IAF Doesn't Count Casualties, Says Air Chief Marshal BS Dhanoa ‘‘ఎందరు చనిపోయారో లెక్కించడం మా పనికాదు’’

Iaf doesn t count casualties says air chief marshal bs dhanoa

wing commander Abhinandan, MIG 21, IAF Chief BS Dhanoa, iaf air strikes,dogfight with pakistan, Abhinandan Varthaman, balakot air strike, balakot air strike casualties, balakot airstrike death toll, air chief marshal, iaf chief, bs dhanoa, dhanoa balakot air strike, iaf news

The Indian Air Force doesn’t take into account human casualties but only the number of targets hit, Air Chief Marshal BS Dhanoa said on Monday, referring to the Balakot air strike.

‘‘ఎందరు చనిపోయారో లెక్కించడం మా పనికాదు’’

Posted: 03/04/2019 06:39 PM IST
Iaf doesn t count casualties says air chief marshal bs dhanoa

భారత్ పైకి దండెత్తిన పాక్ యుద్ధ విమానాలను తరిమికొట్టిన మిగ్ 21 యుద్ధ విమానాలపై ఆరోపణలు వస్తున్న వేళ ఎయిర్ చీఫ్ మార్షల్ బీఎస్ ధనోవా కీలక వివరణ ఇచ్చారు. ఆపరేషన్‌లో అత్యంత పాతవైన మిగ్-21 విమానాలను వినియోగించారనే ఆరోపణలను ఆయన ఖండించారు. మిగ్-21 యుద్ధ విమానాలను ఎప్పటికప్పుడు అప్‌గ్రేడ్ చేస్తున్నట్లు తెలిపారు. సుఖోయ్, మిరాజ్ 2000 లాంటి అత్యాధునిక యుద్ధ విమానాలుండగా.. మిగ్-21 విమానాలను ఎందుకు వాడాల్సి వచ్చిందనే అంశంపైనా ఆయన వివరణ ఇచ్చారు.

పాక్‌కు చెందిన ఎఫ్-16 విమానాలను అడ్డుకోవడానికి మిగ్-21 బైసన్‌లు ఎదురుదాడికి దిగడాన్ని ఎయిర్ చీఫ్ మార్షల్ ధనోవా సమర్థించారు. అది ముందే ప్రణాళిక వేసుకొని చేసింది కాదని.. అత్యవసర సమయంలో ఏ యుద్ధ విమానం అందుబాటులో ఉంటే దాన్ని పంపుతామని వెల్లడించారు. ‘ముందే ప్లాన్ చేసుకున్న ఆపరేషన్ అయితే ఎంపిక చేసిన యుద్ధ విమానాలను పంపిస్తాం. బాలాకోట్‌లో జరిగిన దాడి ఇలాంటిదే. అదే అప్పటికప్పుడు జరిగే దాడిని తిప్పికొట్టడానికి అందుబాటులో ఉన్న ఏ ఫైటర్ జెట్‌ అయినా బయలుదేరుతుంది.

అన్ని ఫైటర్ జెట్స్.. శత్రువులతో పోరాడే సామర్థ్యం ఉన్నవేనని ధనోవా స్పష్టం చేశారు. భారత వైమానిక దళం పాకిస్థాన్‌లోని బాలాకోట్ దాడి చేసి ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేసిన ఘటనకు ప్రతిగా.. దాయాది దేశం 24 యుద్ధ విమానాలతో ఇండియాపైకి వచ్చింది. ఈ విషయాన్ని రాడార్లు ముందే గుర్తించి సంకేతాలివ్వడంతో వాటిని అడ్డుకోవడానికి భారత వాయుసేన ప్రతిచర్య ప్రారంభించింది.

ఈ క్రమంలో వాయుసేనకు చెందిన రెండు మిగ్ 21 బైసన్ విమానాలు పాక్ యుద్ధ విమానాలను తరుముకుంటూ వెళ్లాయి. శత్రుదేశ విమానాలను వెంటాడుతూ వెళ్లిన ఓ మిగ్ 21 విమానం ఎల్‌వోసీలో కూలిపోయింది. అందులో ఉన్న పైలట్ అభినందన్ అప్పటికే ప్యారాచూట్ ద్వారా కిందకి దిగారు. ఆయణ్ని పాక్ ఆర్మీ తమ ఆధీనంలోకి తీసుకుంది. తీవ్ర ఉత్కంఠ పరిస్థితుల అనంతరం వింగ్ కమాండర్ అభినందన్‌‌ను పాక్ ఆర్మీ భారత్‌కు అప్పగించింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : balakot air strike  casualties  death toll  air chief marshal  iaf chief  bs dhanoa  iaf news  

Other Articles