chandrababu responds on Nagarjuna and YS Jagan meet నాగార్జున-జగన్ భేటీపై సీఎం చంద్రబాబు రియాక్షన్..

Chandrababu responds on tollywood hero akkineni nagarjuna and ys jagan meet

Nagarjuna Akkineni meets YS Jagan, Chandrababu on Nagarjuna Akkineni meeting YS Jagan, Nagarjuna Akkineni, ys jagan, ysrcp, Chandra babu, TDP, Cine Stars, AP Assembly Election 2019, Lok Sabha Election 2019, Andhra Pradesh, politics

Andhra pradesh Chief Minister and TDP party president chandrababu responds on Tollywood Hero Akkineni Nagarjuna and YS Jagan meet, says it is not good to meet people involved in crime and facing dissappropriate assets cases.

నాగార్జున-జగన్ భేటీపై సీఎం చంద్రబాబు రియాక్షన్..

Posted: 02/20/2019 10:13 AM IST
Chandrababu responds on tollywood hero akkineni nagarjuna and ys jagan meet

ప్రముఖ సినీ నటుడు అక్కినేని నాగార్జున .. వైఎస్ఆర్ పార్టీ అధినేత జగన్‌ మోహన్ రెడ్డితో సమావేశమయ్యారు. అయితే ఈ భేటీపై ఏపీ సీఎం చంద్రబాబు స్పందించారు. సినీ పరిశ్రమ వారు.. నేరస్థులతో కలవడం మంచిది కాదన్నారు. జగన్, నాగార్జున భేటీపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికే అనేకమంది ఎమ్మెల్యేలు... ఎంపీలు.. టీడీపీని వీడి వైసీపీ తీర్థం పుచ్చుకుంటున్నారు. ఈ నేపథ్యంలో జగన్ తో నాగార్జున భేటీ కావడం పట్ల ముఖ్యమంత్రి చంద్రబాబు తనదైన శైలిలో సీరియస్ అయ్యారు.

జగన్ అక్రమాస్థుల కేసులో నిందితుడని, అలాంటి నేరస్థులతో ... సినిపరిశ్రమకు చెందిన వారు అందులోనూ అగ్రహీరోగా పేరొందినవారు కలవడం అంత మంచిది కాదని హితవు పలికారు. సినీ హీరో నాగార్జున వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని కలవడం రాజకీయాల్లో సంచలనంగా మారింది. ఆయన రాజకీయాల్లోకి వస్తారని జోరుగా ప్రచారం జరిగింది. అదే సమయంలో తన కోసం కాకుండా తన మిత్రుడికి గుంటూరు టికెట్ గురించి చర్చించేందుకు జగన్ మోహన్ రెడ్డికి కలిశారని రాజకీయవర్గాల్లో చర్చ జరిగింది.

అయితే, వైసీపీ అధినేత వైఎస్ జగన్ జగన్ ఎందుకు కలిశారనే అంశంపై మీడియాకు ఆయన క్లారిటీ ఇచ్చారు. జగన్ మా కుటుంబ సన్నిహితుడు.. అందుకే ఆయనను మర్యాదపూర్వకంగానే కలిశానన్నారు నాగార్జున. పాదయాత్ర విజయవంతంగా పూర్తి చేసినందుకు ఆయనకు కృతజ్ఞతలు తెలిపానన్నారు. ఎవరికో టికెట్ విషయంలో నేను జగన్ ను సంప్రదించలేదన్నారు నాగర్జున. అయితే గత 20 ఏళ్లుగా అన్నపూర్ణ స్టూడియో వ్యవహారాలు చూస్తున్న వెంకటేశ్వరరావు అనే వ్యక్తి కోసం నాగార్జున జగన్ ను కలిసినట్టు ప్రచారం జరిగింది. నిజానిజాలు వెల్లడయ్యేందుకు ఎన్నికలు ఆసన్నమయ్యే సమయం వరకు వేచిచూడాల్సిందే.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Nagarjuna Akkineni  ys jagan  ysrcp  Chandra babu  TDP  YSRCP  AP Politics  

Other Articles