aircrafts collide mid-air at Aero India 2019 గాల్లో ఢీకొన్న రెండు విమానాలు.. కోపైలెట్ దుర్మరణం

Two surya kiran aircrafts collide mid air at aero india 2019

Yelahanka airbase, Suryakiran aerobatic team, surya kiran aircrafts, Indian Air Force, India, Bengaluru, bangalore

A mid air collision of two Hawk trainer jets occurred at Bengaluru's Aero India show. The condition of the pilots is unknown. The incident happened during the practice session of the Suryakiran aerobatic team (SKAT) of the Indian Air Force. The 12th edition of the air show will showcase latest technologies and products by global aerospace majors.

ITEMVIDEOS: గాల్లో ఢీకొన్న రెండు విమానాలు.. కోపైలెట్ దుర్మరణం

Posted: 02/19/2019 05:23 PM IST
Two surya kiran aircrafts collide mid air at aero india 2019

బెంగళూరులో జరుగుతున్న విమానయాన ప్రదర్శనలో అపశ్రుతి చోటు చేసుకుంది. ఏరో ఇండియా 2019 ఎయిర్ షో రిహార్సల్స్ లో ప్రమాదం చోటుచేసుకుని కో-పైలెట్ మృతి చెందాడు. రేపటి నుంచి అధికారికంగా ప్రారంభం కానున్న ఏరో ఇండియా 2019 ఎయిర్ షో కోసం ఇవాళ వాయుసేన రిహార్సల్స్ చేస్తుండగా, ప్రమాదం సంభవించింది. భారత వాయుసేన విమానాలు విన్యాసాలు చేస్తున్న వేళ, గాల్లో రెండు విమానాలు ఢీకొన్నాయి.

రెండు విమానాల్లో ఇద్దరు పైలెట్లు ఉన్నారు. అందులోని ఒక విమానంలో కో-పైలెట్ కూడా వున్నాడు. అయితే,  గాల్లో విమానాలు ఢీకొన్న వెంటనే ఇద్దరు పైలెట్లు వెంటనే సీట్ ఎజెక్ట్ సిస్టమ్ ద్వారా దూకేసి సురక్షితంగా ల్యాండ్ అయ్యారురు. కాగా, కోపైలెట్ ప్రాణాలు కోల్పోయాడు. ఓ పౌరుడు గాయపడినట్టు బెంగళూరు పోలీసులు తెలిపారు. విమాన శకలాలు ఇస్రో లేఅవుట్ వద్ద పడ్డాయి. వాటిని తొలగించేందుకు చర్యలు చేపట్టారు.

ఇవి రెండూ హక్ ట్రయినర్ జెట్ విమానాలని, సూర్యకిరణ్ ఏరోబెటిక్ టీమ్ లో భాగంగా ప్రదర్శనలో పాల్గొంటున్నాయని, గాల్లో ఢీకొన్న విమానాలు నిర్మానుష్య ప్రాంతంలో కూలడంతో ప్రాణనష్టం తప్పిందని అధికారులు తెలిపారు. ఈ ఘటన తరువాత ఎయిర్ షో రిహార్సల్స్ ను అధికారులు నిలిపివేశారు. అధికారికంగా రేపటి నుంచి ఐదు రోజుల పాటు ప్రదర్శన జరుగనుండగా, నేడు రిహార్సల్స్ జరుగుతున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles