chandrababu alleges KCR's hand in defections ప్రధాని, కేసీఆర్ పై చంద్రబాబు సంచలన కామెంట్స్..

Modi is capable of anarchy chandrababu serious allegations on pm

BJP, Chandrababu, PM Modi, Pulwama Terror Attack, tdp, KCR, TDP leaders, Y. S. Rajasekhara Reddy, Telugu Desam Party, Prime Minister of India, Narendra Modi, jaganmohan reddy, amravati, Godra, Andhra pradesh, Politics

AP chief minister N Chandrababu Naidu said Prime Minister Narendra Modi, KCR and Jaganmohan Reddy are hatching conspiracies against AP and TDP, since they are fearful of losing losing the forthcoming elections.

ప్రధాని మోడీ, సీఎం కేసీఆర్ పై చంద్రబాబు సంచలన కామెంట్స్..

Posted: 02/19/2019 03:01 PM IST
Modi is capable of anarchy chandrababu serious allegations on pm

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఏ అరాచకానికైనా సమర్ధుడేనని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. గోద్రాలో 2 వేల మంది ఊచకోతను ఎవరూ మర్చిపోలేరని వ్యాఖ్యానించారు. పుల్వామా దాడిపై అనుమానాలు ఉన్నాయంటూ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ చేసిన వ్యాఖ్యలపై దేశంలో చర్చ జరుగుతోందని ఏపీ సీఎం అన్నారు. దేశభద్రత విషయంలో టీడీపీ రాజీపడబోదన్న చంద్రబాబు.. రాజకీయ లబ్ధి కోసం దేశాన్ని తాకట్టుపెట్టడాన్ని సహించబోమని స్పష్టం చేశారు.

విదేశాలు కూడా మోదీని బాయ్‌కాట్ చేశాయన్న సంగతిని గుర్తిచేశారు. ప్రధానమంత్రి అయిన తరువాతే మోడీని అగ్రదేశాలు పర్యటనకు అనుమతించాయని, అప్పటి వరకు ఆయనను ముఖ్యమంత్రి హోదాలో కూడా తమ దేశంలోకి అడుగుపెట్టనీయలేదని చెప్పారు. బీజేపీ రాజకీయాలతోనే సరిహద్దుల్లో సంక్షోభం నెలకొందని చంద్రబాబు అన్నారు. అయితే పుల్వామా దాడి జరిగిన నేపథ్యంలో చంద్రబాబు ఈ వ్యాఖ్యలు ఎందుకు చేశారనే చర్చ జరుగుతోంది.

మరోవైపు టీడీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలతో జగన్మోహన్ రెడ్డిలో ఫ్రస్ట్రేషన్ పెరిగిందని చంద్రబాబు అన్నారు. హైదరాబాద్‌లో కూర్చుని కేసీఆర్‌తో కలసి కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. పోలవరంపై కేసులు వేసిన వారితో వైసీపీ లాలూచీ పడుతోందని, వాళ్ల కుట్రలు నెరవేరితే ఏపీకి నీళ్లు కూడా రావని చంద్రబాబు అనుమానం వ్యక్తం చేశారు. రాబోయే అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపికపై చంద్రబాబు కసరత్తు చేస్తున్నారు. తమ పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరుతుండటం వెనుక తెలంగాణ సీఎం కేసీఆర్ కుట్ర ఉందని సంచలన విమర్శలు చేశారు.

ఫిరాయింపులను కేసీఆర్ ప్రోత్సహిస్తున్నారని, జగన్ తో కలిసి ఏపీ అభివృద్ధిని అడ్డుకోవడమే ఆయన లక్ష్యమని నిప్పులు చెరిగారు. ఇలా చేరడం వల్ల తెలంగాణలో వారి ఆస్తులకు ఆయనే పూచి ఇస్తున్నారని చంద్రబాబు ఆరోపించారు. 'అన్నదాత సుఖీభవ' పథకాన్ని రైతులంతా స్వాగతిస్తున్నారని, ఇప్పటికే రైతుల ఖాతాల్లో రూ. 1000 జమ చేశామని చంద్రబాబు చెప్పారు. పేదల సంక్షేమ పథకాల విషయంలో ఏపీ రోల్ మోడల్ గా నిలిచిందన్నారు. ఏపీలో ప్రాజెక్టులను అడ్డుకుంటున్న వారితో జగన్ చేతులు కలిపారని, ఈ కుట్రదారులకు ప్రజలే గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : BJP  Chandrababu  PM Modi  Pulwama Terror Attack  tdp  KCR  TDP leaders  Godra  Andhra pradesh  Politics  

Other Articles