CBSE two levels for class 10 Maths exam పదో తరగతి విద్యార్థులకు సిబిఎస్ఈ న్యూఇయర్ గిఫ్ట్..

Cbse to introduce two levels for class 10 maths exam from 2020

Education News,mathematics,Central Board of Secondary Education,CBSE Class 10 mathematics board exam,CBSE Class 10 mathematics,CBSE 2 levels of mathematics,2 levels of mathematics

The Central Board of Secondary Education (CBSE) is going to introduce two levels of Mathematics for students of Class X for different needs for the academic year 2019-20.

పదో తరగతి విద్యార్థులకు సిబిఎస్ఈ న్యూఇయర్ గిఫ్ట్..

Posted: 01/11/2019 08:45 PM IST
Cbse to introduce two levels for class 10 maths exam from 2020

సీబీఎస్ఈ పదవ తరగతి విద్యార్ధుతకు సీనియర్ సెకండరీ బోర్డు న్యూఇయర్ గిప్ట్ ను అందించింది. అయితే అది ఇప్పుడే పదో తరగతి పరీక్షలు రాస్తున్న విద్యార్థులకు మాత్రం వర్తించదు. వచ్చే విద్యాసంవత్సరం నుంచి పదవ తరగతి పరీక్షలను రాసే విద్యార్థులకు శుభావార్తను అందించింది. పదవ తరగతిలో గణితం (మ్యాథ్స్) అంటే భయపడే విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు రిలీఫ్ కల్పిస్తూ మంచి నిర్ణయం తీసుకుని దానిని ఇవాళ ప్రకటించింది.

ఇక పిల్లల లెక్కల పుస్తకాలతో పేరెంట్స్ కుస్తీ పట్టక్కర్లేదు. మ్యాథ్స్ ఎగ్జామ్ అంటే పిల్లలకు చలి జ్వరం అసలేరాదు. సిబిఎస్ఈ తీసుకున్న ఈ నిర్ణయంతో అందరూ ఫ్రీ అయిపోవచ్చు. అసలా నిర్ణయం ఎంటంటే.. 10వ తరగతి మ్యాథ్స్ ను రెండు లెవల్స్ గా డివైడ్ చేసింది సీబీఎస్ఈ. ఈ రెండింటిలో ఏ లెవల్లో  పరీక్ష రాయాలో నిర్ణయం స్టూడెంట్స్ ఇష్టం. లెవల్-1 పరీక్ష ఇంతకు ముందులానే ఉంటుంది. లెవల్-2 మాత్రం ఈజీగా ఉంటుంది.

అయితే సిలబస్ ఏ మాత్రం మార్చడం లేదు. ఏ లెవల్ సెలక్ట్ చేసుకున్నా టీచర్లు మొత్తం సిలబస్ చెబుతారు. లెవల్-2 వారికి పరీక్ష మాత్రం ఈజీగా ఉంటుంది. ఈ రూల్ ఫైనల్ ఎగ్జామ్ కే కాదు.. ఇంటర్నల్ ఎగ్జామ్స్ కు కూడా ఉంటుంది. స్కూల్ లోని విద్యార్థులు ఏ లెవల్ సెలక్ట్ చేసుకున్నారన్న లిస్ట్ హెచ్ ఎం/ప్రిన్సిపాల్ డీటైల్డ్ గా బోర్డుకు వివరిస్తారు. అయితే అసలు విషయం ఏంటంటే ఈ కొత్త రూల్ వచ్చే సంవత్సరం (2020) నుంచి అమలులోకి వస్తుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles