patrolling police constables feared run leaving bike in goons attack ప్రాణభయంతో పోలీసుల పరుగు.. తిరగబడిన గుండాలు

Patrolling police constables feared run leaving bike in goons attack

Gujarat police, patrolling police, police constables, constables scared run, constables run for life leave bike, police constables, patrolling, cctv footage, surat, goons, Gujatat, Crime

Gujarat Police constables feared run leaving their police caught on cctv. goons in the surat city attack patrolling police constables, after questioned by by them. goons pelted stones on police.

ITEMVIDEOS: గుజారత్ లో గుండాయిజం పాలు ఎక్కువే.. ఇదిగో సాక్ష్యం

Posted: 02/28/2019 01:06 PM IST
Patrolling police constables feared run leaving bike in goons attack

2014 ఎన్నికలకు ముందు తన గుజరాత్ అభివృద్ది మోడల్ ను చూసి తనకు ఓట్లు వేయాలని చెప్పిన ప్రధాని.. అవినీతి రహిత సమాజ స్థాపనే తమ ధ్యేయమని చెప్పారు. అయితే అదే గుజరాత్ లో ఆయన ప్రధాని అయిన తరువాత కీలకమైన పటేల్ ఉద్యమం తీవ్రస్థాయిలో తెరపైకి వచ్చింది. ఈ క్రమంలో ముఖ్యమంత్రులు మార్పు కూడా జరిగింది. ఆ తరువాత జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో ప్రధాని తన సర్వశక్తులు ఒడ్డి ప్రచారం చేసినా.. కేవలం అత్యంత తక్కువ సంఖ్యలో చావు తప్పి కన్ను లోట్టబోయిన విధంగా అక్కడి బీజేపి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.

అయితే బీజేపి ఓటమి ఖాయమన్న వార్తల నేపథ్యంలో గుజరాత్ ఎన్నికలలో గెలుపు కోసం ప్రధాని నరేంద్రమోడీ తనపై హత్యకు మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ స్థాయిలో పాకిస్థాన్ ఉగ్రవాదులకు సుఫారీ ఇచ్చారని అందుకు తగిన సాక్షాలు కూడా వున్నాయని అరోపణలు చేపి ప్రజల సానుభూతి ఓట్లతో కొద్దిలో గట్టెక్కారు. అయితే గుజారత్ అభివృద్ది మోడల్ అదే రాష్ట్రంలో విఫలమైందన్న వార్తలు వినిపించాయి. ఇక కాంగ్రెస్ నేతలు తమదే నైతిక విజయమని కూడా చెప్పుకోచ్చారు. ఇలాంటి గుజారత్ మోడల్ రాష్ట్రంలో గుండాయిజం పాలు కూడా చాలా ఎక్కువే.

గుజరాత్ లోని సూరత్ పట్టణంలో ఓ ముఠా... పోలీసులపైనే దాడికి దిగింది. రాత్రివేళ పెట్రోలింగ్ చేస్తూ... బైక్ పై వచ్చిన పోలీసులు అక్కడున్న కుర్రాళ్లను ప్రశ్నించారు. అయితే పోలీసులను చూసిన కుర్రాళ్లు తొలుత ఓ మాదిరిగా సమాధానపర్చినా ఆ వెంటనే ఒక కుర్రాడు రివర్సయ్యారు. దీంతో పోలీసులు త్వరగా వెళ్లిపోమ్మని చెబుతూ వచ్చాశారు. అయితే పోలీసులు వారిని కుర్రాళ్లుగానే భావించారు. కానీ వారు కుర్రాళ్లు కాదు. నేరప్రవృత్తికి పాల్పడే గుండాలు.

ఇంకేముందు పోలీసులపైనే దాడికి దిగారు. ఏకంగా చేతుల్లో కత్తులు పట్టుకుని పోలీసులపైకి రివర్స్ కావడంతో వారు వెనక్కు తగ్గారు. ఈ క్రమంలో మరో ఇద్దరు గుండాలు కూడా పోలీసులపై దాడికి దిగేందుకు సిద్దమయ్యారు. చేసేది లేక ప్రాణభయంతో పోలీసులు బైక్ అక్కడే వదిలి పారిపోతున్న సీన్ సీస కెమెరాలో రికార్డ్ అయ్యింది. గుజరాత్ లో లాండ్ ఆర్డర్ ఏ స్థాయిలో దిగజారిపోయిందో చెప్పడానికి ఈ వీడియోనే నిదర్శనం అంటున్నారు నెటిజన్లు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : police constables  patrolling  cctv footage  surat  goons  Gujatat  Crime  

Other Articles