Ganta displeasure on South Coast Railway zone దక్షిణ కోస్తా రైల్వేజోన్ పై అదే అన్యాయం: గంటా

Nara lokesh slams narendra modi over visakhapatnam railway zone division

Nara Lokesh slams Narendra Modi over Visakhapatnam railway zone division, Nara, Lokesh slams Narendra Modi, Visakhapatnam railway zone, Ganta Srinivasa Rao, displeasure, Waltair division, narendra modi, odisha, railway zone, south coast railways, visakhapatnam, vizag, vizag railway zone, Visakhapatnam, Andhra Pradesh, Social media, Politics

centre’s decision to divide the present Waltair division into two parts has not gone down well with many people in Andhra Pradesh. State IT Minister Nara Lokesh took to Twitter to express his displeasure over the same.

తల్లిని చంపి బిడ్డకు జన్మనిచ్చారు.. రైల్వేజోన్ పై నారా లోకేష్

Posted: 02/28/2019 12:27 PM IST
Nara lokesh slams narendra modi over visakhapatnam railway zone division

కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం.. ప్రధాన మంత్రి నరేంద్రమోడీ మళ్లీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అన్యాయం చేశారని రాష్ట్ర అధికార పార్టీ నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కేంద్ర రైల్వే శాఖ మంత్రి పియూష్ గోయల్ నిన్న ప్రకటించిన విశాఖ రైల్వే జోన్ ప్రకటన తల్లిని చంపి బిడ్డకు జన్మనిచ్చినట్లుగా వుందని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ఘాటుగా విమర్శించారు. ఆంద్రప్రదేశ్ రాష్ట్ర విభజన నేపథ్యంలో తల్లి లాంటి అంధ్రప్రదేశ్ ను చంపిన యూపీఏ తెలంగాణ బిడ్డకు జన్మనిచ్చిందని గత ఎన్నికల ప్రచార కార్యక్రమంలో ప్రధాని చేసిన వ్యాఖ్యలనే ఆయన ఊటంకించారు.

ప్రధాని నరేంద్రమోడీ విశాఖ పర్యటన నేపథ్యంలో ఆఘమేఘాల మీద రైల్వే జోన్ ప్రకటనపై అస్థవ్యస్థ ప్రకటనను కేంద్రం ప్రకటించిందని ఆయన దుయ్యబట్టారు. అంతేకానీ రైల్వేశాఖ మంత్రి చెప్పినట్టు సుదీర్ఘ అధ్యయనం తరువాత తాము విశాఖ రైల్వేజోన్ పై నిర్ణయం తీసుకున్నామన్న అంశంలో వాస్తవాలు లేవన్నారు. తల్లి లాంటి వాల్తేర్ డివిజన్ ను కేటాయించకుండా.. విశాఖ రైల్వో జోన్ లో కలపకుండా విజయవాడ, గుంతకల్, గుంటూరు డివిజన్లతో రైల్వేజోన్ ఏర్పాటు చేయడం ఏంటని ఆయన ప్రశించారు.

దీని ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మరోమారు అన్యాయం జరిగిందని ఈ సారి బీజేపి నేతృత్వంలోని ఎన్డీయే వల్ల నష్టం వాటిల్లిందని ఆయన పేర్కోన్నారు. వాల్తేర్ డివిజన్ ఏడాదికి దాదాపుగా 6500 కోట్ల అధాయాన్ని సమకూర్చకుంటున్న క్రమంలో దానిని ఒడిషాకు కేటాయించి.. రూ.500 కోట్లు ఆదాయం కూడా రాబట్టని విజయవాడ, గుంటూరు, గుంతకల్లు డివిజన్లతో తమకు కొత్త జోన్ ఏర్పాటు చేయడం వల్ల లాభమేంటో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. కేంద్రం కుట్రపూరితంగానే తమ రాష్ట్రానికి అన్యాయం చేసిందని ఆయన మండిపడ్డారు.

కేంద్ర ప్రభుత్వం విశాఖపట్నంకు రైల్వేజోన్ ప్రకటించడంపై ఏపీ విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. 2014లో ఏపీ విభజన సందర్భంగా జరిగిన అన్యాయమే రైల్వే జోన్ ఏర్పాటులోనూ జరిగిందని విమర్శించారు. వాల్తేరు డివిజిన్ ను ఒడిశాకు కట్టబెట్టి ఏపీని మళ్లీ మోసం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇవాళ ట్విట్టర్ లో గంటా స్పందిస్తూ..’వైజాగ్ రైల్వేజోన్ ఏర్పాటులోనూ రాష్ట్ర విభ‌జ‌నలాంటి అన్యాయ‌మే. అప్పుడు ఆదాయం ఉన్న‌ హైద‌రాబాద్ ను తెలంగాణ‌కు ఇచ్చేశారు. ఇప్పుడు రూ.6,500 కోట్లు తెచ్చే వాల్తేరు డివిజ‌న్‌ను ఒడిశాకు క‌ట్ట‌బెట్టి మళ్ళీ మోసం చేశారు. ‘MODI cheated AP again’ అని ట్వీట్ చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Nara Lokesh  Ganta Srinivasa Rao  displeasure  Waltair division  Narendra Modi  AP  Politics  

Other Articles