Rape victim ends life days before her wedding పెళ్లికి పక్షం రోజుల ముందు యువతి విషాదంతం..

Rape victim ends life days before her wedding writes suicide note

Nagpur tragic incident, rape victim suicide before marriage, rape victim ended life, Rape, suicide, Nagpur, Moradi, suicide note, Maharashtra, nagpur crime news, nagpur rape case, girl rape before wedding, Politics

A tragic incident took place in Nagpur district of Maharashtra where a rape victim ended her life. The 22-year-old girl was raped two days ago and was depressed after the assault.

పెళ్లికి పక్షం రోజుల ముందు యువతి విషాదంతం..

Posted: 02/19/2019 04:33 PM IST
Rape victim ends life days before her wedding writes suicide note

కలలు కన్నట్టుగానే రాజకుమారుడు తన చేయి అందుకునేందుకు వస్తున్నాడు.. అంటే తనకు వివాహం కుదిరింది. ఈ సంతోష సమయంలో ఆనందంగా వుండాల్సిన ఓ యువతి.. ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. పెద్దలు కుదిర్చిన పెళ్లి ఇష్టం లేక అమె ఇలా అఘాయిత్యానికి పాల్పడిందా.? అంటే కాదు. ఆమె ఇష్టం మేరకే ఈ వివాహ ఏర్పాట్లు చేస్తున్నారు పెద్దలు. సరిగ్గా పెళ్లికి మరో పక్షం రోజుల సమయం వుందనగా అమె ఈ దారుణానికి పాల్పడింది.

అయితే ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంటున్న క్రమంలో అమె ఓ మరణవాంగ్మూలాన్ని కూడా రాసింది. దానిని స్వాధీనం చేసుకున్న పోలీసులు రంగంలోకి దిగి అమె మరణానికి కారణమైన వారిని అదుపులోకి తీసుకున్నారు. తండ్రిని కోల్పోయిన ఈ బాధితురాలు.. పట్టుదలతో ఉన్నత విద్యాను అభ్యసించింది. తన తల్లి, సోదరుడు వ్యవసాయం చేస్తూ అమెను చదివించారు. నాగ్ పూర్ లోని మొరాడి ప్రాంతంలో నివసిస్తున్న ఆమెను ఒక రోజు తనకు పరిచయమున్న యువకుడు బస్టాండు వద్దకు రమ్మని పిలిచాబు.

మొరాడి బస్టాండు వద్దకు చేరుకున్న అమెను ఆ యువకుడు మద్యం సేవించాల్సిందిగా బలవంతం చేశాడు. అందుకు నిరాకరించిన అమెకు ఇది అమె పెళ్లి పార్టీయేనంటూ నమ్మబలికి మరీ మద్యం తాగించాడు. మద్యం మత్తులోకి జారుకున్న అమెపై యువకుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ తరువాత తన ఇద్దరు స్నేహితులు కూడా అమెపై అఘాయిత్యానికి పాల్పడ్డారు. విషయాన్ని ఎవరికైనా చెబితే హతమారుస్తామని కూడా హెచ్చరించారు.

దీంతో సరిగ్గా పెళ్లికి ముందు జరిగిన పరాభవంతో తీవ్ర మానసిక ఒత్తిడికి గురైన అమె.. తన తల్లికి, తమ్ముడికి విషయాన్ని చెప్పలేకపోయింది. పెళ్లైన తరువాత విషయం బయటపడితే తన పరిస్థితి ఏంటని.. తనను ఇంత కష్టపడి పెంచి, చదివించిన తల్లి, సోదరుడు కూడా పరాభవాలను ఎదుర్కోవాల్సి వస్తుందని మానసిక క్షోభకు గురైంది. దీంతో ఇంట్లో ఎవరూ లేని సమయంలో అమె ఉరి వేసుకుని అత్మహత్యకు పాల్పడింది. అమెకు మార్చి 10వ తేదీన వివాహం జరగనుంది. తాను రాసిన మరణవాంగ్మూలంలో తనపై అత్యాచారం జరిపిన ప్రధాన సూత్రదారుడికి మరణశిక్ష్ విధించాలని కోరింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles