Baraat headed to Pakistan halts on way, marriage stalled భారత్-పాక్ మధ్య ఉద్రిక్తలతో ఆగిన వివాహం..

Baraat headed to pakistan halts on way marriage stalled

wedding postponed due to pulwama attack, pulwama Attack, Pulwama, Pakistan, Jaisalmer, iaf strike, Mahendra Singh Rathore, Khejad ka paar, Barmer district, Thar Express, politics

A recent case stands testimony to this predicament, wherein a marriage scheduled to be held in Pakistan had to be postponed in the wake of strained relations between the two nations in the aftermath of Pulwama attack and the IAF strike that followed.

భారత్-పాక్ మధ్య ఉద్రిక్తలతో ఆగిన వివాహం..

Posted: 03/04/2019 05:21 PM IST
Baraat headed to pakistan halts on way marriage stalled

సీమాంతర వివాహాలు సర్వసాధరణంగా మారిన ఈ రోజుల్లో ఎవరు చూసినా.. ఈ వివాహాలను బాగా అదరిస్తున్నారు. హిందూ సంప్రదాయం ప్రకారం జరిగే సీమాంతర వివాహాలు.. ఇక్కడి వివాహబంధంలో వున్న పవిత్రత, బంధుమిత్రుల ఆశీర్వచనాలకు ఎందరో పరాయిదేశస్థులు ముగ్ధులై ఇక్కడి వరులను, వధువులను చేసుకునేందుకు తమ ఉత్సాహాన్ని కనబరుస్తున్నారు. ఈ కోవలో ఉత్తర భారతంలోని కొన్ని ప్రాంతాల వారు పాకిస్తాన్ లోని హిందూవులతో కూడా బంధం కలుపుకుంటున్నారు.

ఇక ఈ మధ్యకాలంలో దాయాధి దేశాల మధ్య ఎలాంటి వాతావరణం అలుముకున్నా.. తమకు నచ్చితే అక్కడి నుంచి సంబంధాలను తెచ్చుకోవడంలో మాత్రం వెనుకంజ వేయడం లేదు. దీంతో ఈ మధ్యకాలంలో భారత్, పాకిస్తాన్ సరిహద్దుల్లో సీమాంతర వివాహాలు సర్వసాధారణమయ్యాయి. రాజ్ పుత్‌, మెగవాల్‌, బీల్‌, సింధి, కాత్రి కమ్యూనిటీలు ఈ తరహా పెళ్లిలు చేసుకుంటాయి. అయితే ఇరు దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్తత పరిస్థితుల కారణంగా ఓ జంట వివాహం ఆగిపోయింది.

రాజస్థాన్‌లోని బర్మార్‌ జిల్లాకు చెందిన మహేంద్ర సింగ్‌కు, పాకిస్తాన్‌ సింధ్‌ ప్రావిన్స్‌లోని అమర్‌ కోట్‌ జిల్లాకు చెందిన చగన్‌ కర్వార్‌కు మార్చి 8న వివాహం జరగాల్సివుంది. పుల్వామాలో జరిగిన ఉగ్రదాడిలో 40 మంది భారత సీఆర్పీఎఫ్‌ జవాన్లు మృతి చెందడంతో ఇరుదేశాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. దీంతో ఇరు కుటుంబాల సభ్యులు పెళ్లిని వాయిదా వేసుకున్నారు. పరిస్థితులు చక్కబడిన తర్వాతే వివాహం జరిపిస్తామని తెలిపారు.

ఈ మేరకు వరుడు మహేంద్ర మీడియాతో మాట్లాడుతూ గత నెలలోనే తమ పెళ్లి నిశ్చయించారని, పెళ్లికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు చేసుకున్నామని తెలిపారు. వివాహ ఆహ్వాన పత్రికలు కూడా పంచామని పేర్కొన్నారు. పాకిస్తాన్‌ నుంచి వీసాలు కూడా తీసుకున్నామని... అక్కడికి వెళ్లేందుకు థార్‌ ఎక్స్‌ప్రెస్‌ టికెట్లు బుక్‌ చేశామని తెలిపారు. కానీ ఇప్పుడు తమ పెళ్లిని వాయిదా వేయాలనే నిర్ణయానికి వచ్చామని.. ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు తగ్గిన తర్వాతే పెళ్లి చేసుకుంటామని వెల్లడించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : pulwama Attack  Pulwama  Pakistan  Mahendra Singh Rathore  wedding  Jaisalmer  iaf strike  politics  

Other Articles