి రూ.48 లక్షల కోట్ల నుంచి రూ.73 లక్షల కోట్లు అయింది. మధ్యంతర రుణం 54% పెరుగుదలతో రూ.68 లక్షల కోట్లు కావడమే దీనికి ప్రధాన కారణంగా చెబుతున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : government liability  G-Sec yields  finance ministry report  public debt  Politics  

Other Articles