Shiv Sena partners with BJP for LS polls శివసేన యూ-టార్న్.. బీజేపితో కలసి సార్వత్రికానికి..

Lok sabha elections 2019 shiv sena bjp announce tie up

Shiv Sena, Sanjay Raut, BJP, 2019 Lok Sabha elections, Mahagathbandhan, BJP-ShivSena, Narendra Modi, Uddhav Thackeray, Devendra Fadnavis, Amit Shah, piyush goel, prakash javadekar, Social media, Politics

The Shiv Sena will partner with BJP in coming General election after agreeing on a seat-sharing plan in Maharashtra. With the tie-up with the BJP Shiv Sena, which said last year it would contest the election on its own had taken a U-turn.

శివసేన యూ-టార్న్.. బీజేపితో కలసి సార్వత్రికానికి..

Posted: 02/19/2019 01:25 PM IST
Lok sabha elections 2019 shiv sena bjp announce tie up

కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వానికి మిత్రపక్షంగా వ్యవహరిస్తున్నా.. ఎప్పటికప్పుడు ప్రధాని నరేంద్రమోడీ పాలనపై బీజేపి వ్యవహరతీరుపై ఘాటైన విమర్శలు చేస్తున్న శివసేన తాజాగా యూ-టార్న్ తీసుకుంది. బీజేపీ తరఫున ప్రధాని అభ్యర్థిగా నరేంద్రమోదీ ఉంటే ఎన్డీయేలో తాము భాగస్వామ్యం కాబోమని తేల్చిచెప్పిన శివసేన.. తన పంథాను మార్చుకుంది. ప్రధానిగా మోడీకి మద్దతు ఇవ్వబోమని స్పష్టం చేసిన శివసేన.. తన ధోరణి మార్చుకుని ఇక బీజేపితో జతకట్టే సార్వత్రిక ఎన్నికలకు వెళ్లనుంది.

మహారాష్ట్రలో బీజేపీ-శివసేన మధ్య సీట్ల సర్దుబాటు వ్యవహారం ఎట్టకేలకు కొలిక్కివచ్చింది. ఉన్నతస్థాయి సమావేశంలో బీజేపి జాతీయ అధ్యక్షుడు అమిత్ షా, మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్, కేంద్రమంత్రి పియూష్ గోయల్, ప్రకాష్ జావదేకర్ లతో జరిగిన సమావేశంలో తరువాత వీరంతా కలసి ‘శివసేన’ అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రే నివాసానికి వెళ్లి.. సార్వత్రిక ఎన్నికలలో సీట్ల సర్దుబాటు విషయమై కూలంకుషంగా చర్చించారు. అనంతరం ఈ మేరకు మహా సీఎం ఫడ్నవీస్ ఆ వివరాలను మీడియాకు తెలిపారు.

రానున్న లోక్ సభ, మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో మహారాష్ట్రలో శివసేనతో కలిస బీజేపి పోటీ చేస్తామని ఆయన వెల్లడించారు. లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ 25 స్థానాల్లో, శివసేన 23 స్థానాల్లో పోటీ చేస్తాయని చెప్పారు. ఈ ఎన్నికల్లో ఎన్డీఏ విజయం సాధించి అధికారంలో కొస్తుందని ఫడ్నవీస్ ధీమా వ్యక్తం చేశారు. కాగా ఈ సందర్భంగా అయోధ్యలో రామ మందిరం నిర్మించాలన్న ఉద్దవ్ థాక్రే డిమాండ్ కు తాము కట్టుబడి ఉన్నామని చెప్పారు. మహారాష్ట్రకు సంబంధించిన విషయాల్లో శివసేన చేసిన కొన్ని డిమాండ్లకు తాము అంగీకరించినట్టు ఫడ్నవీస్ వివరించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles