RRB NTPC recruitment 2019: 1.30 lakh vacancies నిరుద్యోగలకు శుభవార్త.. రైల్వేలో 1.30 లక్షల ఉద్యోగాల భర్తీ..!

Rrb ntpc recruitment 2019 1 30 lakh vacancy for level 1 posts paramedical

rrb ntpc, rrb, rrb ntpc recruitment 2019, rrb recruitment 2019, railway jobs, railway naukri, vacancies in railway, piyush goyal on railway jobs, jobs, sarkari jobs, sarkari naukri, railway vacancies, rrb level 1 posts, rrb paramedical staff, 1.3 lakh vacancies, rrb 1.3 lakh vacancies

Railway Recruitment Board (RRB) has announced 1.30 lakh vacancies. The advertisement can be found in employment news paper in the Feb 23- March 1 edition . The full notification will soon be released on its official websites.

నిరుద్యోగలకు శుభవార్త.. రైల్వేలో 1.30 లక్షల ఉద్యోగాల భర్తీ..!

Posted: 02/20/2019 11:03 AM IST
Rrb ntpc recruitment 2019 1 30 lakh vacancy for level 1 posts paramedical

ప్రభుత్వ ఉద్యోగం లేదా ఉద్యోగ భద్రత వున్న ఉద్యోగం కోసం ఎవరు మాత్రం ఎదురుచూడరు.? అలాంటి ఉద్యోగంతో ఇక కేంద్ర ప్రభుత్వం సంస్థ రైల్వేలో ఉందని తెలిస్తే ఎవరు మాత్రం దరఖాస్తు చేయకుండా వుంటారు. వందల పోస్టులకు లక్షల మంది పోటీ పడుతుంటారు. మాకు వస్తుందా అనుకుంటే పోరబాటే. ఎందుకంటే ఈ సారి పోస్టులు సంఖ్య వందలు వేలలో కాదు.. ఏకంగా లక్ష పైచిలుకు వుందంటే అదృష్టాన్ని పరీక్షించుకోక మానుకుంటారా.?

నిజమండీ రైల్వేలో ఏకంగా 1,30,000 పోస్టుల భర్తీ ప్రక్రియను రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్ ఆర్ఆర్‌బీ (RRB) మొదలుపెట్టింది. ఎంప్లాయ్‌మెంట్ న్యూస్ పేపర్ లో ఆర్ఆర్‌బీ ఇచ్చిన ప్రకటన ప్రకారం మొత్తం 1,30,000 ఖాళీలను ఆర్ఆర్‌బీ భర్తీ చేయనుంది. అందులో 1,00,000 లెవెల్-1 పోస్టులు. మిగతా 30,000 వేర్వేరు కేటగిరీల పోస్టులు. నాన్-టెక్నికల్ పాపులర్ కేటగిరీ(NTPC), పారామెడికల్ స్టాఫ్, మినిస్టీరియల్ తో పాటు వేర్వేరు కేటగిరీల్లో పోస్టులను భర్తీ చేయనుంది ఆర్ఆర్‌బీ.

ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం ఎప్పుడంటే..
RRB NTPC పోస్టులుకు- ఫిబ్రవరి 28
పారామెడికల్ స్టాఫ్‌ పోస్టులకు- మార్చి 4
ఆర్ఆర్‌బీ మినిస్టీరియల్, ఇతర కేటగిరీల ఖాళీలకు- మార్చి 8
ఆర్ఆర్‌బీ లెవెల్-1 పోస్టులకు- మార్చి12

జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్, అకౌంట్స్ క్లర్క్ కమ్ టైపిస్ట్, ట్రెయిన్స్ క్లర్క్, కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్, ట్రాఫిక్ అసిస్టెంట్, గూడ్స్ గార్డ్, సీనియర్ కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్, సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్, జూనియర్ అకౌంట్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్, కమర్షియల్ అప్రెంటీస్, స్టేషన్ మాస్టర్ తో పాటు ఇతర పోస్టులకు దరఖాస్తు చేయొచ్చు.

ఇక పారామెడికల్ స్టాఫ్‌లో స్టాఫ్ నర్స్, హెల్త్ అండ్ మలేరియా ఇన్‌స్పెక్టర్, ఫార్మాసిస్ట్, ఈసీజీ టెక్నీషియన్, ల్యాబ్ అసిస్టెంట్, ల్యాబ్ సూపరింటెండెంట్ లాంటి పోస్టులు, ఆర్ఆర్‌బీ మినిస్టీరియల్, ఇతర కేటగిరీల్లో స్టెనోగ్రాఫర్, చీఫ్ లా అసిస్టెంట్, జూనియర్ ట్రాన్స్‌లేటర్(హిందీ) పోస్టులకు దరఖాస్తు చేయొచ్చు. గతేడాది 62,000 గ్రూప్ సీ, డీ పోస్టుల భర్తీ ప్రక్రియ చేపట్టిన ఆర్ఆర్‌బీ ఈ ఏడాది ఏకంగా 1,30,000 రైల్వే ఉద్యోగాల భర్తీ చేస్తుండటం నిరుద్యోగులకు గొప్ప అవకాశం

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles